MAA Elections Counting Highlights: ‘మా’ అధ్యక్షుడుగా విష్ణు గెలుపు.. అంబరాన్ని అంటుతున్న సంబరాలు
MAA Elections Counting Live Updates: సవాళ్లు, ప్రతి సవాళ్లు.. మాటల యుద్ధం, రాజకీయ నాయకులను మించిన ఆరోపణలు, వాగ్దానాలు.. ఇవీ గత కొన్ని రోజుల నుంచి తెలుగు సినీ పరిశ్రమలో కనిపిస్తోన్న పరిస్థితి...
MAA Elections Counting Live Updates: సవాళ్లు, ప్రతి సవాళ్లు.. మాటల యుద్ధం, రాజకీయ నాయకులను మించిన ఆరోపణలు, వాగ్దానాలు.. ఇవీ గత కొన్ని రోజుల నుంచి తెలుగు సినీ పరిశ్రమలో కనిపిస్తోన్న పరిస్థితి. సాధారణ రాజకీయ ఎన్నికలను తలదన్నె రీతిలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికల అగ్గి రాజుకుంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ రెండు వర్గాలుగా చీలిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో ఈ ఎన్నికల ఫలితం అటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఇటు సామాన్య జనాల్లోనూ ఆసక్తి నెలకొంది.
అన్ని ఏర్పాట్లు సిద్ధం..
మా ఎన్నికలు ఆదివారం హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఇందుకోసం జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు మొదలయ్యే ఎన్నికల ప్రక్రియ మధ్యాహ్నం 2 గంటలవరకు ఎన్నికలు జరగనున్నాయి. 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఫలితాల్ని కూడా ఇదే రోజు ప్రకటించనున్నారు. నిజానికి తొలుత సోమవారం ప్రకటించాలనుకున్నా, ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆదివారం రాత్రి 8 గంటలలోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ‘మా’ ఎన్నికలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
LIVE NEWS & UPDATES
-
మా సభ్యత్వానికి నాగబాబు రాజీనామా..
మా సభ్యత్వానికి నటుడు , మెగా బ్రదర్ నాగబాబు రాజీనామా చేశారు..
ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వం తో కొట్టు-మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కొనసాగడం నాకు ఇష్టం లేక “మా” అసోసియేషన్‌లో “నా” ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను… సెలవు. – నాగబాబు, pic.twitter.com/wLqwOKsNtq
— Naga Babu Konidela (@NagaBabuOffl) October 10, 2021
-
‘మా’ కు మంచి వారసుడు దొరికాడు : నరేష్
‘మా’ అసోసియేషన్ కు మంచు వారసుడు దొరికాడని నటుడు నరేష్ అన్నారు. తమను గెలిపించిన అందరికి అయన కృతజ్ఞతలు తెలిపారు.
-
-
ఇది అందరి విజయం : మోహన్ బాబు
ఇది అందరి విజయం.. విష్ణు ఇచ్చిన వాగ్దానాలు అన్ని నెరవేరుస్తాడు.. జరిగిందేదో జరిగిపోయింది.. అందరం ఒక తల్లి బిడ్డలమే.. ఇక పై ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవం చేయాలని నేను కోరుకుంటున్నా..
-
విష్ణును అభినందించిన ప్రకాష్ రాజ్
మా ఎన్నికల్లో విజయం సాధించిన మంచు విష్ణును ప్రకాష్ రాజ్ అభినందించారు..
-
మహేష్ డైలాగ్ తో అదరగొట్టిన నరేష్..
పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ను చెప్పారు నరేష్.. ఎప్పుడొచ్చాం అన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్న నరేష్.
-
-
ప్రకాష్ రాజుకు 274 ఓట్లు
ప్రకాష్ రాజుకు 274 ఓట్లు పడ్డాయి.. మంచు విష్ణు 100 పైగా ఓట్లతో భారీ మెజారిటీ సాధించారు.
-
మంచు విష్ణుకు ఎన్ని ఓట్లు వచ్చాయంటే
మంచు విష్ణుకు 381 ఓట్లు వచ్చాయి.. ప్రకాష్ రాజ్ పై ఆయన ఘానా విజయం సాధించారు.
-
విష్ణు ఎమోషనల్
మంచు విష్ణు విజయాన్ని ప్రకటించిన తర్వాత ఎమోషనల్ అయ్యారు..
-
శ్రీకాంత్ కామెంట్స్ ,..
నన్ను ఆర్టిస్టులు నమ్మరు కాబట్టే గెలిపించారు.. విష్ణుకు కంగ్రాట్స్..
-
ప్రకాష్ రాజ్ ఓడిపోవడం బాధకలిగించింది: శ్రీకాంత్
మా ఎన్నికల్లో నేను గెలిచినా.. ప్రకాష్ రాజ్ ఓడిపోవడం బాధ కలిగిందని శ్రీకాంత్ అన్నారు.
-
విష్ణు ప్యానెల్ లో ఎంతమంది గెలిచారంటే..
మా అధ్యక్షుడు మంచు విష్ణు ప్యానల్ లో 7మంది విజయం సాధించారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ లో 11 మంది విజయం సాధించారు..
-
జీవిత పై రఘుబాబు విజయం..
జీవిత రాజశేఖర్ పై రఘుబాబు విజయం సాధించారు. ఏడూ ఓట్ల తేడాతో జీవిత రఘుబాబు చేతిలో ఓడిపోయారు.
-
వంద ఓట్లకు పైగా మెజారిటీతో…
వంద ఓట్లకు పైగా మెజారిటీతో ప్రకాష్ రాజ్ పై విష్ణు గెలిచారని తెలుస్తుంది.
-
మంచు విష్ణుకు ఎన్ని ఓట్లు వచ్చాయంటే..
మా ఎన్నికల్లో మంచు విష్ణుకు 400 వందలకు పైగా ఓట్లు వచ్చాయని తెలుస్తుంది. ప్రకాష్ రాజ్ పై విష్ణు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
-
ఈసీ సభ్యులు వీళ్ళే..
ఈసీ సభ్యులుగా అనసూయ, బ్రహ్మజీ, శివారెడ్డి , ఖయ్యుం, కౌశిక్, సురేష్ కొండేటి, సంపూర్ణేష్ బాబు. ప్రగతి, మాణిక్, శశాంక్ , హరినాథ్ బాబు, శ్రీనివాసులు, శ్రీలక్ష్మి,
-
ఈసీ సభ్యులుగా శివారెడ్డి..
మా లో ఈసీ సభ్యులుగా నటుడు శివారెడ్డి..అలీ సోదరుడు ఖయ్యుం విజయం సాధించారు..
-
ఈసీ సభ్యులు ఎవరంటే..
మా లో ఈసీ సభ్యులుగా అనసూయ భరద్వాజ్, బ్రహ్మాజీ విజయం సాధించారు.
-
టీజరర్‌గా శివబాలాజీ విజయం..
టీజరర్‌గా నటుడు శివబాలాజీ విజయం సాధించారు.
-
జాయింట్ సెక్రెటరీగా నటుడు ఉత్తేజ్
జాయింట్ సెక్రెటరీగా నటుడు ఉత్తేజ్ , గౌతమ్ రాజు విజయం సాధించారు.
-
మీరు అనుకున్న ప్యానల్ గెలిచింది..: హేమ
మరో 10 నిమిషాల్లో అధికారిక ప్రకటన వస్తుందని నటి హేమ తెలిపారు. అనంతరం అక్కడి నుంచి ఆమె వెళ్లిపోయారు.
-
ప్రకాష్ రాజ్ పై విష్ణు ఎన్ని ఓట్లతో గెలిచారంటే..
