100 కోట్ల సంపాదనతో.. అత్యంత లగ్జరీగా బతికిన ఐ -బొమ్మ రవి
ఐబొమ్మ రవి అరెస్ట్‌తో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేగింది. పైరసీ ద్వారా వందల కోట్లు సంపాదించిన రవి, తన విలాసవంతమైన జీవనం, తరచు విదేశీ పర్యటనలు, భయంకరమైన క్రిమినల్ నేపథ్యం పోలీసుల విచారణలో వెల్లడయ్యాయి. సినిమాలను పైరసీ చేసి 5 ఏళ్లలో 100 కోట్లకు పైగా అక్రమంగా ఆర్జించినట్లు తేలింది. రవి హీరోనా? విలనా? అనే చర్చ విస్తృతంగా నడుస్తోంది.
తెలుగు స్టేట్స్‌లో వన్ వీక్ నుంచి టాప్ ట్రెండింగ్‌లో ఐబొమ్మ టాపిక్ నడుస్తోందీ.అరెస్ట్ అవడం, పైరసీ వెబ్‌సైట్‌ను క్లోజ్ చేయడం.. ఇదంతా ఒక వెర్షన్ మాత్రమే. మరో వెర్షన్‌పై పెద్ద డిస్కషనే జరుగుతోందిప్పుడు. ఇటు సినీ ప్రేక్షకులతోపాటు అటు సాధారణ ప్రజలూ తనవైపు చూసేలా చేసిన ఈ ఐబొమ్మ రవి హీరోనా? విలనా? అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఐబొమ్మ రవిది మొదటి నుంచి క్రిమినల్ మెంటాలిటీ అని పోలీసులు తేల్చారు. పెళ్లికి ముందు నుంచే అనేక క్రిమినల్ చర్యలకు పాల్పడ్డట్టు గుర్తించారు. అమీర్‌పేట్‌లో ఉంటూ ప్రహ్లాద్ అనే తన స్నేహితుడి గుర్తింపు కార్డులను తీసుకొని అనేక నేరాలు చేసినట్లు గుర్తించారు. పెళ్లయిన తర్వాత కూడా రవి తన తీరు మార్చుకోలేదు. భార్యతో పాటు, తన కూతురిపై చేయి చేసుకునేవాడని పోలీసులు తెలిపారు. ఈ కారణాలతోనే రవికి తన భార్య విడాకులు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఐబొమ్మ రవి భార్యను సైతం విచారించారు పోలీసులు. తనను చిత్రహింసలకు గురిచేసినట్లు ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు చివరి రోజు విచారణలో రవి లగ్జరీ లైఫ్ స్టైల్‌పై ఆరాతీశారు పోలీసులు. ఐబొమ్మ రవి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడినట్లు తేలింది. ప్రతీ 20 రోజులకు విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసేవాడని గుర్తించారు. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయ్‌లాండ్, దుబాయ్ దేశాలకు వెళ్లొచ్చాడు రవి. అరెస్ట్‌కు ముందు ఫ్రాన్స్ నుంచే హైదరాబాద్‌కి వచ్చినట్లు గుర్తించారు. ఇప్పటిదాకా 40 సార్లు ఫారెన్ ట్రిప్స్‌కి వెళ్లాడని.. ప్రతీచోటా లగ్జరీ హోటల్స్‌లో స్టే చేసినట్లు తేల్చారు. ఐబొమ్మ సైట్‌లో బెట్టింగ్ బగ్ పెట్టడం ద్వారా రవికి లక్ష వ్యూస్‌కి 50 డాలర్లు వచ్చేవి. పోస్టర్ డిజైన్ చేసినందుకు స్నేహితుడు నిఖిల్‌కు రవి.. ప్రతి నెలా రూ.50 వేలు ఇచ్చేవాడని పోలీసుల విచారణలో తేలింది. మొత్తంగా క్రైమ్ థ్రిల్లర్ డ్రామాకి కావాల్సిన మసాలా దినుసులన్నీ రవి జీవితంలో ఉన్నాయి. ఐబొమ్మతో రవి ఒక్కడే ఈ మొత్తం పైరసీ చేసినట్టు గుర్తించారు. సినిమాలను పైరసీ చేసి 5 ఏళ్లల్లో 100 కోట్ల రూపాయలు వరకు సంపాదించినట్టు తేల్చారు. 20 కోట్ల రూపాయలకు సంబంధించి బ్యాంకు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నల్లమలలో జంగిల్ సఫారీ.. ఎదురుగా పెద్దపులి.. కట్ చేస్తే
ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. లక్ష కొలువుల భర్తీకి రంగం సిద్ధం
మానవ బంధాలన్నీ.. ఆర్ధిక సంబంధాలే.. సోదరి కుటుంబాన్ని ట్రాక్టర్‌తో తొక్కించి మరీ..
వీళ్లు అమ్మాయిలా.. ఆటం బాంబులా.. రీల్స్ కోసం మరి ఇంతకి తెగించారా.. బాబోయ్
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా
రూ.500 కూడా రూ.50 లాగే అనిపిస్తుంది.. ఖర్చులపై యువతి ఆవేదన
ముందుకు కదలకుండా ఆగిన అతిపెద్ద శివలింగం
ఇరవైల్లోనే రూ. 9 కోట్ల ఇంటిని సొంతం చేసుకుంది
లండన్ రైల్లో సమోసాలు అమ్మిన బీహారీ.. పరువు తీశావంటూ ట్రోలింగ్
అమ్మబాబోయ్ ఈ చేప ఒక్క కిలో ధర రూ.11 లక్షలు పైనే
ఇద్దరు స్నేహితులకు ఊహించని సహాయం చేసిన డెలివరీ బాయ్

