AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీళ్లు అమ్మాయిలా.. ఆటం బాంబులా.. రీల్స్ కోసం మరి ఇంతకి తెగించారా.. బాబోయ్

వీళ్లు అమ్మాయిలా.. ఆటం బాంబులా.. రీల్స్ కోసం మరి ఇంతకి తెగించారా.. బాబోయ్

Phani CH
|

Updated on: Nov 26, 2025 | 1:57 PM

Share

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా రీల్స్ పిచ్చి యువతను హింసాత్మక చర్యలకు పురిగొల్పుతోంది. మధ్యప్రదేశ్‌లో కొందరు యువతులు గ్యాంగ్‌గా ఏర్పడి, తోటి అమ్మాయిలను కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టారు. వ్యూస్, లైక్స్ కోసం ఈ దాడులను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జబల్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన రీల్స్ వల్ల కలిగే ప్రమాదాలను స్పష్టం చేస్తోంది.

ప్రస్తుత కాలంలో సోషల్‌ మీడియా విస్తృతి పెరగడంతో యువతకు రీల్స్‌ పిచ్చి బాగా పట్టింది. నెట్టింట వ్యూస్‌, లైక్స్‌, కామెంట్ల కోసం విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. హింసాత్మక ఘటనలకు సైతం పాల్పడుతున్నారు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. కొందరు అమ్మాయిలు గ్యాంగ్‌గా ఏర్పడి దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. మధ్యప్రదేశ్‌లో రీల్స్ కోసం కొందరు యువతులు ఓ గ్యాంగ్‌గా ఏర్పడి, తోటి యువతులను కిడ్నాప్ చేసి దారుణంగా కొడుతూ ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. జబల్‌పూర్‌లో జరిగిన ఈ అమానవీయ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల ఓ యువతిని ఈ గ్యాంగ్ అపహరించింది. అనంతరం ఆమె జుట్టు పట్టుకుని విచక్షణారహితంగా కొడుతూ, కాళ్లతో తన్నుతూ వీడియో చిత్రీకరించింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో ఆధారంగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దాడికి పాల్పడిన గ్యాంగ్‌లోని ఇద్దరు 17 ఏళ్ల బాలికలతో పాటు మరో యువతిని అరెస్ట్ చేశారు. కేవలం సోషల్ మీడియాలో పాపులారిటీ కోసమే వీరు ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ గ్యాంగ్ గతంలోనూ ఇదే తరహాలో మరికొందరు యువతులపై దాడులు చేసి ఉండవచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొంపముంచిన హీటర్‌.. డ్రైవర్‌ సజీవదహనం!

స్నేహమంటే ఇదేరా.. నీటిలో పడ్డ ఏనుగు పిల్ల.. దాని ఫ్రెండ్స్ ఏం చేసేయంటే !

కార్తికేయతో ప్రియాంక చోప్రా, సితార ఫొటో వైరల్‌

పుట్టినరోజు పేరుతో నడిరోడ్డుపై రెచ్చిపోయారు.. చివరికి !!

ఉద్యోగి 40 ఏళ్ళ సేవలను మెచ్చుకొని సన్మానం