ఈ సంక్రాంతికి నేను రావడం లేదు.. ఫ్యామిలీ స్టార్ కు బాలయ్య బంపర్ ఆఫర్
ఈ సంక్రాంతికి నేను రావడం లేదు. ఆ గ్యాప్‌ని నువ్వు వాడుకో అని ఓ సీనియర్ హీరో యంగ్ హీరోని హార్టఫుల్‌గా విష్ చేశారంటేనే, సక్సెస్ సగం వచ్చినంత బలంగా ఉంటుంది. ఆ బలం ఎంత బలంగా ఉంటుందో ఇప్పుడు విజయ్ దేవరకొండకి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన్ని కమాన్ అంటూ ఎంకరేజ్ చేస్తున్నది బాలకృష్ణ కాబట్టి. మరి ఆ సీజన్‌ని కేప్చర్ చేస్తున్న మిగిలిన వాళ్ల మనసుల్లో ఏముంది? ఈ సారి అన్‌స్టాపబుల్ షోలో పార్టిసిపేట్ చేసింది యానిమల్ టీమ్ అయినా, మన దగ్గర మాత్రం రౌడీ హీరో అభిమానులకు కడుపు నిండిపోయింది.
Updated on: Nov 28, 2023 | 1:27 PM

ఈ సంక్రాంతికి నేను రావడం లేదు. ఆ గ్యాప్‌ని నువ్వు వాడుకో అని ఓ సీనియర్ హీరో యంగ్ హీరోని హార్టఫుల్‌గా విష్ చేశారంటేనే, సక్సెస్ సగం వచ్చినంత బలంగా ఉంటుంది. ఆ బలం ఎంత బలంగా ఉంటుందో ఇప్పుడు విజయ్ దేవరకొండకి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన్ని కమాన్ అంటూ ఎంకరేజ్ చేస్తున్నది బాలకృష్ణ కాబట్టి. మరి ఆ సీజన్‌ని కేప్చర్ చేస్తున్న మిగిలిన వాళ్ల మనసుల్లో ఏముంది?

ఈ సారి అన్‌స్టాపబుల్ షోలో పార్టిసిపేట్ చేసింది యానిమల్ టీమ్ అయినా, మన దగ్గర మాత్రం రౌడీ హీరో అభిమానులకు కడుపు నిండిపోయింది. స్క్రీన్ మీద రష్మిక, సందీప్, బాలయ్య, రణ్‌బీర్.. అందరూ విజయ్ దేవరకొండ గురించి అన్‌స్టాపబుల్‌గా మాట్లాడుతూనే ఉన్నారు. బాలయ్యయితే ఓ స్టెప్ ఫార్వర్డ్ వెళ్లి, 'ఫ్యామిలీ స్టార్... ఈ సంక్రాంతికి నేను రావడం లేదు. ఆ స్పేస్‌ని నువ్వు వాడుకో' అని బ్లెస్సింగ్స్ ఇచ్చేశారు. దీంతో ఫ్యామిలీ స్టార్ అభిమానుల జోష్ మామూలుగా లేదు.

ఆల్రెడీ ఈ సంక్రాంతికి రావడం పక్కా అని మహేష్ మళ్లీ మళ్లీ చెబుతూనే ఉన్నారు. అటు గుంటూరు కారం నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా ఈ పొంగల్ తమకు చాలా ప్రెస్టీజియస్ అని అంటున్నారు. ఈ సంక్రాంతి మీద ఫుల్ ఫోకస్‌తో ఉన్నట్టు, కలెక్షన్లు కుమ్మరిస్తామంటూ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు ప్రొడ్యూసర్ gunturu karam

ఇటు ఈగిల్ మేకర్స్ అయితే... చూస్కోండి బాబూ 50 రోజుల కౌంట్‌డౌన్ బిగిన్ అయిందని సిగ్నల్స్ ఇచ్చేశారు. ఈ ఏడాది పండగతో పాజిటివ్ హిట్అందుకున్న మాస్ మహరాజ్, నెక్స్ట్ ఇయర్ ఈగిల్ మీద ఎక్కువ హోప్సే పెట్టుకున్నారు.

భారీ సినిమాల మధ్య బుల్లి హీరో తేజ సజ్జా హనుమాన్‌తో వస్తున్నారు. అటు విక్టరీ హీరో వెంకటేష్ అయితే ఒకేసారి రెండు కాలేజీల్లో ప్రమోషనల్ యాక్టివిటీస్‌ని ప్లాన్ చేస్తూ, ట్రెండ్ సెట్ చేయడమంటే ఇదేనమ్మా... సైంధవ్ కూడా ట్రెండ్‌లోనే ఉంటుంది. వావ్ వావ్ అంటారు అంటూ కుర్రకారులో హుషారు పెంచుతున్నారు.




