Dulquer Salman: దుల్కర్ సల్మాన్, మమ్ముట్టి ఇద్దరితో కలిసి నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడు ఆ స్టార్ హీరోకు భార్య.. ఎవరంటే..
ప్రస్తుతం సీనియర్ హీరోల వారసులు సినీరంగంలో దూసుకుపోతున్నారు. తండ్రి అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలోకి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్స్ గురించి చెప్పక్కర్లేదు. కానీ సినిమాల్లో తండ్రి, కొడుకు ఇద్దరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? ప్రస్తుతం ఆమె స్టార్ హీరోయిన్.

మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముమ్ముట్టి నటవారసుడిగా తెరంగేట్రం చేసిన ఈ హీరో.. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ముమ్ముట్టి ఇప్పటివరకు దాదాపు 400కు పైగా సినిమాల్లో నటించారు. మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇటీవలే లక్కీ భాస్కర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. ప్రస్తుతం తెలుగులో కాంత అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..
ఇదెలా ఉంటే.. మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ ఇద్దరి సరసన నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా.. ? వెండితెరపై తండ్రీ కొడుకులిద్దరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్ మరెవరో కాదండి. అదితి రావు హైదరీ. మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ సహా అనేక భాషలలో నటించిన హీరోయిన్. పాన్ ఇండియా సినిమా ప్రపంచంలో అనేక చిత్రాలతో తనదైన ముద్రవేసింది. కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ ను వివాహం చేసుకుంది. ఆమె చివరగా గాంధీ టాక్స్ చిత్రంలో కనిపించింది.
ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?
2006లో మమ్ముట్టి హీరోగా నటించిన ప్రజాపతి చిత్రంలో నటించింది అదితి. ఈ సినిమాతోనే ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అలాగే దుల్కర్ సల్మాన్ సరసన హే సినామిక అనే చిత్రంలో అదితి నటించింది. 2022లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి బృందా మాస్టర్ దర్శకత్వం వహించారు. ఇందులో దుల్కర్ సల్మాన్, అదితి రావు హైదరీ జోడి ఆకట్టుకుంది.
ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..



