బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ గారాల పట్టి, యంగ్ బ్యూటీ రాషా తడాని టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే
మహేష్ బాబు అన్న రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న ‘శ్రీనివాస మంగాపురం’లో రాషా హీరోయిన్‌గా నటిస్తోంది.
అజయ్ భూపతి దర్శకత్వంలో, అశ్విని దత్ సమర్పణలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 9న రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
మే 30న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ చిత్ర యూనిట్ నిర్వహించిన ఒక వేడుకలో రాషా తడాని తన స్టన్నింగ్ లుక్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది.
సాంప్రదాయ లంగా వోణీ (హాఫ్ శారీ) ధరించి ఎంతో హుందాగా, డాస్లింగ్ లుక్‌లో ఆమె మెరిసిపోయింది. సాధారణంగా మోడ్రన్ వెస్ట్రన్ డ్రెస్సుల్లో కనిపించే ఈ బాలీవుడ్ భామ..