AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MAA Elections 2021: సిని’మా’ యుద్ధం.. మా అధ్యక్ష పదవి ముందున్న సవాళ్లు ఏంటీ.. సభ్యులను ఎలా ఎన్నుకుంటారు ?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు.. ఎట్టకేలకు తుది దశకు చేరుకున్నాయి. కొద్ది నెలలుగా జరుగుతున్న ప్రచారాలు,

MAA Elections 2021: సిని'మా' యుద్ధం.. మా అధ్యక్ష పదవి ముందున్న సవాళ్లు ఏంటీ.. సభ్యులను ఎలా ఎన్నుకుంటారు ?
Maa Updates
Rajitha Chanti
|

Updated on: Oct 10, 2021 | 7:46 AM

Share

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు.. ఎట్టకేలకు తుది దశకు చేరుకున్నాయి. కొద్ది నెలలుగా జరుగుతున్న ప్రచారాలు, ఆరోపణలతో మా ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపించాయి. మరికాసేపట్లో మా ఎన్నికలు ప్రారంభంకానున్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అద్యక్ష పదవి కోసం ఓ వైపు ప్రకాష్ రాజ్.. మరోవైపు మంచువిష్ణు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. గెలుపు సాధించేందుకు ఇరువురు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఉదయం 8 గంటలకు మా ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి మా ఎన్నికలు జరుగుతున్నాయి. అసలు మా ఎన్నికలు ఎలా జరుగుతాయి ? సభ్యులను ఎలా ఎన్నుకుంటారు ? ప్రస్తుతం మా అధ్యక్ష పదవి ముందున్న సవాల్లు ఏంటీ? ఇప్పుడు తెలుసుకుందామా.

మా అద్యక్షుడిని రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకుంటారు. ఇందులో అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యాక్షులు, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ఇద్దరు జాయింట్ సెక్రటరీలతోపాటు.. ట్రెజరర్ 18 మంది ఈసీ సభ్యులతో కలిపి మొత్తం 26 మంది ఉంటారు. వీరిని ఎన్నుకునేందుకు సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు.

ఓటింగ్ ప్రక్రియ.. మా ఎన్నికలలో ఓటింగ్ ప్రక్రియ ఆసక్తికరంగా ఉంటుంది. ఒక్కో ఓటరు మొత్తం 26 మంది కార్యవర్గ సభ్యులను ఎంచుకోవాల్సి ఉంటుంది. పోటీ పడుతున్న ప్యానల్ సభ్యుల్లో తమకు నచ్చిన అద్యక్షుడితోపాటు.. ఉపాధ్యాక్షుడు, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, సెక్రటరీ, ఈసీ సభ్యులకు ఓటు వేయాల్సి ఉంటుంది. అంటే ఒక్కో ఓటరు 26 ఓట్లు వేయాలి. రెండు ప్యానల్స్ మధ్య పోటీ జరిగితే ఎలాంటి గందరగోళం ఉండదు. ఇక 2015లో మా ఎన్నికలు ఈవీఎంల ద్వారా జరిగాయి. ఆ తర్వాత బ్యాలెట్ పద్దతిలో నిర్వహిస్తున్నారు.

మా అధ్యక్షుడు.. మా అసోసియేషన్ లో 26 మంది కార్యవర్గ సభ్యుల కోసం జరిగే ఓటింగ్ లో ఒక్కో ఓటరు 26 ఓట్లను వేయాలి. అందులో మొత్తం పోలైన ఓట్లలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు. అధ్యక్షుడైనా, ఈసీ అయిన ఓకే నిబంధన ఉంటుంది. ఇక ఎన్నికల్లో రెండు వేర్వేరు ప్యానల్స్ లో ఉండి పోటి చేసిన అభ్యుర్థులు గెలిచాక ఒక ప్యానల్ గా మారుతారు. అధ్యక్షుడు ఎవరైతే విజేతగా నిలుస్తారో అతని ఆధ్వర్యంలో మిగతా సభ్యులు పనిచేయాల్సి ఉంటుంది. ఇక పూర్తిగా ఒక ప్యానల్ మాత్రమే విజయం సాధించడం కష్టం.

ప్రస్తుతం మా సభ్యులు.. ఈరోజు (అక్టోబర్ 10)న మా ఎన్నికలు హైదరాబాద్ జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనున్నాయి. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. రాత్రి 8 గంటల లోపు ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం మాలో మొత్తం 925 మంది సభ్యులు ఉండగా.. 883 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

మా అధ్యక్షుడి ముందున్న సవాళ్లు.. మా ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి అధ్యక్ష కార్యదర్శులతోపాటు కార్యవర్గ సభ్యులంతా సభ్యుల సంక్షేమం, ఆరోగ్యం కోసం పనిచేయాల్సి ఉంటుంది. గత పాలకవర్గం చేపట్టిన పనులను కొనసాగిస్తూనే వాటిని మరింత సమర్థంగా నిర్వర్తించాల్సి ఉంటుంది. సభ్యుల ఫించన్లు, హెల్త్ ఇన్సూరెన్స్ లతోపాటు.. సభ్యుడు ఎవరైనా చనిపోతే అతని కుటుంబానికి రావాల్సిన జీవిత భీమా డబ్బును దగ్గరుండి మరి ఇప్పించాలి. అలాగే ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు సభ్యులకు అందుతున్నాయో లేదో చూడాలి. సభ్యులకు సినిమాలో అవకాశం కల్పించాలి. ఇక సంక్షేమంతోపాటు.. పరిశ్రమలో నటీనటులు ఎదుర్కోనే సమస్యలు పరిష్కరించాలి. నిర్మాత మండలి, దర్శకుల సంఘంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవడం.. ఇతర భాష నటీనటులు సంఘాలతో బేధాభిప్రాయాలు రాకుండా చూసుకోవాలి. అసోసియేషన్ కు నిధులు సేకరించేందుకు వినోధ కార్యక్రమాలు చేపట్టడం కూడా కార్యవర్గం బాధ్యతల్లో ఒకటి. ఇందుకోసం అసోసియేషన్ కో ఆర్టినేషన్ కమిటీ, వెల్ఫేర్ కమిటీ. యాక్టివిటీస్ కమిటీ, ఫండ్ రైజింగ్ కమిటీ, విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఇక గెలిచిన సభ్యులు వివాదాలు లేకుండా చూసుకోవాలి.

Also Read: MAA Elections 2021: సండే బిగ్ డే.. తుది అంకానికి చేరిన సిని’మా’ కథ.. నేడే మా ఎన్నికలు…