AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ది యోజనలో డబ్బులు మధ్యలోనే తీసుకోవచ్చా..? ఈ నిబంధనలు తెలసుకోండి..

పిల్లల భవిష్యత్ అవసరాలకు డబ్బులు పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రుల కోసం కేంద్రం సుకన్య సమృద్ది యోజన అనే పొదుపు పథకాన్ని ఎప్పటినుంచో అమలు చేస్తోంది. లక్షలాది మంది ఇందులో పెట్టుబడులు పెడుతున్నారు. కానీ ఇందులో ఇన్వెస్ట్ చేసేవారికి అనేక అనుమానాలు ఉంటాయి.

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ది యోజనలో డబ్బులు మధ్యలోనే తీసుకోవచ్చా..? ఈ నిబంధనలు తెలసుకోండి..
Sukanya Yojana
Venkatrao Lella
|

Updated on: Jun 02, 2026 | 4:19 PM

Share

సుకన్య సమృద్ది యోజన స్కీమ్ గురించి తెలియనివారంటూ దాదాపు ఎవరూ ఉండరు. చిన్నారుల భవిష్యత్ కోసం డబ్బులు పొదుపు చేసుకోవాలనుకునే తల్లిదండ్రుల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన పథకమిది. పాప పుట్టగానే వారి పేరుపై తల్లిదండ్రులు ఈ అకౌంట్ తెరిస్తే వాళ్లు పెద్దయ్యేసరికి భారీగా నిధులు జమ అవుతాయి. వారి ఉన్నత చదువులు, పెళ్లి, ఇతర అవసరాలకు అవి ఉపయోగపడతాయి. అయితే సుకన్య సమృద్ది యోజన మెచ్యూరిటీ గురించి చాలామందిలో అనేక సందేహాలు ఉన్నాయి. ఈ అకౌంట్ కాలపరిమితి ఎంత..? మధ్యలో డబ్బులు తీసుకోవచ్చా..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అకౌంట్ ఎప్పుడు తెరవొచ్చు..?

పాప పుట్టగానే పదేళ్లలోపు ఈ స్కీమ్‌లో చేరాలి. 21 ఏళ్ల కాలపరిమితి దీనికి ఉంటుంది. అంటే అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి 21 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ పూర్తవుతుంది. అప్పుడు ఒకేసారి వడ్డీతో సహా మీరు పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుంది. పాప జన్మించగానే ఏడాదిలోపే ఈ స్కీమ్‌లో చేరితే పాపకు 21 ఏళ్లు వచ్చేంత వరకు ఉంటుంది. అదే ఐదేళ్లు వచ్చాక చేరితే 26 ఏళ్లకు పూర్తవుతుంది. అయితే పాప పుట్టగానే ఏడాదిలోపే అకౌంట్ తెరిస్తే 15 ఏళ్ల పాటు కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆరేళ్లు కట్టనవసరం లేదు. అయినా వడ్డీ అనేది లభిస్తుంది. ఇక ఐదేళ్ల వయస్సులో చేరినా వరుసగా 15 ఏళ్లు కట్టాలి.

డబ్బులు మధ్యలో తీసుకోవచ్చా..?

ఇక సుకన్య సమృద్ది యోజన పథకంలో చేరితే ఏదైనా అవసరమైనప్పుడు డబ్బులు మధ్యతో తీసుకోవచ్చా? అనే అనుమానం చాలామందికి ఉంటుంది. అయితే అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత తీసుకోవచ్చు. లేదా పదో తరగతి పూర్తయిన తర్వాత అయినా డబ్బులు తీసుకోవచ్చు. కానీ 50 శాతం వరకు మాత్రమే అందిస్తారు. ఇక 18 ఏళ్లు నిండాక అమ్మాయి పెళ్లి చేసుకుంటే అప్పటివరకు జమ అయిన వాటిని తీసుకుని అకౌంట్ మూసివేయవచ్చు.

వడ్డీ ఎంతంటే..?

ఈ పథకానికి వడ్డీ రేటు అనేది మారుతూ ఉంటుంది. ప్రస్తుతం 8.20 శాతంగా ఉంది. కేంద్రం ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఉంటుంది. పాపకు పదేళ్ల వయస్సు వచ్చే కంటే ముందు ఈ స్కీమ్‌లో చేరాలి. పదేళ్లు దాటి అనర్హులు అవుతారు. ఒక ఆర్ధిక సంవత్సరంలో కనీసం రూ.250 జమ చేయాలి. ఇక గరిష్ట లిమిట్ రూ.1.50 లక్షల వరకు ఉంది. పెట్టుబడి ఒకేసారి జమ చేయవచ్చు లేదా 132 ఇన్‌స్టాల్‌ మెంట్లలో కూడా జమ చేయవచ్చు.  ఏడాదిలో రూ.1.50 లక్షల కంటే ఎక్కువ జమ చేయడానికి వీల్లేదు.

Follow Us