Tollywood: 12 ఏళ్లకే ఇండస్ట్రీలోకి ఎంట్రీ.. బ్లాక్ బస్టర్ మూవీతో క్రేజ్.. చివరకు 19 ఏళ్లకే మృతిచెందిన హీరోయిన్..
చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆమె నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.2000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉండాల్సిన ఆ అమ్మాయి.. 19 ఏళ్లకే ప్రాణాలు విడిచింది. ఆమె మరణవార్త యావత్ ఇండస్ట్రీని దిగ్ర్బాంతికి గురిచేసింది.

సినీరంగంలో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో చాలా మంది ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. అందులో కొందరు ఒక్క సినిమాతోనే ఊహించని స్టార్ డమ్ సంపాదించుకుంటారు. మరికొందరు మాత్రం ఎన్నో సవాళ్లను దాటుకుని సక్సె్స్ చూస్తారు. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా అద్భుతమైన నటనతో మెప్పించిన కొందరు నటీనటులు.. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా రాణిస్తున్నారు. కానీ కొందరు మాత్రం దురదృష్టవశాత్తు తక్కువ సమయంలోనే ఇండస్ట్రీ నుంచి కనుమరుగు అవుతారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే నటి జీవితం ఓ విషాద గాధే. బాలీవుడ్ ఇండస్ట్రీలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. కానీ స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్న ఈ అమ్మడు.. 19 ఏళ్ల వయసులోనే ప్రాణాలు విడిచింది. ఆమె మరెవరో కాదు.. సుహానీ భట్నాగర్.
12 ఏళ్లకే చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆమె నటించిన దంగల్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన ఈ సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది. కానీ సుహానీ 19 ఏళ్లకే ప్రాణాలు విడిచింది. బీటౌన్ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వం వహించిన దంగల్ సినిమా 2016లో విడుదలై ఊహించని సక్సె్స్ అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ ఎన్నో రికార్డ్స్ తిరగరాసింది. వరల్డ్ వైడ్.. రూ.2070 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. భారత దేశంలోనే రూ.538 కోట్లు రాబట్టింది. ఈ చిత్రంలో గీతా ఫోగట్, బబితా ఫోగట్ అనే అక్కాచెల్లెళ్ల చిన్నప్పటి పాత్రల కోసం ఏకంగా 11 వేల మంది అమ్మాయిలు ఆడిషన్స్ ఇచ్చారట.
అందులో ఇద్దరు సెలక్ట్ అయ్యారు. ఒకరు జైరా వసీం (చిన్నప్పటి గీతా ఫోగట్). మరొకరు సుహానీ భట్నాగర్ (చిన్నప్పటి బబితా ఫోగట్). బబితా ఫోగట్ పాత్రలో నటించిన సుహానీ భట్నాగర్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. 12 ఏళ్ల వయసులోనే ఆమె నటనకు అంతా ఫిదా అయ్యారు. దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఆమెకు గుర్తింపు వచ్చింది.
దంగల్ తర్వాత సుహానీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ చదువుల కోసం సినిమాలకు దూరంగా ఉండిపోయింది. స్కూల్ లైఫ్ పూర్తైన తర్వాత సినిమాల్లోకి తిరిగి ఎంట్రీ ఇవ్వాలనుకుంది. కానీ ఫోటోషూట్స్, యాడ్స్ మాత్రం చేసింది. 2023 ఏడాది చివరల్లో సుహానీకి అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. ఆమె చేతులపై ఎర్రటి మచ్చలు రావడం.. ఒంట్లో నీరసం పెరగడంతో ఆమె ఆరోగ్యం నెమ్మదిగా క్షీణించింది. కొన్ని రోజులకే ఆమె డెర్మటోమయోసైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది. కొన్నాళ్లపాటు అనారోగ్యంతో పోరాడిన సుహానీ 2024 ఫిబ్రవరి 17న తుదిశ్వాస విడిచింది. అప్పటికీ సుహానీ వయసు కేవలం 19 ఏళ్లు మాత్రమే.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..
