Tollywood: సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.. కట్ చేస్తే.. 1300 కోట్ల కంపెనీకి ఓనర్ అయ్యింది..
ఒకప్పుడు తన అందం, అభినయంతో కుర్రకారును ఊర్రుతలూగించింది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే బ్యూటీ ప్రొడక్ట్ బ్రాండ్ ను ప్రారంభించడం కోసం యాక్టింగ్ వదిలేసింది. కట్ చేస్తే ఇప్పుడు రూ.1300 కోట్ల కంపెనీకి ఓనర్ అయ్యింది. ఆమె ఎవరంటే..
ఇండస్ట్రీలో యాక్టింగ్ తోపాటు సొంతంగా వ్యాపారాలు స్టార్ట్ చేసిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అలియా భట్, దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా, సమంత, నయనతార, రష్మిక మందన్నా, శ్రద్ధా కపూర్ వంటి తారలు అటు సినిమాల్లో నటిస్తూనే ఇటు పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. కొందరు హీరోయిన్స్ దుస్తుల బ్రాండ్, మరికొందరు సౌందర్య ఉత్పత్తుల బ్రాండ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటివరకు తమకు ఉన్న ఇమేజ్, స్టార్ స్టేటస్ తో అటు తమ బిజినెస్ బ్రాండ్స్ సైతం ప్రమోట్ చేసుకుంటున్నారు. అయితే పలువురు హీరోయిన్స్ మాత్రం బిజినెస్ కోసం సినిమాలను వదిలిపెట్టేశారు. నటనకు గుడ్ బై చెప్పేసి తమ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకున్నారు.అందులో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ సైతం ఒకరు.
నటనా రంగం నుంచి తప్పుకున్న తర్వాత వ్యాపారంపై శ్రద్ధ పెట్టింది. ఒకప్పుడు స్మాల్ స్క్రీన్‌ను అలరించిన ఆమె ఈరోజు 1300 కోట్ల కంపెనీకి ఓనర్‌గా మారింది. ఆమె మరెవరో కాదు.. ఆష్కా గరోడియా. ఆమె విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్. బుల్లితెరపై ఎన్నో సీరియల్లలో విలన్ పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదిచుకుంది. కానీ నటనకు గుడ్ బై చెప్పేసి కాస్మోటిక్ వ్యాపారరంగంలోకి అడుగుపెట్టింది. 2002లో తన నటనా జీవితాన్ని ప్రారంభించి, 2019లో శాశ్వతంగా టీవీ పరిశ్రమను విడిచిపెట్టింది.
ఆ తర్వాత వ్యాపారంపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఆమె 1300 కోట్ల వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. తన ఇద్దరు స్నేహితులతో కలిసి 2018లో ‘రెనే కాస్మటిక్స్’ కంపెనీని ప్రారంభించింది. ఈ కంపెనీ ప్రస్తుతం కోట్ల రూపాయల టర్నోవర్‌ను కలిగి ఉంది. రెనే కాస్మటిక్స్ ప్రస్తుతం భారతదేశంలోని ప్రముఖ కంపెనీలలో ఒకటి. నివేదిక ప్రకారం 2024 నాటికి కాస్మోటిక్ బ్రాండ్ కంపెనీ రెనే ధర రూ.1300 కోట్లకు చేరుకుంది. నేడు ఆష్కా గరోడియా ఒక విజయవంతమైన వ్యాపారవేత్త. ఆమె జీరో నుండి ప్రారంభించిన వ్యాపారం చాలా విజయవంతమైంది. ఆష్కా గరోడియా 2002లో అచానక్ 37 సాల్ బాద్ అనే టీవీ సీరియల్‌తో తొలిసారిగా నటించింది. ఆమె చాలా సీరియల్స్‌లో నెగిటివ్ పాత్రలు పోషించింది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.