లైంగిక సామర్థ్యం పెంచుతానని లక్షలు ఖర్చు చేయించి.. చివరికి అనుకున్నది చేసాడు
ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని నకిలీ వైద్యులు ఎలా మోసం చేస్తున్నారో బెంగళూరు ఘటన నిరూపిస్తుంది. లైంగిక సమస్యతో బాధపడుతున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నకిలీ ఆయుర్వేద గురూజీ చేతిలో పడి, ₹48 లక్షలు పోగొట్టుకుని కిడ్నీలను దెబ్బతీసుకున్నాడు. ఈ దుర్ఘటన నకిలీ వైద్యుల పట్ల అప్రమత్తత అవసరాన్ని స్పష్టం చేస్తుంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రజల బలహీనతలకి తోడు నకిలీ డాక్టర్ల బెడద ఎక్కువైపోతోందా అంటే అవుననే అనిపిస్తోంది. ఉన్నత విద్యలు అభ్యసించినవారే వీరి మాయలో పడిపోతున్నారు.. దారుణంగా మోసపోతున్నారు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. ఓ నకిలీ వైద్యుడి చేతిలో ఓ టెకీ దారుణంగా మోసపోయాడు. ఏకంగా తన కిడ్నీలనే పోగొట్టుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బెంగళూరులో పని చేస్తున్నాడు. లైంగిక సమస్య కారణంగా తన వైవాహిక జీవితం సంతృప్తిగా లేదని భావించిన ఆయన కెంగేరిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నాడు. ఫలితం లేకపోవడంతో మే 3న ఓ ఆయుర్వేద వైద్యుడిగా చెప్పుకొంటున్న ఓ గురూజీ వద్దకు వెళ్లాడు. ఆ గురూజీ సూచనలతో యశ్వంతపురలోని ఓ ఆయుర్వేద దుకాణంలో బాధితుడు తొలుత రూ.1.60 లక్షలు పెట్టి మెడిసిన్ కొన్నాడు. ఆ మందును హరిద్వార్ నుంచి తెప్పించామని గురూజీ నమ్మించాడు. తర్వాత ఆ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మిగతా మెడిసిన్ కొనడానికి బ్యాంకునుంచి రూ20 లక్షలు లోను కూడా తీసుకున్నాడు. ఈ క్రమంలో గురూజీ సూచించిన మందులు కొనడానికి ఆయన ఏకంగా రూ.48 లక్షలు ఖర్చు చేశాడు. అయినా తన సమస్య తీరకపోగా అనారోగ్యం బారిన పడ్డాడు. చివరకు ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్న అతను షాకయ్యాడు. వైద్య పరీక్షల్లో అతని మూత్రపిండాలు దెబ్బతిన్నట్టు తేలడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. గురూజీ ఇచ్చిన ఔషధాలే తన ఆరోగ్యం చెడిపోడానికి కారణమంటూ సదరు మందులషాపుపైన, గురూజీపైన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వన్డే సిరీస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్
చైనా ఓవరాక్షన్.. భారత మహిళపై వేధింపులు
PM Modi: ఏఐ దుర్వినియోగాన్ని అడ్డుకోవాలన్న ప్రధాని మోదీ
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

