PM Modi: ఏఐ దుర్వినియోగాన్ని అడ్డుకోవాలన్న ప్రధాని మోదీ
జీ20 సదస్సులో ప్రధాని మోదీ AI దుర్వినియోగంపై ప్రపంచ దేశాలకు కీలక సందేశమిచ్చారు. మానవ కేంద్రిత సాంకేతికతకు ప్రాధాన్యతనిస్తూ, AIని నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాలకు వాడకుండా కఠిన నిబంధనలు తేవాలని పిలుపునిచ్చారు. క్లీన్ ఎనర్జీ, ప్రకృతి విపత్తుల నివారణ, ఆహార భద్రతపై వాతావరణ మార్పుల ప్రభావంపై గ్లోబల్ సహకారం అవసరమని నొక్కిచెప్పారు.
కృత్రిమ మేధ AI దుర్వినియోగమవుతోందని దీన్ని అడ్డుకోవడానికి చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ప్రపంచదేశాలన్నీ కలసికట్టుగా పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. టెక్నాలజీ ఏదైనా సరే మానవ కేంద్రంగా ఉండాలే తప్ప ఆర్థిక కేంద్రంగా ఉండకూడదని దక్షిణాఫ్రికాలోని జీ20 సదస్సులో అన్నారు. వేర్వేరు అంశాలపై జరిగిన చర్చా కార్యక్రమాల్లో మాట్లాడారు. కృత్రిమ మేధ ప్రపంచ అభివృద్ధి, మానవాళి బాగుకోసం ఉపయోగపడాలని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. దుర్వినియోగం కాకుండా కఠిన నిబంధనలు తీసుకురావాలని చెప్పారు. డీప్‌ఫేక్, నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాల్లో ఏఐని విచ్చలవిడిగా వాడుకోవడానికి వీల్లేకుండా చూడాలన్నారు. యాప్‌లను ఏ ఒక్క దేశానికో ఉపయోగపడేలా కాకుండా ప్రపంచమంతా వాడుకునేలా రూపొందించాలని సూచించారు. ఏఐ, డిజిటల్ చెల్లింపుల్లో ఇండియా ముందంజలో ఉందన్నారు. ప్రపంచ దేశాలు శిలాజ ఇంధనాల వాడకం నుంచి క్లీన్ ఎనర్జీ దిశగా మళ్లాలని పిలుపునిచ్చారు. క్లీన్ ఎనర్జీ కోసం రీసైక్లింగ్‌ను వేగవంతం చేసి సప్లై చైన్‌పై ఒత్తిడి తగ్గించాలని అన్నారు. జీ20 దేశాలు తమ ఉపగ్రహ సమాచారాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవాలని కోరారు. ప్రకృతి విపత్తులు మానవాళికి పెనుముప్పుగా పరిణమిస్తున్నాయని గుర్తుచేశారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులు విరుచుకుపడ్డాయని, కోట్లాది మంది ప్రభావితమయ్యారని తెలిపారు. అందుకే విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి ప్రపంచదేశాలు తమ మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని తేలిచెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు వ్యవసాయ రంగంపై పెను ప్రభావం చూపుతున్నాయని, ఫలితంగా ఆహార భద్రత ప్రమాదంలో పడుతోందని, ప్రజలకు పోషకాహారం అందడం లేదని ప్రధాని మోదీ అన్నారు. అందుకే వాతావరణ మార్పుల నియంత్రణపై తక్షణమే దృష్టి పెట్టాలని ప్రపంచ దేశాలను కోరారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బద్దలైన అగ్నిపర్వతం.. భారత్‌పై ప్రభావం.. పలు విమానాలు రద్దు
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే
24 గంటల్లో తుఫాన్ వణుకుతున్న తీర ప్రాంతం
ఆటోడ్రైవర్ మంచి మనసుకు నెటిజన్లు ఫిదా వీడియో
మెస్సి పేరుతో టీ స్టాల్.. ఫుట్‌బాల్ స్టార్ ను కలిసే అవకాశం వీడియో
ఇదేం విచిత్రం.. మండు వేసవి ముందే వచ్చిందా వీడియో
మీరు గ్రేట్ సార్ ఓటు కోసం విమానంలో వచ్చి వీడియో
పాక్‌లో సంస్కృతం కోర్సు వీడియో
రైల్వే సంచలన నిర్ణయం వీడియో
మెస్సీ కోసం హనీమూన్ వాయిదా.. కొత్త పెళ్లికూతురి క్రేజీ ప్లకార్డ్

