Tollywood: పెళ్లి చేసుకుంటానని టార్చర్ పెడుతోన్న 17 ఏళ్ల కుర్రాడు.. ఈ టాలీవుడ్ హీరోయిన్ ఏం చేసిందో తెలుసా?
అభిమానులమంటూ కొందరు పోకిరీలు హీరోలు, హీరోయిన్ల పట్ల నీచంగా ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు తరచూ ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుంటారు. అయితే చాలా మంది వీటిని బయట పెట్టరు. మరికొంత మంది నటీమణులు మాత్రం ధైర్యంగా ఇలాంటి విషయాలను షేర్ చేసుకుంటారు.

ఇతరులతో పోల్చుకుంటే సినిమా తారలకు పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారు. ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరో/హీరోయిన్లను కలుద్దామా? కనీసం సెల్పీ అయినా దిగుదామా? అని కలలు కంటుంటారు. అటు సెలెబ్రిటీలు కూడా అభిమానులకు దగ్గరగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. వీలు కుదిరినప్పుడల్లా తమ ఫ్యాన్స్ తో సోషల్ మీడియా వేదికగా ముచ్చటిస్తుంటారు. నెటిజన్లు అడిగే ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానం చెబుతుంటారు. అయితే ఇదే క్రమంలో కొంతమంది అభిమానులు సెలబ్రిటీలను బాగా ఇబ్బంది పెడుతుంటారు. ముఖ్యంగా హీరోయిన్లను. సందర్భం లేని, తలా తోక లేని, అసభ్యకర ప్రశ్నలు, మెసేజులు పంపిస్తుంటారు. చాలా మంది వీటిని పెద్దగా పట్టించుకోరు. కానీ కొందరు మాత్రం ఊరికే ఉండరు. సదరు అభిమానులను తలంటు వాయిస్తుంటారు. ఒక ఫేమస్ హీరోయిన్ ఇప్పుడు అదే పని చేసింది. తనను పెళ్లి చేసుకోమని వేధిస్తోన్న ఓ అభిమానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన అవంతిక మోహన్ తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించిందీ అందాల తార. అలాగే ‘రాజారాణి’ అనే సీరియల్ లో నటించి బుల్లితెర ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది. ప్రస్తుతం పలు సినిమాలు, సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంటోంది అవంతిక. అయితే ఇటీవల ఒక అభిమాని తనను పెళ్లి చేసుకోవాలని పదేపదే అవంతికకు మెసేజులు చేస్తున్నాడట. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ అభిమాని వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. ప్రతిరోజు మెసేజులు పెడుతూ.. ఫోన్ చేస్తూ విసిగిస్తున్న ఆ కుర్రాడికి బాగా తలంటు పోసింది అవంతిక. సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
‘పదేపదే పెళ్లి చేసుకోమని మెసేజ్‌లు చేస్తోన్న ఓ చిన్ని అభిమానికి నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నీకింకా 16 లేదా 17 ఏళ్లు ఉంటాయనుకుంటా.. జీవితమంటే ఏంటో నీకింకా పూర్తిగా తెలీదు. ఏడాదికాలంగా నన్ను పెళ్లి చేసుకోమని వెంటపడుతున్నావ్.. కానీ, నువ్వింకా చిన్నపిల్లాడివి. పెళ్లికి బదులుగా పరీక్షల కోసం ఆలోచించాల్సిన వయసులో ఉన్నావ్! నీకంటే నేను చాలా పెద్దదాన్ని. ఒకవేళ మనిద్దరం పెళ్లి చేసుకున్నామనుకో.. అందరూ నన్ను నీ భార్య అనుకోరు, నీ తల్లిగానే చూస్తారు. కాబట్టి బుద్ధిగా చదువుకో.. సరైన సమయం వచ్చినప్పుడు నీ లైఫ్‌లోనూ మంచి ప్రేమకథ స్టార్ట్ అవుతుంది’ అని సున్నితంగా చెప్పుకొచ్చింది.
చీరలో అవంతికా మోహన్.
View this post on Instagram
17 ఏళ్ల కుర్రాడి విషయంలో అవంతిక వ్యవహరించిన తీరు ప్రశంసలు అందుకుంటుంది. అభిమాని బాధపడకుండా సున్నితంగా చెప్పిన తీరు ముచ్చట గొలుపుతోంది. అదే సమయంలో కొంత మంది నెటిజన్లు ఆ 17 ఏళ్ల అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీ వయసెంత నువ్వు మాట్లాడే మాటలు ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా 2017లో అనిల్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లాడింది అవంతిక. ప్రస్తుతం ఈ దంపతులకు రుద్రాన్ష్ అనే కుమారుడు సంతానం.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








