కష్టపడాల్సిన పనిలేదు.. ఇప్పుపు హెల్మెట్ క్లిన్ చేయడం మరింత ఈజీ.. జస్ట్ 5 నిమిషాలే..
మనం డైలీ వాడడం వల్ల దుమ్ము, దూళి, చెమల కారణంగా హెల్మెట్ అనేది మురికిగా మారుతుంది. అలాగే దానిని నుంచి స్మెల్ కూడా వస్తుంది. చాలా మంది ఈ హెల్మెట్‌ను శుభ్రం చేసేందుకు చాలా కష్టపడుతారు. కానీ బెంగళూరుకు చెందిన ఓ కుర్రాడు దీనిని చక్కటి పరిష్కారం కనిపెట్టాడు. దీంతో కేవలం 5 నిమిషాల్లో హెల్మెట్ మొత్తాన్ని క్లిన్ చేచొచ్చు. అదెలానో తెలుసుకుందాం.

ఈ రోజుల్లో బైక్ అనేది ప్రతి ఒక్కరి జీవింతంలో ఎంతో ముఖ్యమైనది. ముఖ్యంగా మధ్యతరగతి ఇదే జీవనాదారం ఎందుకంటే కేవలం బైక్‌తోనే చాలా మంది ఓలా, ఊబెర్, ర్యాపీడో వంటి సర్వీసుల్లో పనిచేస్తూ ఫ్యామిలీలను పోషిస్తున్నారు. అయితే బైక్ నడిపేప్పుడు ప్రమాదాల బారీన పడకుండా ఉండాలంటే హెల్మెంట్ ధరించడం చాలా ముఖ్యం. హెల్మెట్ ఎక్కవగా వాడడం చెమట, దుమ్ము కారణంగా అది మురికిగా మారుతుంది. దాన్ని అలానే వాడితే హెయిర్‌ఫాల్, ఇతర సమస్యలు రావచ్చు. కాబట్టి దీన్ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ సమస్యకు బెంగళూరుకు చెందిన ఒక యువకుడు ఒక అద్భుతమైన, ప్రభావవంతమైన పరిష్కారాన్ని కనుగొన్నాడు. దీంతో గంటల తరబడి రుద్దాల్సిన పని లేకుండా జస్ట్ 5 నిమిషాల్లోనే హెల్మెట్‌ను క్లీన్ చేయొచ్చు. అదెలాగో చూద్దాం పదండి.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల యువ పారిశ్రామికవేత్త సాయి కుమార్ రెడ్డి ఈ సమస్యకు చక్కని పరిష్కారాన్ని కనుగొన్నారు. ఆయన ‘హెల్మియో’ అనే మిషన్‌ను తయారు చేశారు, ఇది కేవలం కొన్ని నిమిషాల్లోనే మురికి హెల్మెట్‌ను పూర్తిగా శుభ్రం చేసి, బ్యాక్టీరియా లేకుండా చేస్తుంది. సాయి కుమార్ రెడ్డి 2021లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఒక పెద్ద ఐటీ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. కానీ అతనికి ఉద్యోగం ఏమాత్రం ఇష్టం లేదు. అతని దృష్టి అంతా వ్యాపారంపైనే ఉంది. ఇదే అతన్ని ఈ సరికొత్త ఇన్నోవేషన్ వైపు నడిపించింది.
‘హెల్మియో’ ఆలోచన ఎలా వచ్చింది?
అయితే డెవిరీ బాయ్స్ బైక్ నడిపేప్పుడు జనాలు ఎక్కువగా హెల్మెట్ లోపల కర్చీపులు కట్టుకోవడం, దుర్వాసన దూరం చేసేందుకు స్ప్రేలు కొట్టడం సాయి గమనించాడు. అయినప్పటికీ వాసన, అశుభ్రత వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నట్టు గ్రహించాడు. అప్పుడే అతనికి ఒక ఐడియా వచ్చింది. జెప్టో , బ్లింకిట్ తరహాలో నిమిషాల్లో హెల్మెట్‌ను క్లిన్ చేసే సర్వీస్ అవసరం అని. తన బ్రెయిన్‌కు పని పెట్టి ఏఐ టూల్స్, మెడికల్ కాలేజీల సహాయంతో బ్యాక్టీరియాను ఎలా తొలగించవచ్చో తెలుసుకున్నాడు. అప్పుడే ఈ సరికొత్త హెల్మెట్ క్లినింగ్ మిషన్‌ను తయారు చేశాడు.
ఈ మిషన్ ఎలా పనిచేస్తుంది?
ఒక నివేదిక ప్రకారం, ఈ మిషన్ 5 స్టెప్స్‌లో పనిచేస్తుంది. అలా హెల్మెట్ మొత్తాన్ని జస్ట్ 4.5 నిమిషాల్లో క్లిన్ చేస్తుంది.
యూవీ నిర్జంతూకరణ : మొదట హెల్మెట్ వెలుపలి భాగంలో ఉన్న బ్యాక్టీరియాను అల్ట్రావైలెట్ లైట్ సహాయంతో నశింపజేస్తుంది. దీనికి 30 సెకన్లు పడుతుంది.
యాంటీ బ్యాక్టీరియల్ ఫాగ్: ఆ తర్వాత యాంటీ బ్యాక్టీరియల్ పొగ హెల్మెట్ లోపలి ప్యాడ్ మూలల్లోకి వెళ్లి శుభ్రం చేస్తుంది.
ధూళిని తొలగించడం : సక్షన్ సిస్టమ్ హెల్మెట్ లోపల చిక్కుకున్న ధూళిని లాగేస్తుంది.
తేమను ఆరబెట్టడం : ఈ మిషన్ హెల్మెట్‌లోని తేమను/చెమటను ఆరబెడుతుంది, తద్వారా దానిని వెంటనే ధరించవచ్చు.
సువాసన : అంతే కాదు హెల్మెట్‌లోపల మంచి కాఫీ లాంటి వాసన వచ్చేలా దీనిని సాయి రూపొందించాడు. ఈ వాసన 10 రోజుల వరకు ఉంటుంది.
వ్యాపారం వైపు అడుగు
అయితే ఈ ఇన్నోవేషన్ బిజినెస్ చేయాలన్న సాయి కోరికను కూడా తీర్చింది. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో మొదటి మిషన్‌ను ఏర్పాటు చేసిన తర్వాత, సాయి మొదటి వారంలోనే రూ. 8,000 సంపాదించారు. హెల్మెట్ క్లీన్ చేయడానికి రూ. 69 ఛార్జ్ చేస్తాడు. కానీ దానికి అయ్యే ఖర్చు కేవలం రూ.10 మాత్రమే. సాయి ఒక మిషన్ ద్వారా రోజుకు రూ.1,700 వరకు సంపాదించాడు. గత రెండు నెలల్లో చెన్నై, హైదరాబాద్, గుర్గావ్ వంటి నగరాల్లో 15 కంటే ఎక్కువ మిషన్లను విక్రయించి రూ.38 లక్షలకు పైగా ఆదాయాన్ని ఆర్జించారు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
