Cinema : మెంటలెక్కించే సీన్స్.. 50 లక్షలతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్..
ప్రస్తుతం చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. ఎలాంటి హడావిడి, అంచనాలు లేకుండా విడుదలైన చిత్రాలకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. తాజాగా ఓ సినిమా థియేటర్లలో సంచలనం సృష్టించింది. అలాంటి ఓ సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కేవలం రూ.50 లక్షలతో నిర్మిస్తే.. రూ.70 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

ఇటీవల కాలంలో చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పుడు థియేటర్లలో రాజు వెడ్స్ రాంబాయి సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అలాగే కొన్ని రోజుల క్రితం వచ్చిన ఓ చిన్న సినిమా సైతం ఊహించని రెస్పాన్స్ అందుకుంది. కేవలం రూ.50 లక్షలతో నిర్మించిన ఈ మూవీ.. దాదాపు రూ.70 కోట్ల వరకు రాబట్టింది. ఈసినిమా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా విడుదలై దాదాపు 50 రోజులు కావొస్తున్న ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఆ సినిమా పేరు లాలో. గుజరాతీ భాషలో రూపొందించిన ఈ సినిమాకు అంకిత్ సఖియా దర్శకత్వం వహించారు. ఇందులో రీవా రచ్, శృహద్ గోస్వామి, కరణ్ జోషిలు ప్రధాన పాత్రలలో నటించారు. అక్టోబర్ 10న విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా అంత పెద్ద హిట్ కాకపోయినా.. మౌత్ టాక్ తో దూసుకుపోతుంది.
ఇవి కూడా చదవండి : Cinema : రూ.32 కోట్లు పెట్టి తీస్తే రూ.440 కోట్ల కలెక్షన్స్.. ఆరేళ్లుగా సంచలనం.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
ఇప్పుడిప్పుడే ఈ సినిమా కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 70 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు గుజరాతీలో ఈ సినిమాకు కలెక్షన్స్ మరింత పెరుగుతున్నాయి. ఈ సినిమా కథ మొత్తం అహంకారం, తప్పుల కారణంగా కష్టాల్లో కూరుకుపోయిన లాలో అలియాస్ కరణ్ జోషి అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతడి భార్య తులసి అలియాస్ రీవా రచ్ తో గొడవపడడం, అప్పటికే తాగుతుండడంతో బయటకు వెళ్లిన అతడు.. డబ్బు దొంగిలించడానికి ఓ ఇంట్లో చిక్కుకుపోతాడు. అక్కడి నుంచి బయటకు రాలేక అక్కడే బంధీ అవుతాడు. ఆ తర్వాత అతడి పరిస్థితి ఏమైందీ ? అనేది సినిమా.
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..
నిర్మానుష్యమైన ఇంట్లో లాలో పూర్తిగా కుంగిపోతున్న సమయంలో సాక్షాత్తూ శ్రీకృష్ణుడి అలియాస్ శ్రుహద్ గోస్వామి రూపంలో దేవడే అతడికి ఆశాదీపంగా కనిపిస్తాడు. ఆ తర్వాత అతడు అక్కడి నుంచి ఎలా బయటపడ్డాడు అనేది సినిమా. ప్రస్తుతం థియేటర్లలో ఈ సినిమా దూసుకుపోతుంది.
ఇవి కూడా చదవండి : Suryavamsham : హీరోగా సూర్యవంశం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా.. ?
ఇవి కూడా చదవండి : Actress : కోట్లలో అప్పులు.. తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి ఈ బిగ్ బాస్ బ్యూటీ..
