Saripodhaa Sanivaaram Twitter Review: ‘సరిపోదా శనివారం’ ట్విట్టర్ రివ్యూ.. నాని, ఎస్‏జే సూర్య అదిరింది..

ఆగస్ట్ 29న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అడియన్స్ ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్ లో షోలు పడ్డాయి. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని చోట్ల షోస్ పడగా.. ట్విట్టర్ వేదికగా సరిపోదా శనివారం హంగామా షూరు చేశారు ఫ్యాన్స్. న్యాచురల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందంటూ నెట్టింట చర్చించుకుంటున్నారు.

Saripodhaa Sanivaaram Twitter Review: 'సరిపోదా శనివారం' ట్విట్టర్ రివ్యూ.. నాని, ఎస్‏జే సూర్య అదిరింది..
Saripodhaa Sanivaaram Twitt
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 29, 2024 | 6:57 AM

హాయ్ నాన్న వంటి సూపర్ హిట్ తర్వాత న్యాచులర్ స్టార్ నాని నటించిన లేటేస్ట్ చిత్రం సరిపోదా శనివారం. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విలన్‏గా ఎస్జే సూర్య నటించాడు. ఇందులో కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‏లతో సినిమాపై హైప్ పెంచేశాడు నాని. అలాగే ఇందులో ఈసారి పక్కా మాస్ పాత్రలో అలరించనున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియోస్ చూస్తే తెలుస్తోంది. ఆగస్ట్ 29న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అడియన్స్ ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్ లో షోలు పడ్డాయి. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని చోట్ల షోస్ పడగా.. ట్విట్టర్ వేదికగా సరిపోదా శనివారం హంగామా షూరు చేశారు ఫ్యాన్స్. న్యాచురల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందంటూ నెట్టింట చర్చించుకుంటున్నారు.

ట్విట్టర్ రివ్యూస్..

ఇవి కూడా చదవండి

సరిపోదా శనివారం సినిమా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ మూవీ కాకపోతే.. శనివారం మాత్రమే ఫైట్ చేస్తాడనే కాన్సెప్ట్ తో ఉంటుందని.. నాని, ఎస్జే సూర్యల ఫర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయిందట. ఇక యాక్షన్ సీక్వెన్స్ ఫీస్ట్ లా ఉంటుందని.. ఆర్ఆర్ మాత్రం పగిలిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఫస్ట్ హాఫ్ లో నాని, ఎస్జే సూర్యల పర్ఫార్మెన్స్ అదిరిపోయిందని..వీరిద్దరి కోసమే ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడాల్సిందేనని.. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిందని ట్వీట్ చేస్తున్నారు . పోతారు.. మొత్తం పోతారు.. ఇక సెకండాఫ్ వచ్చే సరికి కాస్త బోరింగ్ అయినా.. మాస్ ను మాత్రం ఎంటర్టైన్ చేస్తుందని.. బీజీఎం స్పెషల్ అట్రాక్షన్ అంటూ ట్వీట్ చేస్తున్నారు. ప్రస్తుతం ట్వీట్టర్ లో సరిపోదా శనివారం చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఒకట్రెండు మిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ ఎస్జే సూర్య, నాని యాక్టింగ్ కోసం పక్కా ఈ మూవీ చూడాల్సిందే అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.