Kantara 2: కాంతారను వెంటాడుతున్న విషాదాలు.. మరొక నటుడు హఠాన్మరణం.. ఏమైందంటే?
కాంతారా ఛాప్టర్ 1 సినిమాను హోంబాలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. ఈ చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలోనూ నటిస్తన్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాంతార సినిమాను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఈ మూవీ సెట్లో తరచూ ప్రమాదాలు జరిగాయి. అలాగే ఈ సినిమాలో భాగమైన నటులు, టెక్నీ షియన్లు వరుసగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇటీవలే కాంతార చాప్టర్ 1 మూవీ షూటింగ్ పూర్తయినట్లు చిత్ర బృందం ప్రకటించింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం చిత్ర బృందమంతా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉంటోంది. అయితే తాజాగా మరో కాంతార నటుడు కన్నుమూశారు. ‘ కాంతార ‘ మొదటి భాగంలో నటించిన ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్ టి. ప్రభాకర్ గుండెపోటుతో కన్నుమూశారు. ఉడిపి జిల్లాలోని హెబ్రీ తాలూకాలోని పెర్దూర్ కు చెందిన ప్రభాకర్ ‘కాంతారా’ చిత్రంలో మహాదేవ పాత్రను పోషించారు. ప్రభాకర్ కు నాటక రంగంపై చాలా ఆసక్తి ఉండేది. వివిధ నాటకాల్లోనూ ఆయన నటించారు. ఈ క్రమంలోనే కాంతార పార్ట్ 1లోనూ ఛాన్స్ దక్కించుకున్నారు. కాగా ‘కాంతార’ సినిమా కోసం ఆయన దాదాపు ఒక సంవత్సరం పాటు గడ్డం తీయించుకోలేదని చెబుతారు.
కాగా సుమారు ఐదేళ్ల క్రితమే ప్రభాకర్ కు హార్ట్ ఆపరేషన్ జరిగింది. తాజాగా ఆయనకు తన నివాసంలో శుక్రవారం (ఆగస్టు 08) మరోసారి ఛాతి నొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే ప్రభాకర్ మృతి చెందినట్టు ధ్రువీకరించారు. నటుడి మృతి తో ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. అలాగే ప్రభాకర్ మరణంపై పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నివాళులు అర్పిస్తున్నారు.
‘కాంతార: చాప్టర్ 1’ అనేది ‘కాంతార’ చిత్రానికి ప్రీక్వెల్. ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలవుతోంది. ఈ సినిమాలో రిషబ్, రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
కాంతార 2 సినిమాలో రుక్మిణీ వసంత్..
Introducing @rukminitweets as ‘KANAKAVATHI’ from the world of #KantaraChapter1.
ಕನಕವತಿಯ ಪರಿಚಯ ನಿಮ್ಮ ಮುಂದೆ. कनकवती का परिचय आपके लिए. కనకవతి ని మీకు పరిచయం చేస్తున్నాం. கனகாவதியை பற்றிய அறிமுகம் உங்கள் முன் உள்ளது. കനകാവതിയുടെ ആമുഖം നിങ്ങൾക്കുമുമ്പിൽ. আপনাদের সামনে কনকবতীকে… pic.twitter.com/4JmMy901un
— Hombale Films (@hombalefilms) August 8, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








