AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu and Nagarjuna : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నాగ్-మహేష్ చాటింగ్.. ఏం మాట్లాడుకున్నారంటే..

టాలీవుడ్ స్టార్ హీరోలు ఎంతో స్నేహభావంతో ఉంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. సినిమాల విషయంలో హెల్ధీ కాంపిటేషన్ ఉన్నపటికీ బయట మాత్రం ఎంతో సోదరభావంతో మెలుగుతూ ఉంటారు.

Mahesh Babu and Nagarjuna : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నాగ్-మహేష్ చాటింగ్.. ఏం మాట్లాడుకున్నారంటే..
Nag
Rajeev Rayala
|

Updated on: Mar 13, 2021 | 12:38 AM

Share

Mahesh Babu and Nagarjuna : టాలీవుడ్ స్టార్ హీరోలు ఎంతో స్నేహభావంతో ఉంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. సినిమాల విషయంలో హెల్ధీ కాంపిటేషన్ ఉన్నపటికీ బయట మాత్రం ఎంతో సోదరభావంతో మెలుగుతూ ఉంటారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..కాంట్రవర్సీలకు దూరంగా ఉండే మహేష్. టాలీవుడ్ స్టార్ హీరోలతో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అక్కినేని సుమంత్, వెంకటేష్, నాగార్జున, చిరంజీవి ఇలా చాలా మందితో మహేష్ స్నేహంగా మెలుగుతుంటారు. ఇక సోషల్ మీడియాలో యాటివ్ గా ఉండే మహేష్ కుర్ర హీరోల సినిమాలను కూడా పొగుడుతూ వారికీ ప్రోత్సాహాన్ని అందిస్తుంటాడు.

ఇదిలా ఉంటే తాజాగా కింగ్ నాగార్జున, మహేష్ బాబు చేసుకున్న వాట్సాప్ చాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా మెగాస్టార్ చేతులమీదుగా వైల్డ్ డాగ్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసింది చిత్రయూనిట్. యాక్షన్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) బృందం చుట్టూ తిరుగుతుంది. అయితే ట్రైలర్ విడుదలయ్యాక సినిమా పై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయని చెప్పాలి. అయితే ఈ సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉండటంతో పలువురు నాగ్ కు అభినందనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా నాగ్ కు అభినందనలు తెలిపారు. గతంలో మహేష్ వైల్డ్ డాగ్ టీజర్ చూసి టెర్రిఫిక్ గా ఉందని నాగార్జునకు పర్సనల్ గా మెస్సేజ్ చేశాడు. అయితే మహేష్ తో చాటింగ్ స్క్రీన్ షాట్ ను ట్రైలర్ రిలీజ్ చేసే ముందు సోషల్ మీడియాలో షేర్ చేసాడు నాగ్. ఇప్పడు ఈ చాట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.  ఇక మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bhumika Chawla : బంగార్రాజుగా కింగ్ నాగార్జున .. నాగ్ కోసం విలన్ అవతారమెత్తనున్న స్టార్ హీరోయిన్..

Toofan Movie Teaser Out : ఫర్హాన్ అక్తర్ ‘తుఫాన్’ టీజర్‌ రిలీజ్.. పంచ్ డైలాగ్స్‌తో అదరగొడుతున్న బాక్సర్..