Tollywood: సినిమాల కోసం సైకాలజీ వదిలేసిన హీరోయిన్.. కట్ చేస్తే.. ఊహించని షాక్..
సినిమా అంటే పిచ్చి. నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలనే ఆరాటం. వెండితెరపై కథానాయికగా ఓ వెలుగు వెలగాలని సైకలాజీ డిగ్రీకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. సినీరంగంలోకి అడుగుపెట్టి తన నటనతో అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. కానీ ఆ తర్వాత మాత్రం ఊహించని షాకిచ్చింది. ఆమె ఎవరంటే..
సినీరంగుల ప్రపంచంలో నటిగా రాణించాలంటే ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. సినిమానే తమ కెరీర్ గా మార్చుకుని చదువుకు గుడ్ బై చెప్పేస్తుంటారు. ఈ హీరోయిన్ సైతం అదే జాబితాలోకి వస్తుంది. నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి సైకాలజీ డిగ్రీకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. సినిమాల్లోకి రాకముందే కమర్షియల్ యాడ్స్ చేసింది. ఆ తర్వాత తెలుగు, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు ప్రేక్షకులకు సైతం ఆమె సుపరిచితమే. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారు. తనే అమృతా రావు. ఈ పేరు చెబితే గుర్తుపట్టలేరు. కానీ మహేష్ బాబు నటించిన అతిథి సినిమా హీరోయిన్ అంటే ఠక్కున గుర్తుపట్టేస్తారు.
తన సోదరి ప్రీతికాతో కలిసి వోహ్ ప్యార్ మేరా అనే మ్యూజిక్ వీడియోలో కనిపించింది. అప్పుడే తనకు సినీరంగంపై ఆసక్తి ఏర్పడింది. దీంతో 2002లో ఆర్య బబ్బార్ తో కలిసి అబ్ కే బరస్ అనే హిందీ సినిమాలో నటించింది. తొలి చిత్రంతోనే నటిగా ఆకట్టుకుంది. ఆ తర్వాత హిందీలో అజయ్ దేవగన్ సరసన ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ చిత్రంలో నటించింది. ఈ సినిమాతో అమృతా క్రేజ్ మారింది. 2003లో ఇష్క్ విష్క్, 2005లో వాహ్ లైఫ్ హో తో ఐసీ, 2006లో వివాహ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన అతిథి చిత్రంలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో తెలుగులో ఈ అమ్మడుకు అంతగా అవకాశాలు రాలేదు.
నటిగా వెండితెరపై ఓ వెలుగు వెలగాలని చదువును మధ్యలో వదిలేసిన ఈ బ్యుటీకి సరైన క్రేజ్ మాత్రం రాలేదు. 2016లో ఆర్జే అన్మోల్ ను వివాహం చేసుకుంది. అప్పట్లో వీరి పెళ్లి కోసం రూ.1.5 లక్షలు మాత్రమే ఖర్చు చేసింది. తన పెళ్లికి రూ.3 వేల చీర మాత్రమే కొనుక్కోంది. 2019లో చివరిసారిగా ‘థాక్రే’ అనే సినిమాలో నటించింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది అమృతా.
View this post on Instagram
ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా..
Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‌ను మించిన అందం.. ఎవరంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.