ప్రకాశ్ రాజ్‌పై 127 ఓట్ల మెజార్టీతో మంచు విష్ణు గెలుపు – విష్ణుకు పోలైన ఓట్లు 396, ప్రకాశ్ రాజ్‌కు పోలైన ఓట్లు 269
-
వివాదాలతో చులకన కావొద్దు.. : చిరంజీవి
పదవులు తాత్కాలికం మాత్రమే అని చిరజీవి అన్నారు. వివాదాలతో చులకన కావద్దు అంటూ మెగాస్టార్ హెచ్చరించారు. చిన్న చిన్న పదవుల కోసం ఈగోలకు వెళ్ళద్దు అని ఆయన విజ్ఞప్తి చేశారు.
-
మా ఎన్నికల పై మెగాస్టార్ కామెంట్స్..
అల్లర్లతో మా పరువు తీయొద్దు అంటూ మెగాస్టార్ విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి అని మెగాస్టార్ అన్నారు.
-
ప్రణాళిక బద్ధంగా వెళ్లిన మంచు విష్ణు..
హోరాహోరీగా సాగిన ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగాప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు గెలుపొందారు. మా అధ్యక్ష పీఠం మంచు కుటుంబానికే దక్కింది. వైస్ ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు టీమ్ నుంచి పృథ్వీ రాజ్ విజయం సాధించారు. అంతేకాదు జాయింట్ సెక్రటరీగా మంచు విష్ణు ప్యానల్‌కు చెందిన గౌతమ్ రాజు గెలుపొందారు. ఇక ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్ భారీ ఓట్ల తేడాతో బాబు మోహన్ పై గెలుపొందారు. తన ప్యానల్ గెలుపొందడానికి మంచు విష్ణు ప్యానల్ ప్రణాళిక బద్ధంగా వెళ్లారు.
మరోవైపు విష్ణు గెలుపుతో పోలింగ్ కేంద్రం బయట మంచు విష్ణు అభిమానుల సంబరాలు జరుపుకున్నారు. జై మంచు.. మంచు విష్ణు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
-
సంబరాల్లో మంచు విష్ణు అభిమానులు
మా అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపుతో పోలింగ్ కేంద్రం బయట మంచు విష్ణు అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. జై మంచు.. మంచు విష్ణు జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ.. పటాసులు కలుస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-
ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి 11మంది, విష్ణు ప్యానల్ ఏడుగురు ఈసీ సభ్యులుగా గెలుపు
ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి 11మంది ఈసీ సభ్యులుగా గెలుపొందగా.. విష్ణు ప్యానల్ నుంచి ఏడుగురు ఈసీ సభ్యులుగా గెలుపొందారు.
-
‘మా’ అధ్యక్షుడుగా విష్ణు గెలుపు.. అంబరాన్ని అంటుతున్న సంబరాలు
మా అధ్యక్ష పోటీలో మంచు విష్ణు విజయం సాధించారు. దీంతో విష్ణు ప్యానల్ లో సంబరాలు అంబరాన్ని అంటున్నాయి.
-
ప్రకాష్ రాజ్‌పై 400 ఓట్ల తేడాతో ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం
మా అధ్యక్ష పీఠంపై మంచు విష్ణు.. ప్రకాష్ రాజ్ పై గెలుపు బావుటా ఎగరవేశారు మంచు విష్ణు. సుమారు 400 ఓట్ల తేడాతో విష్ణు గెలుపొందినట్లు తెలుస్తోంది.
-
బాబు మోహన్‌పై 125 తేడాతో శ్రీకాంత్ గెలుపు
‘మా’ ఎన్నికల్లో హోరా హోరీ పోరు సాగింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్ విష్ణు ప్యానల్ నుంచి పోటీలో ఉన్న బాబు మోహన్ పై విజయం సాధించారు. 125 ఓట్ల తేడాతో శ్రీకాంత్ గెలుపుబావుటా ఎగరవేశారు. మా ఎగ్జిటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ గెలుపొందారు.
-
‘మా’ ఎన్నికల్లో హోరా హోరీ పోరు సాగింది. అధ్యక్షుడి ఓట్ల లెక్కింపు మొదలైంది. మంచు విష్ణు.. ప్రకాష్ రాజ్ పై స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. విష్ణు ప్యానల్ నుంచి కీలక పదవుల్లో పోటీలో ఉన్న శివ బాలాజీ, రఘుబాబులు గెలుపొందారు. ఇక ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్ విజయం దిశగా పయనిస్తున్నట్లు తెలుస్తోంది.
-
బాబు మోహన్ పై లీడ్ లో ఉన్న శ్రీకాంత్
‘మా’ ఎన్నికల కౌంటింగ్ తుది దశకు చేరుకుంది. ‘మా’ లో కీలక పదవిలో పోటీలో ఉన్న వారిలో విష్ణు ప్యానల్ నుంచి శివ బాలాజీ, రఘుబాబు గెలుపొందగా.. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్ బాబు మోహన్ పై లీడ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ..
-
తుది దశకు చేరుకున్న ‘మా’ ఎన్నికల కౌంటింగ్.. స్పష్టమైన ఆధిక్యంలో విష్ణు
మా ఎన్నికల కౌంటింగ్ తుది దశకు చేరుకున్నారు. మా అధ్యక్ష పీఠంలో కూర్చునేది ఎవరో మరికొంత సేపటికి తెలియనుంది. మంచు విష్ణు .. ప్రకాష్ రాజ్ పై లీడ్ లో ఉన్నారు. అధ్యక్ష పీఠం అందుకనే దిశగా అడుగు వేస్తున్నారు.
-
ఏడు ఓట్ల తేడాతో జీవితపై విష్ణు ప్యానల్ నుంచి రఘుబాబు విజయం
మా జనరల్ సెక్రటరీ గా ఇరు వర్గాల నుంచి జీవిత, రఘుబాబు పోటీపడ్డారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి పోటీపడిన జీవిత రాజశేఖర్ పై విష్ణు ప్యానల్ పై రఘుబాబు గెలుపొందారు. జీవితంపై 7 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
-
సెక్రటరీ గా జీవిత కంటే ముందంజలో రఘుబాబు
సెక్రటరీ గా ఇరు వర్గాల కంటే జీవిత, రఘుబాబు పోటీపడుతున్నారు. జీవిత కంటే రఘుబాబు ముందంజలో ఉన్నారు.
-
ట్రెజర్‌గా విష్ణు ప్యానల్ నుంచి శివ బాలాజీ విజయం
ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి ట్రెజర్ గా పోటీలో ఉన్న నాగినీడు పై విష్ణు ప్యానల్ నుంచి శివ బాలాజీ విజయం సాధించారు.
-
విష్ణు ప్యానల్ జనరల్ సెక్రటరీ రఘు బాబు ముందంజ
మా ఎన్నికల పోటీలో నరాలు తెగే ఉత్కంఠత నెలకొంది. మా అధ్యక్షుడి పీఠం ఎవరిది అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇక ఎగ్జిటివ్ ప్రెసిడెంట్, ట్రెజర్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైనది. బాబూమోహన్, శ్రీకాంత్ లు పోటీలో ఉన్నారులు.. విష్ణు ప్యానల్ నుంచి జనరల్ సెక్రటరీ గా పోటీలో ఉన్న రఘు బాబు ముందంజలో ఉన్నారు.
-
‘మా’ ఎన్నికల పోటీలో నరాలు తెగే ఉత్కంఠత.. గెలిచిన అభ్యర్థులతో విష్ణు సెల్ఫీలు..
