ఎస్బీఐ పేరుతో వాట్సాప్‌లో కొత్త మోసం.. వేలాది ఎకౌంట్లు ఖాళీ
తెలంగాణలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎస్‌బీఐ ఆధార్ అప్‌డేట్ పేరుతో నకిలీ APK లింక్‌లు పంపి, లక్షలాది మంది ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. మంత్రుల వాట్సాప్ గ్రూప్‌లు, హైకోర్టు వెబ్‌సైట్ కూడా హ్యాక్‌కు గురయ్యాయి. ఐబొమ్మ వంటి పైరసీ సైట్ల ద్వారా కూడా మోసాలు జరుగుతున్నాయి. అనుమానాస్పద లింక్‌లు, APK ఫైల్‌లు ఓపెన్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ఆదివారం ఒక్కరోజే లక్షలాది మంది వాట్సాప్‌లకు నకిలీ సందేశాలు పంపి భారీ మొత్తంలో డబ్బు కొల్లగొట్టారు. బ్యాంకులకు సెలవు దినాన్ని అదునుగా మార్చుకుని ఈ భారీ మోసానికి పాల్పడ్డారు. ‘ఈ రోజు అర్ధరాత్రిలోపు మీ ఆధార్ నెంబర్‌ను అప్‌డేట్ చేసుకోండి. లేదంటే మీ ఎస్బీఐ ఖాతా నిలిచిపోతుంది’ అంటూ హెచ్చరికతో కూడిన సందేశాన్ని సైబర్ కేటుగాళ్లు పంపారు. ఆధార్ అప్‌డేట్ కోసం ‘ఎస్బీఐ ఆధార్ అప్‌డేట్ యాప్’ పేరుతో ఒక APK ఫైల్ లింక్‌ను జతచేశారు. ఇది నిజమైన సందేశమని నమ్మిన చాలామంది, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఈ లింక్‌ను క్లిక్ చేసి మోసపోయారు. తెలంగాణలో కొందరు మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూప్‌లను సైతం హ్యాక్ చేశారు. మొదట APK ఫైల్స్ షేర్ చేసిన సైబర్ కేటుగాళ్లు… SBI, ఆధార్ అప్‌డేషన్ చేసుకోవాలనే మెసేజ్‌లతో ట్రాప్ చేశారు. తొలుత ఓ జర్నలిస్టు ఫోన్ హ్యాక్ చేసి.. అతని ఫోన్ నుంచి మంత్రుల అధికారిక గ్రూపులు, సీఎంవో గ్రూప్, డిప్యూటీ సీఎం గ్రూప్‌లలోకి చొరబడే ప్రయత్నం చేశారు హ్యాకర్లు. వెంటనే అప్రమత్తమైన సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్… సీఎంవో గ్రూపుతో పాటు మంత్రుల వాట్సాప్ గ్రూప్స్ కూడ సేఫ్ అని కన్‌ఫం చేయటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వాట్సాప్ గ్రూప్స్ హ్యాక్ అవుతుండటంతో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. APK ఫైల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయొద్దని అప్రమత్తం చేస్తున్నారు. ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేసిన వారి వివరాలన్నీ సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి.. బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ మధ్యే హైదరాబాద్ సీపీ సజ్జనార్ పేరును కూడా వాడేశారు కేటుగాళ్లు. ఆయన పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్స్ క్రియేట్ చేసి, వాటి ద్వారా చీటింగ్ సందేశాలు పంపారు. నకిలీ ఖాతాల నుంచి ఎక్కువ మెసేజ్‌లు సజ్జనార్ స్నేహితులకు పంపారు. ఆపదలో ఉన్నాను… వెంటనే డబ్బులు పంపండి అంటూ తన పేరుతో మెసేజ్‌లు చేసినట్లు స్వయంగా సజ్జనారే వెల్లడించారు. ఇలాంటి మోసాలపట్ల అప్రమత్తంగా ఉండాలంటూ పలు సూచనలు చేశారు. అంతేకాదు… మొన్నీమధ్యే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వెబ్ సైట్ కూడా హ్యాక్‌కి గురైంది. కోర్టు ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేస్తుండగా సడెన్‌గా గేమింగ్ సైట్ ఓపెన్ కావడంతో సైబర్ టీమ్ వెంటనే అలర్టయ్యింది. అదంతా ఓ ఎత్తైతే… ఈ మధ్య తెగ వినిపిస్తున్న ఐబొమ్మ కథ మరోఎత్తు. సినిమాలను పైరసీ చేసి సైట్స్‌లోకి వదలడంతో పాటు…. సినీ ప్రియులను టార్గెట్ చేస్తున్నారు కంత్రీగాళ్లు. ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్టై జైల్లో ఊచలు లెక్కబెడుతుంటే… ఐబొమ్మ పేరుతో డజన్ల కొద్దీ సైట్లను పుట్టిస్తున్నారు. ఫ్రీగా సినిమా చూడాలన్న ఉత్సాహంతో ఉన్నవాళ్లను నిండా ముంచేస్తున్నారు. ఐబొమ్మ సైట్ అని క్లిక్ చేశారో మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయినట్లే. కాబట్టి అందరూ అలర్ట్‌గా ఉండాలని సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పంది చిన్నగానే ఉందిగా అని తీసి పడేయకండి.. చిరుతకే సుస్సు పోయించింది
అమావాస్య వేళ రంగు మారిన నీరు.. కారణం అదేనట
లైంగిక సామర్థ్యం పెంచుతానని లక్షలు ఖర్చు చేయించి.. చివరికి అనుకున్నది చేసాడు
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

