Prithviraj Sukumaran: వారణాసి సినిమాలో కుంభ పాత్రను మిస్ చేసుకున్న హీరో.. ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే..
ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఓ రేంజ్ హైప్ నెలకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ పై అడియన్స్ ఎంతో క్యూరియాసిటీగా ఉన్నారు. ఇటీవలే ఈమూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు జక్కన్న.

భారతీయ సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో తెలుగు స్థాయిని మరింత పెంచారు. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమను హాలీవుడ్ వేదికపై నిలబెట్టారు. ఇక ఇప్పుడు జక్కన్న రూపొందిస్తున్న వారణాసి ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి నెలకొంది. పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందిస్తున్న ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు నెలకున్నాయి. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Nani : నానితో జెర్సీ సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ? చివరకు ఆ హీరోతో బ్లాక్ బస్టర్..
ఇన్నాళ్లు SSMB 29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా టైటిల్ ఇటీవల రివీల్ చేసిన సంగతి తెలిసిందే. గ్లోబ్ ట్రోటర్ పేరుతో నిర్వహించిన వేడుకలో ఈ సినిమా టైటిల్ తోపాటు.. మహేష్ బాబు ఫస్ట్ లుక్ సైతం రివీల్ చేశారు. ఇందులో మహేష్ లుక్ సైతం అభిమానులను తెగ నచ్చేసింది. ఇదంతా పక్కన పెడితే.. ఈ సినిమాలో మరో పవర్ ఫుల్ పాత్ర కుంభ. ఈ రూల్ లో మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తిని కలిగించింది.
ఇవి కూడా చదవండి : Tollywood : కుర్రాళ్లకు మెంటలెక్కించిన హీరోయిన్.. కట్ చేస్తే.. అవకాశాల కోసం ఎదురుచూపులు..
అయితే ఈ సినిమాలో కుంభ పాత్ర కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ ముందుగా ఎంచుకున్న నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కాదట. కుంభ పాత్రకు మొదటగా అనుకున్న హీరో గోపిచంద్ అని సమాచారం. ఈ సినిమాలో విలన్ పాత్రకు ముందుగా గోపిచంద్ అనుకున్నారట. కానీ అనుహ్యంగా ఈ పాత్ర కోసం పృథ్వీరాజ్ పేరు తెరపైకి వచ్చింది. కారణం ఏంటో తెలియదు.. కానీ గోపిచంద్ చేతుల్లోనుంచి ఈ పాత్ర మిస్సైంది. ఇప్పుడు ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. కుంభ పాత్రలో గోపిచంద్ నటించే ఉంటే .. వేరేలెవల్ ఉండేదని అభిప్రాయపడుతున్నారు.

Gopichand
ఇవి కూడా చదవండి : Prithviraj Sukumaran : ఏంటీ.. ఈ స్టార్ హీరో భార్య టాప్ జర్నలిస్టా.. ? ఫోన్ కాల్తో ప్రేమకథ.. లవ్ స్టోరీలో సినిమాను మించిన ట్విస్టులు..