మా ఎన్నికల పోటీలో నరాలు తెగే ఉత్కంఠత నెలకొంది. మా అధ్యక్షుడి పీఠం ఎవరిది అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇక ఎగ్జిటివ్ ప్రెసిడెంట్ , ట్రెజర్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైనది. బాబూమోహన్ , శ్రీకాంత్ లు పోటీలో ఉన్నారు. ‘మా’ఎన్నికల కౌంటింగ్ లో ప్రకాష్ రాజ్ , విష్ణు రెండు ప్యానల్స్ మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఇరు వర్గాల మధ్య నున్నా నేనా అన్నట్లు పోటీ సాగింది. విష్ణు ప్యానల్ నుంచి జయవాణి , పూజిత, మాణిక్ , హరినాథ్, శ్రీలక్ష్మి, పసుమూరి శ్రీనివాస్, శశాంక్ తదితరులు మొత్తం 8మంది లీడ్ లో ఉన్నారు. ప్రకాష్ ప్యానల్ నుంచి శివారెడ్డి, అనసూయ, సురేష్ కొండేటి, కౌశిక్ గెలుపొందారు. మళ్ళీ లీడ్ లోకి రావడంతో ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి 10మంది లీడ్ లోకి వచ్చారు. మరోవైపు ఓటింగ్ కేంద్రం వద్ద అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంది.
-
మళ్ళీ లీడ్ లోకి వచ్చిన ప్రకాష్ రాజ్ ప్యానల్.. ఫలితాలు రావడానికి మరింత ఆలస్యం
‘మా’ఎన్నికల కౌంటింగ్ లో ప్రకాష్ రాజ్ , విష్ణు రెండు ప్యానల్స్ మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఇరు వర్గాల మధ్య నున్నా నేనా అన్నట్లు పోటీ సాగింది. విష్ణు ప్యానల్ నుంచి జయవాణి , పూజిత, మాణిక్ , హరినాథ్, శ్రీలక్ష్మి, పసుమూరి శ్రీనివాస్, శశాంక్ తదితరులు మొత్తం 8మంది లీడ్ లో ఉన్నారు. ప్రకాష్ ప్యానల్ నుంచి శివారెడ్డి, అనసూయ, సురేష్ కొండేటి, కౌశిక్ గెలుపొందారు. మళ్ళీ లీడ్ లోకి రావడంతో ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి 10మంది లీడ్ లోకి వచ్చారు. మరోవైపు ఓటింగ్ కేంద్రం వద్ద అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంది.
-
విష్ణు ప్యానల్ నుంచి లీడ్ లో ఉన్న జయవాణి , పూజిత, మాణిక్ , శశాంక్..
రెండు ప్యానల్స్ మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఇరు వర్గాల మధ్య నున్నా నేనా అన్నట్లు పోటీ సాగింది. కాసేపట్లో ఈసీ మెంబర్స్ గెలుపుని అధికారంగా ప్రకటించనున్నారు. నిమిష నిమిషానికి మారుతున్న లీడ్స్ తో టెన్షన్ నెలకొంది. మరోవైపు ఓటింగ్ కేంద్రం వద్ద అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంది. విష్ణు ప్యానల్ నుంచి జయవాణి , పూజిత, మాణిక్ , హరినాథ్, శ్రీలక్ష్మి, పసుమూరి శ్రీనివాస్, శశాంక్, లీడ్ లో ఉన్నారు.
-
ఇరు వర్గాల మధ్య మారుతున్న లీడ్స్..
‘మా’ ఎన్నికల్లో ఈసీ సభ్యుల కౌటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ ఫ్యానల్ లో ఈసీ మెంబర్స్ లో ఎనిమిది మంది లీడ్ లో ఉన్నారు. ఇక మళ్ళీ విష్ణు ఫ్యానల్ నుంచి 10మంది లీడ్ లో ఉన్నారు. అయితే ఈసీ ఇప్పటి వరకూ ఎవరి గెలుపుని అధికారికంగా ప్రకటించలేదు.
-
సంపూర్ణేష్ బాబుపై భారీ ఆధిక్యంతో శివారెడ్డి గెలుపు
‘మా’ ఎన్నికల్లో ఈసీ సభ్యుల కౌటింగ్ పూర్తి అయింది. తొలి బోణీ కొట్టిన ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి లీడ్ కొనసాగిస్తుంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి శివారెడ్డి, కౌశిక్ , సురేష్ కొండేటి అనసూయ కూడా విజయం సాధించారు. శివారెడ్డి భారీ ఆధిక్యంతో సంపూర్ణేష్ పై విజయం సాధించారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ ఫ్యానల్ లో ఈసీ మెంబర్స్ లో నలుగురు గెలుపొందారు. ఇక ఇప్పటి వరకూ విష్ణు ఫ్యానల్ నుంచి బోణీ కొట్టాల్సి ఉంటుంది.
-
‘మా’ ఎన్నికల్లో ఈసీ సభ్యుల కౌటింగ్ పూర్తి
‘మా’ ఎన్నికల్లో ఈసీ సభ్యుల కౌటింగ్ పూర్తి అయింది. తొలి బోణీ కొట్టిన ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి లీడ్ కొనసాగిస్తుంది. 12మంది లీడ్ లో ఉండగా.. విష్ణు ప్యానల్ నుంచి ఆరుగురు లీడ్ లో ఉన్నారు. అయితే ఇప్పటికే ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి శివారెడ్డి, కౌశిక్ , సురేష్ కొండేటి అనసూయ కూడా విజయం సాధించారు. దీంతో ఇప్పటికే ప్రకాష్ రాజ్ ఫ్యానల్ లో ఈసీ మెంబర్స్ లో నలుగురు గెలుపొందారు. ఇక ఇప్పటి వరకూ విష్ణు ఫ్యానల్ నుంచి బోణీ కొట్టాల్సి ఉంటుంది.
-
ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి 12మంది లీడ్.. నలుగురు గెలుపు. విష్ణు ప్యానల్ లో ఆరుగురు లీడ్
‘మా’ ఎన్నికల్లో బోణీ కొట్టిన ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి లీడ్ కొనసాగిస్తుంది. 12మంది లీడ్ లో ఉండగా.. విష్ణు ప్యానల్ నుంచి ఆరుగురు లీడ్ లో ఉన్నారు. అయితే ఇప్పటికే ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి శివారెడ్డి, కౌశిక్ , సురేష్ కొండేటి అనసూయ కూడా విజయం సాధించారు. దీంతో ఇప్పటికే ప్రకాష్ రాజ్ ఫ్యానల్ లో ఈసీ మెంబర్స్ లో నలుగురు గెలుపొందారు. ఇక ఇప్పటి వరకూ విష్ణు ఫ్యానల్ నుంచి ఒక్కరూ కూడా బోణీ కొట్టలేదు.
-
ప్రకాష్ రాజ్ ప్యానల్‌లో నాలుగో విజయం.. అనసూయ గెలుపు
‘మా’ ఎన్నికల్లో బోణీ కొట్టిన ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి ఇప్పటికే శివారెడ్డి, కౌశిక్ లు గెలుపొందారు. మూడో అభ్యర్థిగా సురేష్ కొండేటి కూడా విజయం సాధించారు. ఇక అనసూయ కూడా విజయం సాధించారు. దీంతో ఇప్పటికే ప్రకాష్ రాజ్ ఫ్యానల్ లో ఈసీ మెంబర్స్ లో నలుగురు గెలుపొందారు. ఇక ఇప్పటి వరకూ విష్ణు ఫ్యానల్ నుంచి ఒక్కరూ కూడా బోణీ కొట్టలేదు. క్రాస్ ఓటింగ్ భారీగా జరిగినట్లు తెలుస్తోంది.
-
ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి లీడ్ లో ఉన్న అనసూయ
‘మా’ ఎన్నికల్లో బోణీ కొట్టిన ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి ఇప్పటికే శివారెడ్డి, కౌశిక్ లు గెలుపొందారు. ఇక మరోవైపు సురేష్ కొండేటి కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గెలుపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక అనసూయ కూడా లీడ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రకాష్ రాజ్ ఫ్యానల్ లో ఈసీ మెంబర్స్ లో 8 మంది, విష్ణు ఫ్యానల్ లో 10మంది మెజార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.
-
ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి విజయం దిశగా సురేష్ కొండేటి..
