MAA Elections 2021: క్యా సీన్ హై.. ఎన్నికల కేంద్రంలో ప్రకాష్ రాజ్.. మంచు విష్ణు మధ్య ఆసక్తికర సన్నివేశం…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో జరుగుతున్న మా ఎన్నికలలో పాల్గోనేందుకు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో జరుగుతున్న మా ఎన్నికలలో పాల్గోనేందుకు సినీ తారలు ఒక్కొక్కరిగా పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు ప్లటూన్ల బలగాలను ఎన్నికల కేంద్రం వద్ద మోహరించారు. ఇక మా ఎన్నికలను మూడు గదులను కేటాయించి ఒక్కో గదిలో నాలుగు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పద్దతిలో జరగనున్న ఈ ఎన్నికల్లో 883 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మా అధ్యక్ష పదవి కోసం పోటి పడుతున్నారు.
గత కొద్ది నేలలుగా వీరిద్దరి మధ్య తీవ్రమైన పోరు నడుస్తోంది. ఈ క్రమంలో ఆరోపణలు, విమర్శలతో సవాళ్లు, ప్రతి సవాళ్లతో సినీ పరిశ్రమలో వాతావరణం మరింత హీటెక్కింది. వ్యక్తిగత విమర్శలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతన్న… ప్రస్తుతం ఉన్న విభేధాలన్ని రోడ్డున పడ్డాయి. ఇక ప్రకాష్ రాజ్, మంచువిష్ణు మధ్య మాటల యుద్దం ఏ రేంజ్లో జరిగిందో చెప్పాల్సిన పనిలేదు. వార్నింగ్, ఫిర్యాదుల వరకు వెళ్లింది. దీంతో మా ఎన్నికల తర్వాత సినీ పరిశ్రమలో వాతావరణం ఎలా ఉండబోతుంది అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో మా ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. ఉదయాన్నే మంచు విష్ణు, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా.. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ మోహన్ బాబు ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుని.. హగ్ చేసుకున్నారు.
Bigg Boss 5 Telugu: మరోసారి సిరికి క్లాస్ తీసుకున్న నాగార్జున… నిల్చొబెట్టి కడిపారేశాడుగా..
MAA Elections 2021 Live: మోహన్ బాబు, చిరంజీవి ఇద్దరూ మంచి స్నేహితులు.. పవన్ కామెంట్స్..