AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఊహించని ట్విస్టులు.. థ్రిల్లింగ్ సీన్స్.. ఓటీటీలో దుమ్ములేపుతోన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్..

ప్రస్తుతం ఓటీటీ సినీప్రియుల కోసం సరికొత్త సినిమాలు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా హారర్ చిత్రాలతోపాటు మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ సైతం అడియన్స్ ముందకు వస్తున్నాయి. తాజాగా తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలో దుమ్ములేపుతుంది. తెలుగులో వచ్చిన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.

OTT Movie: ఊహించని ట్విస్టులు.. థ్రిల్లింగ్ సీన్స్.. ఓటీటీలో దుమ్ములేపుతోన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్..
Garuda 2.0 Film
Rajitha Chanti
|

Updated on: May 03, 2025 | 8:16 AM

Share

ఓటీటీ సినీప్రియుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈమధ్య కాలంలో ఊహించని ట్విస్టులు.. థ్రిల్లింగ్ సీన్లతో వచ్చే క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఆద్యంతం సస్పెన్స్ మధ్య సాగే సినిమాలకు అడియన్స్ నుంచి మంచి ఆదరణ వస్తుంది. తాజాగా ఓటీటీలో ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ దుమ్ములేపుతుంది. అదే గరుడ 2.0. దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం అంటే 2016లో ఫిబ్రవరి 26న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. అయితే తమిళంలో ఆరతు సినమ్ అనే పేరుతో వచ్చిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో గరుడ 2.0 పేరుతో రిలీజ్ చేశారు. గతంలో తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఐఎమ్డీబీ నుంచి ఈ చిత్రానికి 6.8 రేటింగ్ వచ్చింది. దాదాపు తొమ్మిదేళ్లకు ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రానికి ఇప్పుడు మరోసారి మంచి రెస్పాన్స్ వస్తుంది.

ప్రస్తుతం ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ఆహాలో టాప్ 1 ప్లేస్ ట్రెండింగ్ లో ఉందని మేకర్స్ తెలిపారు. అప్పట్లో థియేటర్లలో సత్తా చాటిన ఈ సినిమాకు ఇప్పుడు ఓటీటీలోనూ ఊహించని రెస్పాన్స్ వస్తుంది. హనుమాన్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రాన్ని నిర్మాత బాలు చరణ్ తెలుగులో రిలీజ్ చేశారు. ఇందులో ఐశ్వర్య రాజేశ్, డిమాంటీ కాలనీ పేమ్ అరుళ్ నిధి ప్రధాన పాత్రలు పోషించారు. తమిళంలో వరుస సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు అరుళ్ నిధి. ఇక ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది ఐశ్వర్య రాజేశ్.

ఈ చిత్రానికి అరివాజగన్ వెంకటాచలం దర్శకత్వం వహించారు. క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారికి గరుడ 2.0 సినిమా ఈ వేసవికి బెస్ట్ ఛాయిస్ అని చెప్పోచ్చు. ఇందులో ఐశ్వర్య రాజేశ్ అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..

Follow Us