‘మా’ ఎన్నికల్లో బోణీ కొట్టిన ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి ఇప్పటికే శివారెడ్డి, కౌశిక్ లు గెలుపొందారు. ఇక మరోవైపు సురేష్ కొండేటి కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గెలుపు ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే ప్రకాష్ రాజ్ ఫ్యానల్ లో ఈసీ మెంబర్స్ లో 8 మంది, విష్ణు ఫ్యానల్ లో 10మంది మెజార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.
-
ప్రకాష్ రాజ్ ఫ్యానల్ నుంచి గెలిచిన శివారెడ్డి, కౌషిక్
‘మా’ ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చింది. ప్రకాష్ రాజ్ ఫ్యానల్ లో నుంచి ఇద్దరు గెలిచారు. శివారెడ్డి, కౌషిక్ లు విజయం సాధించి ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి తొలి బోణీ కొట్టారు.
-
విష్ణు ఫ్యానల్‌లో 10మంది, ప్రకాష్ రాజ్ ఫ్యానల్‌లో ఈసీ మెంబర్స్‌లో 8 మందికి మెజార్టీ..
‘మా’ ఫలితాలపై కొనసాగుతున్న ఉత్కంఠ. ఈసీమెంబర్స్ లో 44 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇక మరోవైపు మంచు మోహన్ బాబు ప్రకాష్ రాజ్ ప్యానల్ కు సంబంధించిన మెంబర్ రమణారెడ్డి కి వార్నింగ్ ఇచ్చారు.ప్రకాష్ రాజ్ ఫ్యానల్ లో ఈసీ మెంబర్స్ లో 8 మంది, విష్ణు ఫ్యానల్ లో 10మంది మెజార్టీ సాధించినట్లు తెలుస్తోంది.
-
ఈసీ మెంబర్స్ లో ప్రకాష్ రాజ్ ప్యానల్ మెజార్టీ
ఈసీ మెంబర్స్ లో ప్రకాష్ రాజ్ ఫ్యానల్ మెజార్టీ లో కొనసాగుతుంది. ఇక మరో వైపు పోస్టల్ బ్యాలెట్ లో మంచు విష్ణు మెజారిటీ లో ఉన్నారు.
-
పోస్టల్ బ్యాలెట్‌లో లెక్కింపు పూర్తి.. లీడ్‌లో మంచు విష్ణు
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. పోస్టల్ బ్యాలెట్ లో మంచు విష్ణు లీడ్ లో ఉన్నట్లు సమాచారం. ఈ సారి ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరగడంతో ఇరు వర్గాల్లోనూ టెన్షన్ నెలకొంది. పోలైన ఓట్లలో 50 ఓట్లు చెల్లనవిగా తెలుస్తోంది.
-
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. క్రాస్ ఓటింగ్ భారీగా జరగడంతో ఇరు వర్గాల్లోనూ టెన్షన్ నెలకొంది. పోలైన ఓట్లలో 50 ఓట్లు చెల్లనవిగా తెలుస్తోంది. విష్ణు వైపు ఎక్కువగా మొగ్గుతున్నట్లు తెలుస్తోంది.
-
కాసేపట్లో రానున్న మొదటి ఫలితం
రెండు ప్యానల్ లో కలిపి.. ఒక స్వతంత్ర అభ్యర్థి కలిసి మొత్తం 39 మంది పోటీ చేస్తున్నారు. 18 కంటే ఎక్కువ ఓట్లు వేస్తె వాటిని చెల్లని ఓట్లుగా పరిగణిస్తారు. మా ఫలితాలపై కొనసాగుతుంది ఉత్కంఠత కొనసాగుతుంది. మొదటి ఫలితం కాసేపట్లో రానున్నది.
-
కౌంటింగ్ లో ఉత్కంఠత.. చెల్లని 50 ఓట్లు… భారీగా క్రాస్ ఓటింగ్..
మా ఎన్నికల కౌంటింగ్ లో ఉత్కంఠత నెలకొంది. ఈసీ మెంబర్స్ కి సంబంధి 50 ఓట్లు చెల్లనట్లు తెలుస్తోంది. ఇక ఈ సారి ఓటింగ్ లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు సమాచారం. ఇరుగు వర్గాల్లోనూ టెన్షన్ నెలకొంది. గెలుపు పై ధీమా వ్యక్తమవుతోంది.
-
నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్న శివబాలాజీ.. హేమ కొరకడంతో చిన్న గాయం
మా ఎన్నికల ఓటింగ్ సమయంలో హేమ యాక్టర్ శివ బాలాజీ చేతిని కొరకడంతో చిన్న గాయం అయింది, దీంతో నిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన శివబాలాజీ.. అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నారు. అక్కడ టీటీ ఇంజెక్షన్ చేయించుకున్నారు. తిరిగి మా ఎన్నికల కౌటింగ్ ప్రాంతానికి చేరుకున్నారు.
-
మా ఎన్నికల్లో బెట్టింగ్ రాయుళ్లు.. ఎక్కువ మంది విష్ణు ఫేవరేట్ అంటూ పందెం
ఈ సారి మా ఎన్నికలు ప్రకాష్ రాజ్ ప్యానల్ కు , మంచు విష్ణు ప్యానల్ కు మధ్య నున్నా నేనా అన్నట్లు సాగాయి. ఇక సాధారణ ఎన్నికలను తలపిస్తూ.. ఎవరు గెలుస్తారంటూ బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగారు. తాజాగా జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ పరిసరాల్లో బెట్టింగ్ జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరు పహ్ ఎవరెట్ అంటూ రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి కూడా ఫోన్ కాల్స్ వస్తున్నట్లు సమాచారం. ఇక ఎక్కువ మంది మంచు విష్ణు గెలుస్తారంటూ ఫేవరేట్ గా పందెం కాస్తున్నట్లు తెలుస్తోంది.
-
ఓట్ల లెక్కింపు వ్యవహారంపై ఈసీ, మురళీ మోహన్ తో ప్రకాష్ రాజ్ వాగ్వాదం
మా ఎన్నికల్లో పోలైన ఓట్ల కట్టలు కట్టడానికి మరో 30 నిముషాలు పెట్టె అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఓట్ల లెక్కింపు డయాస్ పై విష్ణు , ప్రకాష్ రాజ్ లు ఉన్నారు. మొదటి ఫలితం 6 గంటల తర్వాత వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతున్న సమయంలో ప్రకాష్ రాజ్ , ఈసీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంతేకాదు పోస్టల్ లెక్కింపు వ్యవహారం సరిగ్గా లేదంటూ ప్రకాష్ రాజ్ , కృష్ణ మోహన్న్ ల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.
-
మా ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు సెల్ఫీ
మా ఎన్నికల ఓటింగ్ జరుగుతున్న వేళ అధ్యక్ష పదవికి పోటీ చేసిన ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫోటోను మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ.. వాటమ్మా వాటీస్ దిస్ అమ్మా అంటూ ఓ కామెంట్స్ ను జత చేశాడు.
<
What ammaaaa what is this ammmaaaa ?!:) ? pic.twitter.com/41gAotPHJD
— Manoj Manchu??❤️ (@HeroManoj1) October 10, 2021
/p>
-
కొనసాగుతున్న ‘మా’ ఓట్ల లెక్కింపు ప్రక్రియ.. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్
మా ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. గతంలో ఎన్నడూను లేనివిధంగా ఈ సారి మా సభ్యులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మురళీమోహన్, మోహన్‌బాబుల సమక్షంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఇక ఓట్ల లెక్కింపు వేదిక వద్దకు ఫ్యానల్ సభ్యులకు మాత్రమే అనుమతి ఇచ్చారు.
-
సాయంత్రం గం. 5 ఓట్ల లెక్కింపు ప్రారంభం.. ‘మా’ చరిత్రలో రికార్డ్ స్థాయిలో పోలింగ్
సాయంత్రం ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నది. పోలింగ్ సమయం ముగిసే సరికి లైన్ లో ఉన్న వారికి ఓట్లు హక్కుని వినియోగించుకునే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్ తో కలిపి మొత్తం పోలైన ఓట్లు 700 దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
-
ఈ సారి రికార్డ్ స్థాయిలో నమోదైన పోలింగ్.. మొత్తం 626 ఓట్లు పోల్..
