Motivational: జీవితంలో సక్సెస్ కావాలంటే..? విద్యార్థులకు సుధామూర్తి కీలక సూచనలు!
సుధామూర్తి.. రచన, సామాజిక సేవ, విద్యా రంగాల్లో విశిష్ట సేవలందించి కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తిత్వం. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ ఛైర్‌పర్సన్‌గా అందరికీ సుపరిచయురాలైన ఆమె.. తన రచనలు, ప్రసంగాల ద్వారా విద్యార్థులు, యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన జీవన విధానంపై అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. జీవితంలో విజయం సాధించాలంటే నిరంతర అభ్యాసం, పట్టుదల, సానుకూల దృక్పథం అవసరమని ఆమె తరచూ సూచిస్తుంటారు.

Sudha Murthy
సుధామూర్తి.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ ఛైర్‌పర్సన్‌గా ఆమె అందరికీ సుపరిచయమే. ఇన్ఫోసిస్ సంస్థ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి అయిన తన రచనలు, ప్రసంగాల ద్వారా విద్యార్థులు, యువకుల్లో స్ఫూర్తిని నింపేందుకు ప్రయత్నిస్తుంటారు. నేటి యువతరం బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి, జీవితంలో విజయం సాధించడానికి పలు కీలక సూచనలు చేస్తుంటారు.
జీవితంలో విజయం సాధించాలంటే.. సుధామూర్తి చేసిన ముఖ్యమైన సూచనలు:
- సవాళ్లుకు నిరుత్సాహపడకూడదు: జీవితంలో ఎన్ని ఆటంకాలు, ఒడుదొడుకులు ఎదురైనా విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహపడకూడదు. సవాళ్లను అధిగమించినప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకోవడం సాధ్యమవుతుంది.
- వైఫల్యాలను విజయాలుగా మార్చుకోవాలి: జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలను చూసి కుంగిపోకుండా, ఆ వైఫల్యాల నుంచి తగిన పాఠాలు నేర్చుకోవాలి. తప్పులను సరిదిద్దుకుంటూ విజయం వైపు అడుగులు వేయాలి.
- క్రమశిక్షణ, పుస్తక పఠనం: విద్యార్థి దశలో క్రమశిక్షణ, సహనం, పట్టుదల చాలా ముఖ్యం. వీటితో పాటు నిరంతరం పుస్తకాలు చదివే అలవాటును (పుస్తక పఠనం) పెంపొందించుకోవాలి.
- విద్య ఒక నిరంతర ప్రయాణం: చదువు అనేది కేవలం మార్కుల కోసం కాదు, అది జీవితంలో ఒక మార్గం. దానిని ఒక అభిరుచిగా, లక్ష్యంతో స్వీకరించి విజయాన్ని సాధించాలి. మన దగ్గరున్న వస్తువులను ఎవరైనా దొంగిలించగలరేమో కానీ, మనం సంపాదించిన ‘విజ్ఞానాన్ని’ ఎవరూ దొంగిలించలేరని గుర్తుంచుకోవాలి.
- ఉపాధ్యాయుల గౌరవించాలి: విద్యార్థులు తమ ఉపాధ్యాయులను గౌరవించాలి. వారు చెప్పే సూచనలను క్రమశిక్షణతో, శ్రద్ధతో పాటించాలి. గురువుల మార్గదర్శకత్వంలో నడవడం ద్వారా ఉన్నత విజయాలు అందుకోవచ్చు.
- మీతో మీరే పోటీ పడండి: ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవద్దు. విద్యార్థులు ఎప్పుడూ తమతో తామే పోల్చుకుంటూ.. నిన్నటి కంటే ఈరోజు ఎంత మెరుగయ్యామనేది గమనిస్తూ ప్రతిరోజూ తమను తాము మెరుగుపరుచుకోవాలి.
- బాలికల ఆరోగ్యం – ఆహార అలవాట్లు: ముఖ్యంగా విద్యార్థినులు, బాలికలు సరైన ఆహార అలవాట్లను అలవర్చుకోవాలి. చదువుతో పాటు ఆరోగ్యాన్ని కూడా సమానంగా పెంపొందించుకోవాలని ఆమె హితవు పలికారు.
- అనవసర ఖర్చులు చేయకండి: విద్యార్థులు జీవితంలో సాదాసీదాగా ఉండాలి. ఎవరి ముప్పు కోసమో, ఆనందం కోసమో దుస్తులపై అధిక ఖర్చు చేయడం సరికాదు. అనవసర వస్తువులు, భౌతిక సంతోషం కోసం డబ్బులు ఖర్చు చేయొద్దు.
- ప్రతి క్షణం విలువైనదే..: ప్రతిక్షణం విలువైనదిగా భావించి విద్యపై విద్యార్థులు పూర్తి దృష్టి పెట్టాలి. బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలి. వినూత్న ఆవిష్కరణలపై దృష్టిపెట్టాలి.
Follow Us
