AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘పుట్టపర్తి సత్యసాయి బాబానే నాకు పేరు పెట్టారు’.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ వీడియో వైరల్.. ఎవరో గుర్తుపట్టారా?

పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సత్యసాయిబాబాను స్మరించుకుంటున్నారు.సమాజానికి ఆయన చేసిన సేవలను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.

'పుట్టపర్తి సత్యసాయి బాబానే నాకు పేరు పెట్టారు'.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ వీడియో వైరల్.. ఎవరో గుర్తుపట్టారా?
Actress Sai Pallavi
Basha Shek
|

Updated on: Nov 24, 2025 | 6:35 PM

Share

శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు పుట్టపర్తి వచ్చి సత్యసాయి మహా సమాధిని దర్శించుకుంటున్నారు. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సచిన్ టెండూల్కర్, ఐశ్వర్యారాయ్ తదితర సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు హాజరయ్యారు. సత్యసాయి బాబాను స్మరించుకుంటూ సమాజానికి ఆయన చేసిన సేవలను మరోసారి గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, హీరోయిన్లు సత్యసాయిబాబాను అమితంగా ఆరాధిస్తారు. ఈ జాబితాలో ఒక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా ఉంది. సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ స్టార్ హీరోయిన్ వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది ఓ వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. అందులో ఆమె తన పేరుకు సంబంధించి ఇలా చెప్పుకొచ్చింది.

‘మా అమ్మ తాతయ్య సాయి బాబాకు భక్తులు.. మా అమ్మ, అత్తమ్మలు, మావయ్యలు సాయి బాబాకు చెందిన యూనివర్సిటీలోనే చదివారు. నన్ను చిన్నప్పటి నుంచే అక్కడికి తీసుకెళ్లే వారు. పుట్టపర్తి సాయిబాబానే నాకు పేరు పెట్టి దీవించారు. 14, 15 ఏళ్ల తరువాత నాపేరు నాకు చాలా నచ్చింది. నేను కూడా సాయిబాబా భక్తురాలినే.. సత్యసాయి బోధనలే నాలో ధైర్యాన్ని నింపాయి.. ఎలాంటి సమయంలోనైనా ప్రశాంతంగా ఉండటం, ఒత్తిడిని అధిగమించడం, క్రమశిక్షణ, ధాన్యం వంటివి ఆయన ద్వారానే నేర్చుకున్నాను’ అని సదరు హీరోయిన్ చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా? టాలీవుడ్ న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి.

ఇవి కూడా చదవండి

సత్య సాయిబాబా ఆశ్రమంలో సాయి పల్లవి..

కాగా ప్రస్తుతం పుట్టపర్తిలో జరుగుతోన్న సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాలకు సాయి పల్లవి కూడా హాజరైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఇప్పుడే కాదు. గతంలోనూ పలు సార్లు సాయి బాబా ఆశ్రమంలో కనిపించిందీ న్యాచురల్ బ్యూటీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..