హోరా హోరీగా సాగిన ‘మా’ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈసారి ఎన్నికల్లో పోలింగ్ రికార్డ్ స్థాయిలో నమోదైంది. మొత్తం 626మంది మా సభ్యులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మొత్తం 883మందికి ఓటు హక్కు ఉన్నట్లు తెలుస్తోంది.
-
మా పోలింగ్ కేంద్రంలో మరోసారి ఉద్రిక్తిత .. ఈసీ మెంబర్‌ను అడ్డుకున్న ప్రకాష్ రాజ్ ప్యానల్
మా పోలింగ్ కేంద్రంలో మరోసారి ఉద్రిక్తిత పరిస్థితులు నెలకొన్నాయి. ఈసీ మెంబర్ మాణిక్ ను ప్రకాష్ రాజ్ ప్యానల్ అడ్డుకుంది. పోలింగ్ బూత్ లో చిట్టీలు పంచుతున్నారని ప్రకాష్ రాజ్ ఫ్యానల్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో పోలీసులు రంగంలోకి ఇరు వర్గాల వారిని అక్కడ నుంచి పంపించి వేశారు.
-
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరిన విష్ణు
మా ఎన్నికలు హోరా హోరీగా నువ్వా నేనా అన్నట్లు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది సభ్యులు నిర్ణిత సమయంలో తమ ఓటు హక్కుని వినియోగించుకోలేకపోయారు. తాజా మంచు విష్ణు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ట్విట్టర్ వేదికగా కోరారు. ప్రతి ఓటు అత్యంత అమూల్యమైందని చెప్పారు. అయితే ఇంకా తమ ఓటు హక్కు వినియోగలించుకొని వారిలో మహేష్‌బాబు, అల్లు అర్జున్, కృష్ణం రాజు, ప్రభాస్ , జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ , సుధీర్ బాబు వంటి వారు ఉన్నారు.
To all my movie fraternity; the election officer is giving grace time to come and vote. We understand due to the traffic jam, many are not able to come in to vote. Please come and Vote as soon as possible ? Every vote counts
— Vishnu Manchu (@iVishnuManchu) October 10, 2021
-
గత ఎన్నికలకంటే ఎక్కువ శాతం పోలింగ్.. ఇంకా క్యూ లో 100 మంది సభ్యులు..
మా ఎన్నికలు సమయం మరో గంట పొడిగించారు. ఇక ఇప్పటి వరకూ 503మంది మా సభ్యులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇంకా ఓటు వేయడానికి సుమారు 100 మంది సభ్యులున్నారు. మధ్యాహ్నం 1.30గంటల వరకు 56శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో మా అధ్యక్ష ఎన్నికల్లో 474 ఓట్లు మాత్రమే పోలవ్వగా.. ఈ సారి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న సభ్యుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
-
రికార్డు స్థాయిలో పోలింగ్..
మా అధ్యక్ష ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, సభ్యులు హోరాహోరీగా ప్రచారాలు చేయడంతో భారీగా ఓటింగ్ శాతం పెరిగింది. గతేడాది కేవలం 474 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోగా. ఈసారి ఇప్పటి వరకు 503 మంది ఓటు హక్కును వినియోగించుకున్నరు. ఇక క్యూ లైన్‌లో మరో 150 మంది ఉన్నారు. ఇక మరో గంట పొడగించడంతో ఇంకా పోలింగ్ పెరిగే అవకాశాలున్నాయి. దీంతో కౌంటింగ్ ముందు చెప్పనదానికంటే ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో మా ఎన్నికల ఫలితాలు ఆలస్యం కానుంది. అర్థరాత్రి దాటిన తర్వాతే ఫలితాలు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
-
పోలింగ్ మరో గంట పొడగింపు..
పోలింగ్ ముగియడానికి కేవలం 20 నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో మరో గంట పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల అధికారిని ఇరు ప్యానెళ్లకు చెందిన వారు కోరడంతో మరో గంట పొడిగించారు. ‘ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన వారు, ఇళ్లలో ఉన్న వారు వచ్చి ఓటు వేయండి, ప్రతీ ఓటూ లెక్కలోకి వస్తుందని’ మంచు విష్ణు చెప్పుకొచ్చారు. దీంతో కౌంటింగ్ సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
-
పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత..
జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ వద్ద వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అక్కినేని అఖిల్ ఎంట్రీ ఇవ్వడంతోనే అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో అభిమానులను కంట్రోల్ చేసే క్రమంలో పోలీసులు తమ లాఠీలకు పని చేప్పారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు 503 ఓట్లు పోల్ కాగా.. మరో 150 మంది లైన్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఇక చివరి ఏడాది జరిగిన ఎన్నికల్లో కేవలం 474 ఓట్లు మాత్రమే పోల్ కావడం గమనార్హం.
-
రేండేళ్ల పాలనకు పడే ఓటు ఇది..
మాజీ మా అధ్యక్షుడు, ప్రస్తుతం మంచు విష్ణుకు మద్దతు ఇస్తోన్న నరేశ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఓటు రెండేళ్ల పాలనకు పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. కొందరు కుక్కల్లా అరిచారని, ఇవి వారి నోళ్లు మూయించే ఎన్నికలని తెలిపిన నరేశ్.. కచ్చితంగా మంచు విష్ణుదే విజయమని తేల్చి చెప్పారు.
-
ఓటు వేయడానికి ఢిల్లీ నుంచి వచ్చిన జయప్రద..
సీనియర్ నటి జయప్రద ఓటు హక్కువినియోగించుకోవడానికి ఢిల్లీ నుంచి వచ్చారు. ఓటు హక్కు వినియోగించున్న తర్వాత బయటకు వచ్చిన జయప్రద మాట్లాడుతూ.. మేమంతా ఒకే కుటుంబ సభ్యులం. ఎవరు గెలిచినా ఒకటే. కష్టంలో సుఖంలో మేమంతా ఒకటవుతాం, ఐక్యమత్యంతో ఉంటాము. ఓటు హక్కు వినియోగించుకోవడం పట్ల జయప్రద సంతోషం వ్యక్తం చేశారు.
-
సంచలన వ్యాఖ్యలు చేసిన నటి పూనమ్‌కౌర్..
నిత్యం కాంట్రవర్సీ స్టేట్‌మెంట్‌లతో వార్తల్లో నిలిచే నటి పూనమ్‌కౌర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత బయటకు వచ్చిన పూనమ్.. టాలీవుడ్‌లో చాలా రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించింది. రాజకీయ లబ్ధి కోసం ఆర్టిస్టులను సతాయించడం మానుకోవాలని తెలిపింది. ఏ ప్యానెల్ గెలిచినా.. రాజకీయాలను, మా అసోసియేషన్‌ను కలపకూడదని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది.
-
ఓటు హక్కు వినియోగించుకున్న నాగార్జున..
పోలింగ్ ముగియడానికి ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉందనుకుంటున్న సమయంలో కింగ్ నాగార్జు ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంలో నాగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు కేవలం 43 శాతం మాత్రమే ఓటింగ్ జరిగింది. మరి ఇంకా సుమారు గంటన్నర సమయం ఉన్న నేపథ్యంలో పోలింగ్ శాతం పెరుగుతుందేమో చూడాలి. ఇదిలా ఉంటే మధ్యాహ్నం 2 గంటల వరకు లైన్‌లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
-
12 గంటల వరకు ఎంత పోలింగ్ జరిగిందంటే..
