AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: ‘ఆదిపురుష్’ కోసం భారీగా ప్లాన్ చేస్తున్నారు.. ఏకంగా అన్ని థియేటర్లలో ట్రైలర్ రిలీజ్..

ఇప్పుడు ఆదిపురుష్ సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తోంది. కొద్ది రోజులుగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ట్రైలర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Adipurush: 'ఆదిపురుష్' కోసం భారీగా ప్లాన్ చేస్తున్నారు.. ఏకంగా అన్ని థియేటర్లలో ట్రైలర్ రిలీజ్..
adipurush
Rajitha Chanti
|

Updated on: May 05, 2023 | 9:58 AM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మొదటిసారి రాముడి పాత్రలో కనిపించబోతున్నారు. దీంతో ఆదిపురుష్ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్‏గా వెయిట్ చేస్తున్నారు. అంతేకాకుండా.. హిందీలో తానాజీ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ రూపొందించిన డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తుండడంతో ముందు నుంచి ఈ సినిమాపై కాస్త ఎక్కువగానే అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులకు ఆదిపురుష్ టీజర్ తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇందుకు కారణం అందులో పాత్రల లుక్స్.. గ్రాఫిక్స్ ఎక్కువ కావడమే. ముఖ్యంగా రావణుడు, హానుమాన్ పాత్రల లుక్స్ చూడగానే హాలీవుడ్ ఫీలింగ్ వచ్చేసిందంటూ విమర్శలు వచ్చాయి. అలాగే.. రామయాణంలోని రాముడు, సీత, రావణ పాత్రలను అవమానించారంటూ చిత్రయూనిట్ పై ఫిర్యాదులు వెలువడ్డాయి. దీంతో చిత్రయూనిట్ వెనకడుగు వేసి తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన చిత్రాన్ని జూన్ 16కు వాయిదా వేసింది.

ఇప్పుడు ఆదిపురుష్ సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తోంది. కొద్ది రోజులుగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ట్రైలర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మే 9న సాయంత్రం 5.30 నిమిషాలకు థియేటర్లలో అలాగే యూట్యూబ్ వేదికగా ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం 105 థియేటర్లలో ఆదిపురుష్ ట్రైలర్ విడుదల కాబోతుందని తెలుస్తోంది. అంతేకాకుండా ప్రభాస్ అభిమానులను ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీ ప్రమోషన్స్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

ఇవి కూడా చదవండి

రామాయణ ఇతిహాసం ఆధారంగా వస్తున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా.. సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు.. హిందీ, కన్నడ, మలయాళం, తమిళంలో జూన్ 16న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు.