AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: కాలేజీలో ఆ స్టార్ హీరోకు జూనియర్.. అతడికే తల్లిగా నటించిన హీరోయిన్..

సాధారణంగా హీరోయిన్స్ సినీరంగంలో కొనసాగడం అంత సులభం కాదు. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీలో వరుస సినిమాలతో చక్రం తిప్పిన ముద్దుగుమ్మలు.. ఆ తర్వాత తల్లిగా, వదినగా, అక్క, అత్త పాత్రలలో కనిపిస్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి సైతం తనకంటే 8 సంవత్సరాలు పెద్ద నటుడికి తల్లిగా కనిపించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Tollywood: కాలేజీలో ఆ స్టార్ హీరోకు జూనియర్.. అతడికే తల్లిగా నటించిన హీరోయిన్..
Sheeba Chaddha
Rajitha Chanti
|

Updated on: Aug 08, 2025 | 2:58 PM

Share

ప్రస్తుతం సినిమా ప్రపంచంలో చాలా మంది నటీమణులు తమ కెరీర్‌ను వివిధ రకాల పాత్రలతో ప్రారంభిస్తారు. ముఖ్యంగా హీరోయిన్లగా తమకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న తారలు చాలా తక్కువ మంది ఉన్నారు. హీరోయిన్ కావాలనుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత సహయ నటిగా రాణిస్తున్నవారు చాలా మంది ఉన్నారు. తల్లి, అత్త, అక్క, వదిన పాత్రలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. కానీ మీకు తెలుసా.. ? కాలేజీలో తనకు సీనియర్ అయిన ఓ స్టార్ హీరోకు ఇప్పుడు తల్లిగా నటిస్తున్న నటి గురించి.. ఒకసారి కాదు రెండుసార్లు బిగ్ స్క్రీన్ పై తల్లిగా కనిపించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఆ సూపర్ స్టార్ కంటే 8 సంవత్సరాలు చిన్నది. కానీ ఆమె తెరపై ఆ నటుడికి తల్లి పాత్రను పోషించాల్సి వచ్చింది. ఈ నటి మరెవరో కాదు షీబా చద్దా.

ఇవి కూడా చదవండి: Actress : బాబోయ్.. సీరియల్లో తల్లి పాత్రలు.. నెట్టింట గ్లామర్ రచ్చ.. సెగలు పుట్టిస్తోన్న వయ్యారి..

ఇవి కూడా చదవండి

హిందీలో పాపులర్ యాక్టర్ ఆమె. ‘బదాయి దో’ , ‘డాక్టర్ జీ’ చిత్రాలలో తన పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది షీబా చద్దా. 1998లో నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె మొదట ‘దిల్ సే’ చిత్రంలో చిన్న పాత్ర పోషించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షీబా మాట్లాడుతూ.. “దిల్ సే సినిమాలో తనకు చిన్న పాత్ర వచ్చింది.. డల్హౌసీలో షారుఖ్ ఖాన్ తో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన రయాస్, జీరో సినిమాల్లో షారుఖ్ తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నాను. మేము ఇద్దరం ఒకే కాలేజీ. అతడు నా సీనియర్. కానీ నేను రయీస్ సినిమాలో షారుఖ్ తల్లిగా కనిపించాను. షారుఖ్ చాలా సున్నితం. తనతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి: Ajith Kumar: అజిత్ పక్కన ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ? పాన్ ఇండియా హీరో కమ్ విలన్.. ఎవరంటే..

మొదట్లో షారుఖ్ ఖాన్ తల్లి పాత్రలు అంటే ఆశ్చర్యపోయానని.. కానీ తాను తనకంటే 12 సంవత్సరాల పెద్దవాళ్లకు కూడా తల్లిగా కనిపించానని.. 30 ఏల్ల మహిళ అంటే తల్లి పాత్రలు మాత్రమే వస్తాయని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం షీబా చద్దా హిందీలో పలు సీరియల్స్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి: Kamal Haasan: అప్పుడు చిన్న హీరోయిన్.. ఇప్పుడు కమల్ హాసన్‏తోనే.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఇవి కూడా చదవండి: Cinema: ఇదెక్కడి సినిమా రా బాబు.. రూ.16 కోట్లు పెడితే 400 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ ఆగం చేసిన మూవీ..

నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్