మా ఎన్నికల పోలింగ్ ప్రశాంతగా సాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల వరకు 380 ఓట్లు పోలయ్యాయి. దీంతో పోలింగ్ 43 శాతం ఓటింగ్ పూర్తయింది. ఇంకా పోలింగ్‌కు కేవలం రెండు గంటలు మాత్రమే మిగిలి ఉంది. అయితే అగ్ర హీరోలు ఇంకా ఓటు హక్కును వినియోగించుకోలరనే విషయం తెలిసిందే. అయితే అందరూ ఓటింగ్‌లో పాల్గొనే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లే ఇతర హీరోలు కూడా పోలింగ్ కేంద్రానికి చేరుకుంటారని సమాచారం.
-
ఏం చేయకుండానే కొరికేస్తామా.? హేమ ఆసక్తికర వ్యాఖ్యలు..
శివబాలజీని హేమ కొరికిందని వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో ఆ విషయంపై స్పందించింది. ఆయన ఏం చేయకుండానే కొరికేస్తామా? అని ప్రశ్నించింది. ఎన్నికలు అయిపోయాక మిగతా విషయాలు మాట్లాడుతాను అని చెప్పుకొచ్చింది హేమ. శివ బాలాజీ తనను అడ్డుకోవడం వల్లే కొరికాను అని హేమ క్లారిటీ ఇచ్చింది.
-
11 గంటల వరకు ఎన్ని ఓట్లు పడ్డాయంటే..
చెదురు మొదురు సంఘటనలు తప్ప మా ఎన్నికలు ప్రశాంతగానే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉదయం 11 గంటల వరకు 287 ఓట్లు పోలయ్యాయి. మా సభ్యులు మొత్తం 925 మంది ఉండగా వారిలో 883 మంది ఓటు హక్కు ఉంది.
-
ఓటు హక్కు వినియోగించుకోని టాప్ హీరోలు ఎవరో తెలుసా.?
మా ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు 276 ఓట్లు నమోదయ్యాయి. ఇక కొందరు ప్రముఖ స్టార్ హీరోలు తమ ఓటు హక్కును వినియోగించుకోలేరు. ఈ జాబితాలో ఉన్న కొందరు ప్రముఖలు ఎవరంటే.. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, వెంకటేష్, నాగార్జున, నాగ చైతన్య, వరుణ్ తేజ్, రానాలు ఉన్నారు.
-
ఏం చేయకుండానే కొరికేస్తామా.? హేమ ఆసక్తికర వ్యాఖ్యలు..
శివబాలజీని హేమ కొరికిందని వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో ఆ విషయంపై స్పందించింది. ఆయన ఏం చేయకుండానే కొరికేస్తామా? అని ప్రశ్నించింది. ఎన్నికలు అయిపోయాక మిగతా విషయాలు మాట్లాడుతాను అని చెప్పుకొచ్చింది హేమ.
-
ఓటు హక్కు వినియోగించుకోని టాప్ హీరోలు ఎవరో తెలుసా.?
మా ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు 276 ఓట్లు నమోదయ్యాయి. ఇక కొందరు ప్రముఖ స్టార్ హీరోలు తమ ఓటు హక్కును వినియోగించుకోలేరు. ఈ జాబితాలో ఉన్న కొందరు ప్రముఖలు ఎవరంటే.. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, వెంకటేష్, నాగార్జున, నాగ చైతన్య, వరుణ్ తేజ్, రానాలు ఉన్నారు.
-
తెలుగు ఇండస్ట్రీ నాకు సొంతిల్లు.. జెనీలియా.
అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి నటి జెనీలియా ముంబయి నుంచి వచ్చారు. ఈ సందర్భంగా ఓటు వేసి బయటకు వచ్చిన జెనిలీయా మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీ నాకు సొంతిల్లు అని తెలిపారు. ఈ ఎన్నికల్లో మంచి వ్యక్తే గెలుస్తారని తెలిపారు. త్వరలోనే సూపర్ ప్రెసిడెంట్‌ను చూస్తామన్నారు.
-
ఓటు హక్కు వినియోగించుకున్న రోజా.. ఏమన్నారంటే..
వైసీపీ ఎమ్మెల్యే, నటి రోజా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మంచి వాతవారణంలో ఎన్నిక జరుగుతుండడం ఆనందంగా ఉంది. ఎవరు గెలిచినా.. ఎవరు ఓడినా.. అందరం కలిసి కట్టుగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో మన సమస్యలను పరిష్కరించేలా ముందుకు వెళ్లాలని రోజా తెలిపారు. రెండు ప్యానెళ్లలో నాతో పనిచేసిన వారు ఉన్నారు. కానీ ఎక్కువ సమయం ఎవరు ఆర్టిస్ట్‌లకోసం పనిచేస్తారో దాన్ని బట్టే ఓటు వేస్తారు. కరోనా సమయంలో ఎక్కువ నష్టపోయింది ఇండస్ట్రీలో ఉన్న వారే. మళ్లీ పూర్వ వైభవం రావాలి, ప్రేక్షకుల అభిమానం పొందేలా కలిసి పనిచేయాలని. వెనక నుంచి పక్కన నుంచి మాట్లాడేవారి వల్లే ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మా అసోసియేషన్‌ను ఇంకా అభివృద్ధి చేస్తారంటూ రోజా చెప్పుకొచ్చారు. మా అధ్యక్ష ఎన్నికలు వేరు, రాజకీయాలు వేరని రోజా స్పష్టం చేశారు.
-
పోలింగ్ కేంద్రానికి చేరుకున్న నటి జెనీలియా..
మా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కేంద్రానికి నటి జెనిలీయా చేరకున్నారు. ఈ సందర్భంగా విష్ణు పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చి జెనిలీయాను లోపలికి తీసుకెళ్లాడు.
-
శివ బాలాజీని కొరికిన హేమా..
మా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 850 ఓట్లకు గాను ఇప్పటి వరకు 240 ఓట్లు నమోదైనట్లు తేలింది. పోలింగ్ కేంద్రంలో ఎలాంటి గొడవ జరగట్లేదని నరేశ్ తెలిపారు. శివబాలాజీని నటి హేమ కొరికిందని నరేశ్ ఆ గాయాన్ని మీడియాకు చూపించారు.
-
పోలింగ్ బూత్‌లో రగడపై స్పందించిన ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు..
పోలింగ్ కేంద్రంలో రసాబాస జరుగుతోంది, రిగ్గింగ్ జరుగుతోంది, సభ్యులు దాడికి దిగుతున్నారు అని వార్తలు వచ్చిన నేపథ్యంలో మా అధ్యక్ష పదవికి బరిలో ఉన్న ప్రకాశ్ రాజ్, మంచి విష్ణు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఈ సందర్భంలో వారు ఒకరిపై ఒకరు చేయి వేసుకొని మాట్లాడడం గమనార్హం. లోపల ఎలాంటి గొడవలు జరగడం లేదని ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని వీరిద్దరూ తెలిపారు.
-
మా ఎన్నికల్లో రిగ్గింగ్..?
మా అధ్యక్ష ఎన్నికలు కురుక్షేత్రాన్ని తలపిస్తున్నాయని సీనియర్ నటుడు సుమన్ అన్నట్లుగానే పరిణామాలు కనిపిస్తున్నాయి. పోలింగ్ కేంద్రంలో లేని నటీనటుల పేర్లతో ఓట్లు వేస్తున్నారని మంచు విష్ణు ప్యానెల్ ఆరోపణలు చేస్తోంది. దీంతో ఈ ఫిర్యాదును స్వీకరించిన ఎన్నికల అధికారి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తామని అధికారులు తెలిపారు.
-
తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన మోహన్ బాబు..
మా ఎన్నికల్లో మరోసారి రసాభాస మొదలైంది. ఎన్నికల కేంద్రం లోపల ప్రచారం చేస్తున్నారంటూ రెండు ప్యానెళ్ల మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలోనే మోహన్ బాబు కోపంతో ఊగిపోయారు. పోలింగ్ సెంటర్‌లో ప్రచారం చేయడానికి ఎలా అనుమతించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెనర్జీని చంపేస్తామంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
-
ఓటు హక్కు వినియోగించుకున్న బాలయ్య.. ఏం మాట్లాడరంటే..
