AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుట్టినరోజు పేరుతో నడిరోడ్డుపై రెచ్చిపోయారు.. చివరికి !!

పుట్టినరోజు పేరుతో నడిరోడ్డుపై రెచ్చిపోయారు.. చివరికి !!

Phani CH
|

Updated on: Nov 26, 2025 | 1:32 PM

Share

నడిరోడ్డుపై పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ప్రస్తుతం ట్రెండ్‌గా మారింది. తణుకులో జరిగిన ఒక సంఘటనలో యువకులు వాహనాలను నిలిపి, కత్తులతో కేకులు కోసి, బాణసంచా కాల్చి ప్రజలకు తీవ్ర అసౌకర్యం, భయం కలిగించారు. ట్రాఫిక్ పోలీసులు ప్రేక్షకులుగా ఉండటం వివాదాస్పదంగా మారింది. దీనిపై పోలీసులు స్పందించి, యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చి, కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి వేడుకలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాను రాను పుట్టినరోజు వేడుకల స్టయిలే మారిపోతోంది. ఆత్మీయులు, కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరుపుకోవాల్సిన వేడుకలను నడిరోడ్డుపైకి తీసుకొస్తున్నారు. అర్ధరాత్రి వేళ రోడ్లపై అడ్డంగా వాహనాలు ఆపి స్నేహితులతో కలిసి కేకులు కట్‌చేయడం.. బాణాసంచా పేల్చడం ట్రెండ్‌గా మారింది. యువత చేసే ఈ హంగామాతో ఇతర వాహనదారులు, స్థానికులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. డోంట్‌ కేర్‌ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని తణుకు పట్టణంలో పుట్టినరోజు పేరుతో కొందరు యువకులు చేసిన హంగామా నెట్టింట వైరల్‌గా మారింది. రోడ్లు అత్యంత రద్దీగా ఉండే సమయంలో స్థానిక వెంకటేశ్వర థియేటర్ సెంటర్ వద్ద యువకులంతా చేరి, పుట్టిన రోజు వేడుకల పేరుతో కేకులు కట్‌చేస్తూ వీరంగం సృష్టించారు. అక్కడితో ఆగకుండా పెద్ద పెద్ద కత్తులతో విన్యాసాలు చేయటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పుట్టినరోజు వేడుకలు పేరుతో నడిరోడ్డుపై చేసిన ఈ హంగామా వాహనదారులు, పాదచారులు, వ్యాపారస్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. విచ్చలవిడిగా బాణసంచా కాల్చుతూ వీరంగం సృష్టించారు. పరిసర ప్రజల ఇబ్బందులను సైతం పట్టించుకోలేదు. ఆ సమయంలో అటుగా వెళుతున్న పాదచారులు, వాహనదారుల పైకి బాణసంచా దూసుకెళ్లడంతో భయంతో పరుగులు తీశారు. కొందరికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. నడిరోడ్డుపై ఇంత జరుగుతున్నా.. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోవటం వివాదాస్పదంగా మారింది. దాదాపు అరగంటసేపు యువకులు చేసిన హంగామాతో స్థానికులు హడలెత్తిపోయారు. ఈ హంగామా మొత్తం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పుట్టినరోజు వేడుకలు రోడ్ల మీద జరుపుకున్న ఆకుల కళ్యాణ్ తో పాటు పలువురిని తణుకు టౌన్ పోలీసులు స్టేషన్ కి పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతేకాకుండా వారిపై కేసు నమోదు చేశారు. పుట్టినరోజు వేడుకలు జాతీయ రహదారిపై, బహిరంగ ప్రదేశాల్లో నిర్వహిస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉద్యోగి 40 ఏళ్ళ సేవలను మెచ్చుకొని సన్మానం

రన్నింగ్‌ ట్రైన్‌లో వంటలు చేసిన మహిళ.. ఇండియన్‌ రైల్వే ఏం చేసిందంటే

ఎస్బీఐ పేరుతో వాట్సాప్‌లో కొత్త మోసం.. వేలాది ఎకౌంట్లు ఖాళీ

పంది చిన్నగానే ఉందిగా అని తీసి పడేయకండి.. చిరుతకే సుస్సు పోయించింది

అమావాస్య వేళ రంగు మారిన నీరు.. కారణం అదేనట