Gopichand : ‘సీటీమార్’ సినిమానుంచి జ్వాలారెడ్డి సాంగ్.. మరోసారి మాస్ మాసాల సాంగ్ తో అదరగొట్టిన మ‌ణిశ‌ర్మ

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘సీటీమార్‌’. గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో

Gopichand : 'సీటీమార్' సినిమానుంచి జ్వాలారెడ్డి సాంగ్..  మరోసారి మాస్ మాసాల సాంగ్ తో అదరగొట్టిన మ‌ణిశ‌ర్మ
Seetimaarr
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 13, 2021 | 10:26 AM

Gopichand : ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘సీటీమార్‌’. గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి  మెలొడిబ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ భుమిక కీల‌క పాత్ర‌లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో తమన్నా తెలంగాణ కబడ్డీ టీమ్ కోచ్ గా కనిపిస్తుండగా గోపీచంద్ ఆంధ్ర టీమ్ కోచ్ గా కనిపించనున్నాడు. ఇక ప‌వ‌ర్‌ప్యాక్డ్ పెర్‌ఫామెన్స్‌ల‌తో రీసెంట్‌గా విడుద‌లైన ట్రైల‌ర్ కి, పాట‌ల‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. కాగా ఈ మూవీలోని తెలంగాణ ఫొక్ సాంగ్ `జ్వాలారెడ్డి` లిరిక‌ల్ సాంగ్‌ని ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రిలీజ్ చేశారు.

‘జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి.. తెలంగాణ బిడ్డరో.. కారా బూంది లడ్డురో.. కారా బూంది లడ్డురో ఆడించే కబడ్డిరో.. బాలారెడ్డి బాలారెడ్డి ఆంధ్రా టీం హెడ్డురో.. కోనసీమ బ్లడ్డురో.. కోనసీమ బ్లడ్డురో’ అంటూ అంటూ సాగే ఈ తెలంగాణ మాస్ ఫోక్ సాంగ్‌కి మెలొడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందించ‌గా శంక‌ర్‌బాబు, మంగ్లీ ఆల‌పించారు. ఈ సాంగ్‌కి సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్‌చేయ‌నున్నారు. రావు రమేష్ – తరుణ్ అరోరా – పోసాని కృష్ణ మురళి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సుందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mahesh Babu and Nagarjuna : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నాగ్-మహేష్ చాటింగ్.. ఏం మాట్లాడుకున్నారంటే..

Bhumika Chawla : బంగార్రాజుగా కింగ్ నాగార్జున .. నాగ్ కోసం విలన్ అవతారమెత్తనున్న స్టార్ హీరోయిన్..

Toofan Movie Teaser Out : ఫర్హాన్ అక్తర్ ‘తుఫాన్’ టీజర్‌ రిలీజ్.. పంచ్ డైలాగ్స్‌తో అదరగొడుతున్న బాక్సర్..