ఓటు హక్కును వినియోగించుకున్న నందమూరి బాలకృష్ణ మీడియాతో పలు ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరు ఇండస్ట్రీకి మేలు చేస్తారో వారికే ఓటేశాను. ఇద్దరూ ఇండస్ట్రీకి బాగా చేసేలా కనిపిస్తున్నారు. దీంతో రెండు ప్యానెల్లో ఉన్న వారికి ఓటు వేశాను. ప్రకాశ్ రాజ్, తమ్ముడు విష్ణు ఇండస్ట్రీకి అన్నదమ్ముళ్ల లాంటి వారే. మాటల్లో చెప్పడమే కాకుండా చేతుల్లో చేసి చూపించేవారు. రేపు షూటింగ్‌లలో మళ్లీ కలిసి పని చేసుకునే వాళ్లమేనని తెలిపారు. మా సభ్యులకు ఎలాంటి అవసరాలున్నావారికి సహాయం అందించే బాధ్యత మా ఎన్నికల్లో గెలిచిన వారిదే బాధ్యత కాదని, ఇండస్ట్రీలోని అందరిపై ఆ బాధ్యత ఉందని బాలయ్య చెప్పుకొచ్చారు.
-
ఓటు హక్కు వినియోగించుకున్న చిరంజీవి ఏమన్నారంటే..
ఓటు హక్కును వినియోగించుకొని బయటకు వచ్చిన చిరంజీవి.. మా ఎన్నికలు ఇంత ప్రతిష్టాత్మకంగా జరగడంపై ఎలా స్పందిస్తున్నారన్న ప్రశ్నకు స్పందిస్తూ.. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒక్కోసారి మారుతోన్న పరిస్థితులకు అనుగుణంగా సమాయత్తం కావాల్సి ఉంటుంది. మీ మీడియాకు మంచి మెటిరియల్ దొరికింది కదా.. ఈ పరిస్థితిలో ఆనంద పడాలి కదా. అని చమత్కరించారు. ఎక్కువ శాతం కళాకారులు ఎవరిని ఎన్నుకుంటే వారికే నా మద్ధతు అని చెప్పుకొచ్చారు.
-
ఓటు హక్కు వినియోగించుకున్న రాశీ..
సీనియర్ నటి రాశీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం బయటకు వచ్చిన రాశీ మీడియాతో మాట్లాడుతూ.. ఏ ప్యానెల్ గెలిచినా తనకు సంతోషమే అని చెప్పుకొచ్చారు. దీనికి ఇంత ఇష్యూ అవసరం లేదని, ఈ రోజు సాయంత్రంకల్లా వివాదం ముగిసిపోతుందని రాశీ చెప్పుకొచ్చారు.
-
పోలింగ్ కేంద్రానికి చేరుకున్న చిరంజీవి, బాలకృష్ణ..
మా అధ్యక్ష ఎన్నిక కోసం జరుగుతోన్న ఎన్నికల కోసం సినీ పెద్దలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మెగా స్టార్ చిరంజీవితో పాటు బాలకృష్ణ వచ్చారు. బాలకృష్ణ ఎంట్రీ ఇవ్వగానే అభిమానులు ‘జై బాలయ్య’ అంటూ నినాదాలు చేశారు.
-
మా ఎన్నికల్లో ఉద్రిక్తత..
జీవిత, ప్రభాకర్ పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారంటూ విష్ణు ప్యానెల్ ఫిర్యాదు చేసింది. దీంతో ఎన్నికల అధికారి స్పందించి క్యాంపెయిన్ చేస్తే బయటకు పంపిస్తామని హెచ్చరించారు. ఇక ఓటర్లకు నమూనా బ్యాలెట్ ఇస్తున్న శివారెడ్డిని నటుడు శివబాలాజీ అడ్డుకున్నారు. దీంతో కాస్త మాట మాట పెరగడంతో పోలీసులు చెదరగొట్టారు.
-
నేను కూడా పోటీ చేయాలనున్నా కానీ.. సాయి కుమార్.
మా అధ్యక్ష పదవి కోసం కొనసాగుతోన్న ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి నటుడు సాయి కుమార్ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ఎన్నికల స్థాయిలో మా ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. తాను కూడా పోటీ చేయాలనుకున్నాడని కానీ షూటింగ్‌లో బిజీ ఉండడంతో పోటీలో లేనని చెప్పుకొచ్చాడు. ఇక ఎవరు గెలిచినా మా గెలిచినట్లేనని చెప్పిన సాయి కుమార్.. తాను లోకల్, నాన్ లోకల్ కాదని నేషనలిస్ట్ అని తెలిపాడు.
-
పోలింగ్ కేంద్రానికి చేరుకున్న రామ్ చరణ్..
మా అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. చెర్రీతో పాటు ఇప్పటి వరకు ఎవరెవరు ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో.. మంచు లక్ష్మి, శ్రీకాంత్, నరేష్, శివబాలాజీ, ఉత్తేజ్, సుడిగాలి సుధీర్, మహర్షి రాఘవ, సాయి వెంకట్, ఖయ్యుమ్, వేణు, శాంతి శ్రీ హరి భార్య, ఈటీవీ ప్రభాకర్ ఉన్నారు.
-
బండ్లగణేశ్‌కు జీవితపై ఎంత కోపమో చూశారా..?
మా అధ్యక్ష ఎన్నికల్లో మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా నటుడు బండ్ల గణేశ్ ట్విట్టర్‌లో చేసిన ఓ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రకాశ్ రాజ్ ప్యానల్‌కు ఓటు వేయండి అంటూ వేడుకుంటూ ఓ పోస్టర్‌ను ట్వీట్ చేసిన బండ్లా.. అందులో జనరల్ సెక్రటరీ పోస్టుకు పోటీ చేస్తోన్న జీవిత రాజశేఖర్ ఫోటోను బ్లాక్ పెన్‌తో గీసినట్లున్న ఫోటోను పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే బండ్లగణేశ్ జనరల్ సెక్రటరీ పోస్టుకు స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించి అనంతరం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక గతంలో జీవితపై బండ్లా పలు ఆరోపణలు చేసిన విషయం విధితమే.
Please vote ? pic.twitter.com/EIogzJTlmy
— BANDLA GANESH. (@ganeshbandla) October 9, 2021
-
తొలి ఓటు పవన్ కళ్యాణ్‌దే..
మా అధ్యక్ష ఎన్నికలు ప్రారంభమయ్యాయి. తొలి ఓటును పవన్ కళ్యాణ్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇండస్ట్రీ ఎట్టి పరిస్థితుల్లో చీలిపోదని, నిజానికి మా అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవంగా జరగాల్సి ఉండాలని పవన్ అభిప్రాయపడ్డారు.
-
సినిమా ఇండస్ట్రీ చీలడం అనే ప్రశ్నేలేదు.. పవన్ కళ్యాణ్.
మా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌కు పవన్ కళ్యాణ్ ఉదయాన్నే హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల పోలింగ్ కేంద్రం బయట మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తిప్పి కొడితే 900 ఓట్లు ఉన్నాయి. దీనికోసం వ్యక్తిగత దూషణలు అవసరమా’ అని ప్రశ్నించారు. సినిమాలు చేసే వాళ్లు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి కానీ.. ఇలాంటి వ్యక్తిగత దూషణలు ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయన్నారు. మా ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ ఇలాంటి పోటీని చూడదలేదని ఆయన తెలిపారు. సినిమా ఇండస్ట్రీ చీలడం అనే సమస్యే ఉండదని పవన్ తేల్చి చెప్పాడు. ఇక మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి అన్న ప్రచారం జరుగుతుందన్నదానిపై పవన్ స్పందిస్తూ.. ‘వారిద్దరు మంచి ఫ్రెండ్స్’ అని తెలిపారు.
