Photo vs Image: రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజాలు..!
Difference Between Photo and Image: ఇకపై ఎప్పుడైనా కెమెరాతో నిజమైన దృశ్యాన్ని బంధిస్తే దాన్ని గర్వంగా 'ఫోటో' అని పిలవండి. అలా కాకుండా కంప్యూటర్లు, మొబైల్ గ్రాఫిక్స్ లేదా ఐఏ టూల్స్ ద్వారా సృష్టించిన కల్పిత రూపాన్ని చూస్తే దాన్ని 'ఇమేజ్' అనండి. ఈ చిన్న సాంకేతిక వ్యత్యాసాన్ని గ్రహిస్తే డిజిటల్ ప్రపంచాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

Difference Between Photo and Image: మనం ప్రతిరోజూ సోషల్ మీడియాలో, ఇంటర్నెట్‌లో ‘ఫోటో’, ‘ఇమేజ్’ అనే పదాలను వందల సార్లు వాడుతుంటాం. చాలామంది ఈ రెండూ ఒక్కటే అనుకుంటారు. కానీ, డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగంలో ఈ రెండు పదాల వెనుక ఒక పెద్ద సాంకేతిక రహస్యం దాగి ఉంది. ఆ వ్యత్యాసం ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఫోటో అంటే ఏంటి?
సాంకేతిక పరిభాషలో ‘ఫోటోగ్రాఫ్’ లేదా ‘ఫోటో’ అనేది మన కంటికి కనిపించే నిజ ప్రపంచాన్ని ప్రతిబింబించే ఒక రూపం. మీ స్మార్ట్‌ఫోన్ లేదా ప్రొఫెషనల్ కెమెరా ఆన్ చేసి, మీ ముందు ఉన్న ఒక వ్యక్తిని, ప్రకృతి దృశ్యాన్ని లేదా ఒక వస్తువును క్లిక్ చేసినప్పుడు అది ‘ఫోటో’ అవుతుంది.
పెళ్లి వేడుకల్లో తీసే చిత్రాలు, పర్యాటక ప్రాంతాల్లో మనం దిగే అందమైన జ్ఞాపకాలు, ఒకరి ముఖంలో పలికే హావభావాలు.. ఇవన్నీ ఫోటోల కిందకు వస్తాయి. క్లుప్తంగా చెప్పాలంటే, ఒక ఫోటో సృష్టించాలి అంటే అక్కడ ఖచ్చితంగా ఒక కెమెరా (లెన్స్) ఉండాలి. కెమెరా లేకుండా ఫోటో అనేదే లేదు.
ఇమేజ్ అంటే ఏంటి? కంప్యూటర్ సృష్టించే మాయాజాలం..!
మరోవైపు, ‘ఇమేజ్’ (చిత్రం) అనేది చాలా విస్తృతమైన అర్థం కలిగిన ఒక సాంకేతిక పదం. దీని పరిధి చాలా పెద్దది. కెమెరాతో తీసిన ప్రతి ఫోటో ఒక ఇమేజ్ అవుతుంది, కానీ ప్రతి ఇమేజ్ ఫోటో కాలేదు. ఎందుకంటే ఇమేజ్ రూపకల్పనకు కెమెరాతో పనే లేదు.
మనం కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, గ్రాఫిక్ డిజైన్ టూల్స్ లేదా మొబైల్ యాప్స్ ఉపయోగించి తయారుచేసే డిజిటల్ డిజైన్లు, చేతితో గీసే చిత్రాలు, కార్టూన్లు, గ్రాఫిక్స్, స్కాన్ చేసిన పాత కాగితాలు.. ఇలా కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపించే దృశ్య ఫైల్స్ అన్నీ ‘ఇమేజ్’ వర్గంలోకి వస్తాయి. ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచంలో మిడ్జర్నీ లేదా చాట్‌జిపిటి వంటి టూల్స్ ద్వారా సృష్టించే డిజిటల్ ఆర్ట్ కూడా ఇమేజ్ మాత్రమే, ఫోటో కాదు.
వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో ‘ఇమేజ్’ హవా..!
కంప్యూటర్లు, ఇంటర్నెట్, డిజిటల్ మీడియా రంగంలో ‘ఫోటో’ అనే పదం కంటే ‘ఇమేజ్’ అనే పదాన్నే నిపుణులు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒక వెబ్‌సైట్‌ను డిజైన్ చేసేటప్పుడు లేదా సోషల్ మీడియా కోసం కంటెంట్ సిద్ధం చేసేటప్పుడు గ్రాఫిక్స్, ఐకాన్లు, వాల్‌పేపర్లు వంటివన్నీ అవసరమవుతాయి కాబట్టి, గ్లోబల్ డిజిటల్ ప్రపంచంలో ఈ పదానికి విపరీతమైన ప్రాచుర్యం లభించింది.
