AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 15 ఏళ్లకే పెళ్లైంది.. 17 ఏళ్లకే తల్లైంది.. తన కంటే పెద్దవాడితో ప్రేమకథ నడిపిన హీరోయిన్..

15 వయసులోనే స్టార్ హీరోయిన్. అదే ఏడాది పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. 17 ఏళ్ల వయసులోనే తల్లైంది. అయినప్పటికీ సినిమాల్లో మాత్రం విజయవంతమైన ప్రస్థానం కొనసాగించింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి వెండితెరపై తనదైన ముద్ర వేసింది. అప్పట్లో ఆమె అభిమానుల ఫేవరేట్ హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరు.. ? ఇప్పుడేం చేస్తుందో తెలుసుకుందామా.. ?

Tollywood: 15 ఏళ్లకే పెళ్లైంది.. 17 ఏళ్లకే తల్లైంది.. తన కంటే పెద్దవాడితో ప్రేమకథ నడిపిన హీరోయిన్..
Actress
Rajitha Chanti
|

Updated on: May 03, 2025 | 8:37 AM

Share

ప్రస్తుతం సినీరంగం చాలా మారిపోయింది. ఇప్పుడు హీరోహీరోయిన్స్ ప్రేమ, పెళ్లి బంధాలకు దూరంగా ఉంటున్నారు. లేటు వయసులో వివాహం చేసుకుని అటు సినిమాల్లోనూ కొనసాగుతున్నారు. కరీనా కపూర్, అలియా భట్, దీపికా పదుకొణె వంటి స్టార్స్ పెళ్లి, పిల్లలు అయిన తర్వాత కూడా బాక్సాఫీస్ ను ఏలేస్తున్నారు. కానీ ఒకప్పుడు పరిస్థితి భిన్నంగా ఉండేది. హీరోయిన్స్ పెళ్లి తర్వాత తమ కెరీర్ నిలబెట్టుకోవడం అంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే నటి సైతం ఎన్నో కష్టాలు ఎదుర్కొని సినీరంగాన్ని ఏలేసింది. ఆమె కేవలం 15 సంవత్సరాల వయసులో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఇక అదే ఏడాది పెళ్లి చేసుకుంది. 17 వయసులోనే తల్లి అయ్యింది. ఆమె మరెవరో కాదు ఒకప్పటి స్టార్ హీరోయిన్ మౌషుమి ఛటర్జీ. 1952లో ఇందిరా ఛటర్జిగా జన్మించిన ఆమె 1967లో బెంగాలీ సినిమా బాలికా బధులో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసింది.

ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. తొలినాళ్లలో విజయం సాధించినప్పటికీ, మౌషుమి మొదట్లో తన చదువుపై దృష్టి పెట్టాలని కోరుకుంది. తన కుటుంబం కోరిక మేరకు ఆమె ప్రముఖ సంగీత స్వరకర్త, గాయకుడు హేమంత్ కుమార్ కుమారుడు జయంత్ ముఖర్జీని వివాహం చేసుకుంది. క్యాన్సర్ చివరి దశలో ఉన్న తన తండ్రి చివరి కోరిక మేరకే తాను పెళ్లి చేసుకున్నానని.. అందుకు చదువు సైతం వదిలేయాల్సి వచ్చిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది మౌషుమి. ఆమె రెండవ బెంగాలీ చిత్రం, పరిణీత (1969). 1972లో అనురాగ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. చిన్న వయసులోనే తల్లి అయ్యానని.. అప్పుడే తన విజయాలకు మెర్సిడెస్ కారు కొన్నట్లు తెలిపింది.

Moushumi Chatterjee

Moushumi Chatterjee

1970లలో, మౌషుమి ఛటర్జీ బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా ఎదిగారు. హిందీ, బెంగాలీలో వరుస సినిమాల్లో నటించింది. పెళ్లి, పిల్లలు అయిన తర్వాత సినీరంగంలో వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా సత్తా చాటింది మౌషుమి.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..