-
పోలింగ్ కేంద్రానికి చేరుకున్న పవన్ కళ్యాణ్..
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో జరుగుతున్న మా ఎన్నికలకు పవన్ కళ్యాణ్ హజరయ్యారు.
-
మా ఎన్నికల పోలింగ్ ప్రారంభం..
మూవీ అర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ప్రారంభమయ్యాయి. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
-
పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్న తారలు..
కాసేపట్లో మా ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి. ఈక్రమంలో సినీ ప్రముఖులు ఒక్కోక్కరిగా పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. నటి హేమ, జీవితా రాజశేఖర్, మంచు లక్ష్మి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు.
-
పోలింగ్ కేంద్రానికి చేరుకున్న మురళి మోహన్..
మా ఎన్నికలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. నటుడు మురళి మోహన్ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నాడు. ..
-
ఎంత మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారంటే..
మరో అర గంటలో మా పోలింగ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ‘మా’లో మొత్తం 925 మంది సభ్యులు ఉన్నారు. అయితే వీరిలో 883 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరి చివరికి ఎంతమంది పోలింగ్ కేంద్రానికి వస్తారో చూడాలి. ఇదిలా ఉంటే మధ్యాహ్నం 2 గంటలకు పోలింగ్ ప్రక్రియ పూర్తికానుండగా ఓట్ల లెక్కింపు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ రోజు రాత్రికల్లా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
-
మోహన్ బాబు ఆశీర్వాదం తీసుకున్న ప్రకాశ్ రాజ్..
మా ఎన్నికలు జరుగుతోన్న జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌కు సినీ తారలు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. అధ్యక్ష పదవిలో ఉన్న మంచు విష్ణు ఉదయాన్నే చేరుకోగా. కాసేపటి క్రితమే ప్రకాశ్ రాజ్ కూడా వచ్చారు. వచ్చి రాగానే మంచు విష్ణును ఆలింగనం చేసుకున్నారు. ఇక అక్కడే ఉన్న మోహన్ బాబును చూడగానే కాళ్లకు నమస్కరించేందుకు ప్రయత్నించాడు అయితే మోహన్ బాబు దానికి నిరాకరించి ప్రకాశ్ రాజ్‌ను భుజం తట్టాడు. ఈ సన్నివేశం ఆసక్తిని రేకెత్తించింది.
-
అసలు ‘మా’ఉద్ధేశమేంటంటే..
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం.. నటీనటులకు సంబంధించిన పారితోషికాలు, దర్శక నిర్మాతలతో వివాదాలు, సభ్యుల సంక్షేమాన్ని చూసుకోవడం.నిర్మాతలెవరైనా నటీనటులకు పారితోషకం ఇవ్వకపోయినా, దర్శక నిర్మాతలకు నటీనటులకు గొడవలు జరిగినా మా జోక్యం చేసుకుని వాటిని పరిష్కరిస్తుంది. అలాగే నిరుపేద కళాకారులు, వృద్ధ కళాకారుల ఆరోగ్యం కోసం సహాయం చేయడం, అవకాశాలు లేని వారికి సినిమా అవకాశాలు ఇప్పించడం కూడా మా బాధ్యతే.
-
నరేశ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన శ్రీకాంత్..
మా ఎన్నికల నేపథ్యంలో సినీ తారలు రాజకీయ నాయకులనుం మించి విమర్శలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రకాశ్ రాజ్ సభ్యులను డబ్బు పంచుతున్నారని నరేశ్ ఆరోపణలు చేశారు. దీంతో ఈ విషయంపై ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యుడైనా శ్రీకాంత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ‘నరేశ్ గారు ఇంకా ఎందుకండీ అబద్ధాలు ఆడుతారు. మేము డబ్బులు పంచుతున్నామా.? మీరు ఎవరితోనే డబ్బులు పంపించి ప్రకాశ్ రాజ్ ఇస్తాడని చెప్పదలుచుకున్నారా.? ఆపేయండి సార్ ఇక్కడితో.. ఎక్స్‌ట్రాలు మాట్లాడకండి. సభ్యులకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. నరేశ్ గారు వాళ్లు చేసే పనిని మా మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నాడు. సభ్యులందరూ దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. మేము మందు పార్టీ ఇవ్వలేదు, డబ్బులు పంచలేదు.. మీరు అందరూ మా మీద బురద చల్లాలనుకుంటున్నారా.? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ను నాశనం చేయడానికేనా మీరు ఉన్నది’ అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపించారు.
శ్రీకాంత్ ఇంకా ఏమన్నారంటే..
-
ఇప్పటి వరకు మా అధ్యక్షులిగా ఎవరెరవు పనిచేశారంటే..
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తొలిసారి 1993లో ఏర్పటైంది. ఆ ఏడాది మెగాస్టార్ చిరంజీవి తొలిసారి మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మా అధ్యక్షులిగా పనిచేసిన వారి జాబితా ఓసారి చూద్దాం.. 1993-95 (చిరంజీవి) 1995-97 (ఘట్టమనేని కృష్ణ). 1997-99 (ఘట్టమనేని కృష్ణ) 1999-2000 (మురళీ మోహన్) 2000-2002 (నాగార్జున) 2002 – 2004 (మురళీ మోహన్) 2004-2006 (మోహన్ బాబు) 2006-2008 (నాగబాబు) 2008-2015 (మురళీ మోహన్) 2015-2019 (శివాజీ రాజా) 2019- ప్రస్తుతం (నరేశ్)
-
మీకు తెలుసా.?
‘మా’ అసోసియేషన్ ఎన్నికల్లో మొత్తం 26 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఇందులో భాగంగా ఒక్కో ఓటర్ 26 ఓట్లను వేయాల్సి ఉంటుంది. ఇలా పోలైన మొత్తం ఓట్లలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు. అధ్యక్షుడికి, ఈసీ సభ్యుడికి ఇదే నిబంధన వర్తిస్తుంది. ఇదిలా ఉంటే రెండు వేరు వేరు ప్యానెళ్లలోపోటీ చేసిన అభ్యర్థులు గెలిచిన తర్వాత ఒకే ప్యానెల్‌గా మారుతారు. అధ్యక్షుడిగా ఎన్నికైన వారి ఆధ్వర్యంలో రెండు ప్యానెళ్లలో గెలిచిన అభ్యర్థులు పనిచేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒకే ప్యానెల్ ఏక పక్షంగా విజయం సాధించడం కష్టంగా చెప్పవచ్చు.
-
అధ్యక్ష పదవిలో నిలుస్తుంది ఎవరు.? ఎవరి మద్ధతు.. ఎవరికి.?
మా అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు పోటీకి దిగారు. రెండు ప్యానెళ్లలో ఉన్న సభ్యులు ప్రచారం హోరెత్తించారు. 900మందికి పైగా సభ్యులున్న ఈ అసోసియేషన్ ఎన్నికలు ఈసారి సాధారణ ఎన్నికల సమరాన్ని తలపిస్తున్నాయి. ఇక మంచు విష్ణు కోసం ఆయన తండ్రి, ప్రముఖ నటుడు మోహన్‌బాబు పరిశ్రమ పెద్దలందరినీ కలిసి మద్దతుని కూడగట్టే ప్రయత్నం చేశారు. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌కి చిరంజీవి కుటుంబం మద్దతుగా నిలుస్తోంది. ఆ మేరకు ఆ కుటుంబం నుంచి నాగబాబు ముందుకొచ్చి మద్దతుని ప్రకటించారు. దీంతో ఇలా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు రెండు వర్గాలుగా మారడంతో అందరిలోనూ ఈ ఎన్నికల ఫలితంపై ఆసక్తి నెలకొంది.
Published On - Oct 10,2021 6:26 AM