Tollywood: బాక్సాఫీస్ షేక్ చేస్తున్న సినిమా.. రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్.. అయినా అద్దె ఇంట్లోకి హీరోయిన్..

బీచ్ కు ఎదురుగా ఉన్న ఈ బిల్డింగ్ లో హీరో అక్షయ్ కుమార్ అఫార్ట్మెంట్ కూడా ఉండడం విశేషం. ప్రస్తుతం హృతిక్ ఉంటున్న ఇంటి అద్దె నెలకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుందట. నిజానికి ఈ ఇంట్లో హీరో వరుణ్ ధావన్ ఉండాలనుకున్నారు. కానీ డీల్ కుదరకపోవడంతో కుదరలేదు. ఇప్పుడు శ్రద్ధా కపూర్ అదే ఇంట్లోకి వెళ్లడానికి రెడీ అయ్యింది. ఇ

Tollywood: బాక్సాఫీస్ షేక్ చేస్తున్న సినిమా.. రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్.. అయినా అద్దె ఇంట్లోకి హీరోయిన్..
Actress
Follow us

|

Updated on: Aug 29, 2024 | 7:30 AM

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న సినిమా స్త్రీ 2. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది శ్రద్ధా కపూర్. ఇందులో రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి కీలకపాత్రలు పోషించారు. హారర్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఇప్పుడు రికార్డ్ బద్దలుకొడుతుంది. అయితే ఓవైపు తన సినిమా కోట్లు కొల్లగొడుతుంటే.. మరోవైపు హీరోయిన్ మాత్రం అద్దె ఇంట్లోకి షిఫ్ట్ అవుతుందట. అవును.. ఇప్పుడు హీరోయిన్ శ్రద్ధా కపూర్ కొత్తిళ్లు వెతుక్కుంది. ముంబైలోని జుహు ప్రాంతంలో స్టార్ సెలబ్రెటీస్ ఉండే ఏరియాలోనే ఈ బ్యూటీ అద్దెకు ఉండనుందట. ప్రస్తుతం ఆ ఇంట్లో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ఉంటున్నారు. త్వరలోనే ఇదే ఇంట్లోకి శ్రద్ధా షిఫ్ట్ కానుంది.

బీచ్ కు ఎదురుగా ఉన్న ఈ బిల్డింగ్ లో హీరో అక్షయ్ కుమార్ అఫార్ట్మెంట్ కూడా ఉండడం విశేషం. ప్రస్తుతం హృతిక్ ఉంటున్న ఇంటి అద్దె నెలకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుందట. నిజానికి ఈ ఇంట్లో హీరో వరుణ్ ధావన్ ఉండాలనుకున్నారు. కానీ డీల్ కుదరకపోవడంతో కుదరలేదు. ఇప్పుడు శ్రద్ధా కపూర్ అదే ఇంట్లోకి వెళ్లడానికి రెడీ అయ్యింది. ఇదిలా ఉంటే స్త్రీ 2 చిత్రంలో అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్ అతిథి పాత్రలలో నటించారు. ఈ సినిమా క్లైమాక్స్ లో భేడియాగా సర్కటాతో ఫైట్, శ్రద్ధా కపూర్ తో రొమాన్స్ తో వరుణ్ ఆకట్టుకున్నాడు. అంటే.. వరుణ్ భేడియా మూవీ సీక్వెల్లో శ్రద్ధ రోల్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం స్త్రీ 2 సినిమా దూసుకుపోతుంది. ఆగస్ట్ 15న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తుంది. 13 రోజుల్లోనే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక ఇండియాలోనే రూ.414 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టడం విశేషం. శ్రద్ధా ఇల్లు మారడానికి కారణం ఉంది. 1987లో శ్రద్ధా తండ్రి శక్తి కపూర్.. జుహూలోనే ఓ ఇంటిని కొన్నారు. ఇప్పుడు దానిని రీమోడలింగ్ చేయాలనుకుంటున్నారని.. అందుకే కొన్నాళ్లపాటు శ్రద్ధా వేరే ఇంట్లో ఉండనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కేఎల్ రాహుల్‌కు లక్నో షాక్.. కెప్టెన్సీ నుంచి తొలగింపు!
కేఎల్ రాహుల్‌కు లక్నో షాక్.. కెప్టెన్సీ నుంచి తొలగింపు!
స్నానం చేసే నీటిలో వీటిని కలిపి చేస్తే అదృష్టమే అదృష్టం..
స్నానం చేసే నీటిలో వీటిని కలిపి చేస్తే అదృష్టమే అదృష్టం..
శ్రీకాళహస్తి సోషల్‌ టీచర్‌ను వరించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
శ్రీకాళహస్తి సోషల్‌ టీచర్‌ను వరించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
రెడ్ డ్రెస్ లో బన్నీ వాక్స్ అందాలు.. పిక్స్ వైరల్
రెడ్ డ్రెస్ లో బన్నీ వాక్స్ అందాలు.. పిక్స్ వైరల్
బ్రిటన్ రాణి విక్టోరియా ఇష్టపడిన మధుర పెడ గురించి తెలుసా..
బ్రిటన్ రాణి విక్టోరియా ఇష్టపడిన మధుర పెడ గురించి తెలుసా..
2,280 జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాల భర్తీకి సర్కార్‌ గ్రీన్ సిగ్నల్
2,280 జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాల భర్తీకి సర్కార్‌ గ్రీన్ సిగ్నల్
రేస్ లో నుండి తప్పుకున్న కంగువ !! సోలోగా రానున్న సూపర్ స్టార్
రేస్ లో నుండి తప్పుకున్న కంగువ !! సోలోగా రానున్న సూపర్ స్టార్
మరోసారి 'డీప్ ఫేక్’ బారిన కింగ్ కోహ్లీ.. ఏకంగా అలా చూపించారేంటి?
మరోసారి 'డీప్ ఫేక్’ బారిన కింగ్ కోహ్లీ.. ఏకంగా అలా చూపించారేంటి?
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో