- Telugu News Photo Gallery Cinema photos Global Star Ram Charan Game Changer movie Makers plan Pre Release event in USA on 21 December 2024, Details Here
Ram Charan-Game Changer: దేశాలు దాటిన రామ్ చరణ్ క్రేజ్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ దేశంలోనే.?
30 రోజులు.. ఇంకా 30 రోజులు మాత్రమే ఉంది గేమ్ ఛేంజర్ విడుదలవ్వడానికి..! ఈ సినిమా రామ్ చరణ్ ముందు చాలా సవాళ్లనే తీసుకొస్తుంది. ముఖ్యంగా రెండు ఛాలెంజెస్ అయితే కచ్చితంగా పూర్తి చేయాల్సిన బాధ్యత మెగా వారసుడిపై ఉంది. అందుకే రాబోయే 30 రోజుల్ని పక్కా ప్లానింగ్‌తో సిద్ధం చేస్తున్నారు మేకర్స్. మరింతకీ ఏంటవి.? చరణ్ ముందున్న ఆ సవాళ్లేంటి..? సరిగ్గా మరో నెల రోజుల్లోనే గేమ్ ఛేంజర్ విడుదల కానుంది.
Updated on: Dec 15, 2024 | 11:44 AM

టీజర్‌తో పాటు నాలుగు సాంగ్స్ రిలీజ్ చేసిన యూనిట్ ట్రైలర్ రిలీజ్ విషయంలో ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు. ఈ నెల 27, 28 తారీఖుల్లో ట్రైలర్ లాంచ్ ఉంటుందన్న ప్రచారం జరిగింది. కానీ యూనిట్ సైడ్ నుంచి అలాంటి ప్రకటన అయితే రాలేదు.

ప్రజెంట్ తెలుగు ఆడియన్స్ అందరూ గేమ్ చేంజర్ కోసమే ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో చరణ్ సోలోగా బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని గట్టిగా కోరుకుంటున్నారు.

రిలీజ్‌కు మరో 15 రోజులు మాత్రమే ఉన్నా.. ఇంత వరకు ఇండియాలో ఒక్క ఈవెంట్ కూడా నిర్వహించలేదు గేమ్ చేంజర్ మేకర్స్. అమెరికాలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినా.. అది ఇండియన్ ఆడియన్స్‌కు చూపించే ప్రయత్నం చేయట్లేదు.

మరి రామ్ చరణ్ ముందు ఏయే టార్గెట్స్ ఉన్నాయి..? వాటిని గేమ్ ఛేంజర్ అందుకుంటాడా..? గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ కాస్త ఆలస్యంగా మొదలయ్యాయేమో కానీ ఒక్కసారి మొదలయ్యాక మాత్రం ఎక్కడా తగ్గట్లేదు మేకర్స్.

ఇండస్ట్రీ రేంజ్ మారిపోయింది.. లెక్కలు మారుతున్నాయి.. పెద్ద సినిమాలు వస్తే అంతా ముందుగా మాట్లాడుతున్నది కలెక్షన్ల గురించే.

మార్కెట్ పరంగా శంకర్ సినిమాతో పోటి పడే అవకాశం లేదు. అందుకే కోలీవుడ్ మార్కెట్‌లోనూ గేమ్ చేంజర్ సోలోగా బరిలో దిగుతున్నట్టే అంటున్నారు సినీ జనాలు. మరి ఈ అడ్వాంటేజ్ కలెక్షన్ల విషయంలో ఎంత వరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

ఓవర్సీస్ ఆడియన్స్‌ను ఆకట్టుకోడానికి అక్కడే ఈవెంట్ ప్లాన్ చేసారు గేమ్ ఛేంజర్ టీం. ఇది అక్కడ కలెక్షన్లు పెంచడంలోనూ యూజ్ కానుంది. రీసెంట్‌గా వచ్చిన పెద్ద సినిమాలు ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ నుంచే రికార్డులు తిరగరాసాయి.

ఇటు బన్నీ, అటు తారక్ ఇద్దరూ హిట్లు కొట్టడంతో రామ్ చరణ్‌పై ప్రెజర్ పెరుగుతుంది. మరి ఈయనేం చేస్తాడో అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.





























