Mahesh Babu: భార్యను మ్యానేజ్ చేయడం ఎలా ?.. సుమ ప్రశ్నకు మహేష్ రియాక్షన్ చూశారా ?..
సోమవారం హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన ఈవేడుకకు మహేష్, రాజమౌళి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇదే వేడుకలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్.. మహేష్ బాబును డాన్స్ చేయాలని కోరగా.. చిన్న స్టెప్పు వేశారు. అనంతరం అభిమానులను ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అయితే ఈవెంట్ చివర్లో మహేష్ బాబును ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ చేశారు యాంకర్ సుమ. యానిమల్ సినిమాలో ఫాదర్ అండ్ సన్ రిలేషన్ తోపాటు భార్యభర్తల బంధం గురించి చూపించబోతున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా కోసం ఘట్టమనేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇదిలాఉంటే.. ఇటీవల యానిమల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు మహేష్. సోమవారం హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన ఈవేడుకకు మహేష్, రాజమౌళి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇదే వేడుకలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్.. మహేష్ బాబును డాన్స్ చేయాలని కోరగా.. చిన్న స్టెప్పు వేశారు. అనంతరం అభిమానులను ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అయితే ఈవెంట్ చివర్లో మహేష్ బాబును ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ చేశారు యాంకర్ సుమ. యానిమల్ సినిమాలో ఫాదర్ అండ్ సన్ రిలేషన్ తోపాటు భార్యభర్తల బంధం గురించి చూపించబోతున్నారు. దీంతో నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుమ మహేష్ బాబుతో ఫన్నీగా క్వశ్చన్ చేశారు.
“కృష్ణ గారు మిమ్మల్ని కోప్పడిన సందర్భం ఒకటి చెప్పండి” అంటూ అడిగారు సుమ. ఇక మహేష్ బదులిస్తూ.. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఈ సినిమా చూపించినంత ఫాదర్ అండ్ సన్ రిలేషన్ అయితే నేను చూడలేదు అంటూ చెప్పుకొచ్చారు. అలాగే భర్తలు భార్యలను ఎలా మ్యానేజ్ చేయాలనే విషయంలో ఏదైనా టిప్స్ ఇస్తారా అని అడగ్గా.. భర్తలు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటే చాలు. ఏ సందర్భం అయినా నవ్వుతూ ఉండండి. మ్యానేజ్ చేయడానికి అది ఒక్కటే దారి అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అలాగే డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటించబోయే సినిమా అప్డేట్స్ కాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి చెప్పాలని అడిగింది. అయితే సింపుల్ గా ఇంకా సమయం ఉందంటూ రిప్లై ఇచ్చారు.
ఇక యానిమల్ సినిమా విషయానికి వస్తే.. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన సినిమా యానిమల్. ఈ చిత్రానికి సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 1న ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.
I’m a HUGE fan of Ranbir Kapoor & he is the BEST Actor in India – Superstar #MaheshBabu pic.twitter.com/pkGsAC46G5
— RKᴬ (@seeuatthemovie) November 27, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.