ఒకప్పుడు టీచర్.. స్టూడెంట్‍తో ప్రేమ, పెళ్లి.. కట్ చేస్తే.. ఇండస్ట్రీలోనే తోపు హీరో.. అమ్మాయిల కలల రాకుమారుడు..
సౌత్, నార్త్ ఇండస్ట్రీలలో టాప్ హీరో. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో సినీరంగంలో తనదైన ముద్రవేశారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో మెప్పించారు. ఒకప్పుడు ప్రేమకథ చిత్రాలకు అతడు కేరాఫ్ అడ్రస్. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ?

దక్షిణాదితోపాటు హిందీ సినీపరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో అతడు. ఒకప్పుడు అతడు అమ్మాయిల కలల రాకుమారుడు. తెలుగు, హిందీ, తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా లవ్ స్టోరీ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తాడు. ప్రజలు అతని నటనను చాలా ఇష్టపడతారు. ఇటీవల అతను నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఆప్ జైసా కోయి చిత్రంలో కనిపించాడు. అతడు మరెవరో కాదు.. ఒకప్పటి స్టార్ హీరో ఆర్ మాధవన్. ఇటీవల బాలీవుడ్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ తో కలిసి ఆప్ జైసా కోయి చిత్రంలో నటించారు. మరోసారి మాడ్డీ రెహ్నా హై తేరే దిల్ మే చిత్రంలో రొమాంటిక్ పాత్రలో కనిపించారు. చాలా కాలం తర్వాత మాధవన్ ఇలాంటి పాత్రలో కనిపించడంతో ఈ చిత్రాన్ని చాలా మంది ఇష్టపడుతున్నారు.
ఆర్. మాధవన్.. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే మాధవన్ పర్సనల్ లైఫ్ గురించి జనాలకు అంతగా తెలియదు. ఆర్ మాధవన్ సినిమాల్లోకి రాకముందు ఇంజనీరింగ్ చదివారు. ఆయనకు ఒకప్పుడు భారత సైన్యంలో చేరాలని కల ఉండేది. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ విద్యార్థి అయిన ఆర్ మాధవన్ వయసు దృష్ట్యా భారత సైన్యంలో చేరలేకపోయాడు. ఆ తర్వాత అతడు కొంత కాలం టీచర్ గా పనిచేశారు. కమ్యూనికేషన్, మోటివేషనల్ క్లాసెస్ చెప్పేవారు.
ఒకసారి అతను కొల్హాపూర్ కు క్లాస్ కోసం వచ్చాడు. అక్కడ ఎయిర్ హోస్టెస్‌గా శిక్షణ పొందుతున్న సరితను కలిశాడు. ఆమె అతని కోర్సులో విద్యార్థినిగా జాయిన్ అయ్యింది. ఎయిర్‌లైన్ ఇంటర్వ్యూలో సరిత షార్ట్‌లిస్ట్ అయినప్పుడు.. ఆర్ మాధవన్ తనకు అందించిన సాయం, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపింది. ఆ తర్వాత ఆమె మాధవన్‌ను విందుకు తీసుకెళ్లింది. ఆ తర్వాత వీరిద్దరు మంచి స్నేహితులుగా మారారు. ఆ స్నేహం తరువాత ప్రేమగా మారింది. వారిద్దరూ దాదాపు 8 సంవత్సరాలు ప్రేమలో ఉన్నారు. 1999 సంవత్సరంలో, ఆర్ మాధవన్, సరిత వివాహం చేసుకున్నారు.

Madhavan Movie S
వివాహం తర్వాత ఆర్ మాధవన్ కెరీర్ ఒక గొప్ప మలుపు తిరిగింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన అలైపాయుతే సినిమాతో అతడు ఇండస్ట్రీలో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత మాధవన్ కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తక్కువ సమయంలోనే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు మాధవన్. 2005 సంవత్సరంలో వారికి ఒక కుమారుడు వేదాంత్ జన్మించాడు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Kota Srinivasa Rao: సినిమాలంటే ఆసక్తి లేకుండానే 750 పైగా చిత్రాలు.. ఎలా చేశారో తెలుసా..?
Tollywood: ఒక్క సినిమా చేయకుండానే క్రేజీ ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకమే ఈ అమ్మడు..







