AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిరుద్యోగ యువతకు ISROలో ఉద్యోగాలు.. అంతరిక్ష రంగంలో కెరీర్‌కు గోల్డెన్‌ ఛాన్స్! దరఖాస్తు ఇలా..

ISRO-ISTRAC Apprentice Recruitment 2026: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలోని ISTRAC సంస్థ 2026-27 సంవత్సరానికి 96 గ్రాడ్యుయేట్‌, డిప్లొమా, ఐటీఐ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్‌, డిప్లొమా, ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు జులై 31, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.9,600 నుంచి రూ.12,300 వరకు స్టైపెండ్‌ అందించనున్నారు.,

నిరుద్యోగ యువతకు ISROలో ఉద్యోగాలు.. అంతరిక్ష రంగంలో కెరీర్‌కు గోల్డెన్‌ ఛాన్స్! దరఖాస్తు ఇలా..
ISRO-ISTRAC Apprentice Recruitment
Srilakshmi C
|

Updated on: Jun 24, 2026 | 8:24 AM

Share

ఇస్రో ఆధ్వర్యంలోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ (ISTRAC).. 2026-27 సంవత్సరానికిగానూ గ్రాడ్యుయేట్‌, డిప్లొమా, ట్రేడ్‌ అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషణ్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 96 అప్రెంటిస్‌ ట్రెయినీ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో జులై 31, 2026 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

విభాగాల వారీగా అప్రెంటిస్‌ ట్రెయినీ ఖాళీల వివరాలు..

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రెయినీ పోస్టులు

  • కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ & అనుబంధ విభాగాల్లో పోస్టుల సంఖ్య: 23
  • ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ పోస్టుల సంఖ్య: 28
  • ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ పోస్టుల సంఖ్య: 4
  • మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పోస్టుల సంఖ్య: 4
  • సివిల్‌ ఇంజినీరింగ్‌ పోస్టుల సంఖ్య: 1
  • బీఎస్సీ (CS/IT) పోస్టుల సంఖ్య: 1
  • లైబ్రరీ సైన్స్‌ పోస్టుల సంఖ్య: 2

డిప్లొమా అప్రెంటిస్‌ ట్రెయినీ పోస్టులు

  • మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పోస్టుల సంఖ్య: 3
  • ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ పోస్టుల సంఖ్య: 3
  • ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ పోస్టుల సంఖ్య: 6
  • సివిల్‌ ఇంజినీరింగ్‌ పోస్టుల సంఖ్య: 1
  • కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ పోస్టుల సంఖ్య: 7
  • కమర్షియల్‌ ప్రాక్టీస్‌ పోస్టుల సంఖ్య: 5

ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు

  • ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌ పోస్టుల సంఖ్య: 4
  • మెషినిస్ట్‌ పోస్టుల సంఖ్య: 1
  • ఎలక్ట్రికల్‌ పోస్టుల సంఖ్య: 1
  • ఐటీ-టీఎస్‌ఎం పోస్టుల సంఖ్య: 1
  • ఫిట్టర్‌ పోస్టుల సంఖ్య: 1

ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌లో అప్రెంటిస్‌ పోస్టులకు ఇక్కడ నేరుగా దరఖాస్తు చేసుకోండి.

ఇందులో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌ పూర్తి చేసి ఉండాలి. డిప్లొమా పోస్టులకు సంబంధిత ఇంజినీరింగ్‌ డిప్లొమా, ఐటీఐ పోస్టులకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత పొంది ఉండాలి. 2024, 2025, 2026 సంవత్సరాల్లో కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. అలాగే NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఈ కింది మెయిల్‌ ఐడీలకు జులై 31, 2026వ తేదీలోపు దరఖాస్తులు పంపించాల్సి ఉంటుంది. ఈమెయిల్‌ ద్వారా పంపించే దరఖాస్తుల్లో సబ్జెక్ట్‌లో సంబంధిత పోస్టు కోడ్‌ తప్పనిసరిగా పేర్కొనాలి. ఈమెయిల్‌లో పేరు, మొబైల్‌ నంబర్‌, విద్యార్హత వివరాలు, ఉత్తీర్ణత సంవత్సరం, ఎన్‌ఏటీఎస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ ఇవ్వాలి. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, ఇంటర్వ్యూ ఉంటుంది. మెరిట్‌ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.12,300, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.10,900, ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌కు రూ.9,600 చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

ఈమెయిల్‌ ఐడీలు ఇవే..

  • బెంగళూరు: apprmt_blr@istrac.gov.in
  • లక్నో: apprmt_lko@istrac.gov.in
  • శ్రీ విజయ పురం: apprmt_ixz@istrac.gov.in

ఇంటర్వ్యూ తేదీలు

  • ఐఎస్‌టీఆర్‌సీ లఖ్‌నవూ ఇంటర్వ్యూ తేదీలు: ఆగస్టు 27, 28 తేదీల్లో
  • ఐఎస్‌టీఆర్‌సీ శ్రీ విజయ పురం: సెప్టెంబర్‌ 3, 4 తేదీల్లో
  • ఐఎస్‌టీఆర్‌సీ బెంగళూరు: సెప్టెంబర్‌ 9 నుంచి 11 వరకు

ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌లో అప్రెంటిస్‌ పోస్టులకు ఇక్కడ నేరుగా దరఖాస్తు చేసుకోండి.

Follow Us
పెద్దలు చెప్పని రహస్యం.. ఆషాఢం వెనకున్న సీక్రెట్ తెలుసా?
పెద్దలు చెప్పని రహస్యం.. ఆషాఢం వెనకున్న సీక్రెట్ తెలుసా?
ఆ నటుడు బంగారం తాకట్టుపెట్టి త్రివిక్రమ్‌కు డబ్బులు ఇచ్చాడు..
ఆ నటుడు బంగారం తాకట్టుపెట్టి త్రివిక్రమ్‌కు డబ్బులు ఇచ్చాడు..
టీమిండియా ఘోర పరాభవానికి అసలు కారణం ఆ 'మాయ'..: మాజీ ప్లేయర్
టీమిండియా ఘోర పరాభవానికి అసలు కారణం ఆ 'మాయ'..: మాజీ ప్లేయర్
భారీగా కుప్పకూలిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
భారీగా కుప్పకూలిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
30 నిమిషాల్లో రెడీ అయ్యే ఈజీ బ్యాచిలర్స్ చికెన్ ఫ్రై.. యమ్మీ ఫుడ్
30 నిమిషాల్లో రెడీ అయ్యే ఈజీ బ్యాచిలర్స్ చికెన్ ఫ్రై.. యమ్మీ ఫుడ్
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!