AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బద్దలైన అగ్నిపర్వతం.. భారత్‌పై ప్రభావం.. పలు విమానాలు రద్దు

బద్దలైన అగ్నిపర్వతం.. భారత్‌పై ప్రభావం.. పలు విమానాలు రద్దు

Phani CH
|

Updated on: Nov 25, 2025 | 10:11 PM

Share

ఇథియోపియాలోని హేలీ గుబ్బి అగ్నిపర్వతం 12,000 ఏళ్ల తర్వాత విస్ఫోటనం చెందింది. దీని బూడిద మేఘాలు ఉత్తర భారత్‌ వైపు విస్తరించాయి. దీంతో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఇంజిన్లకు నష్టం, ఆరోగ్య ప్రమాదాల దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నారు. బూడిద మేఘాలు ఎత్తైన ప్రాంతాల్లో ఉండటంతో ఢిల్లీ గాలి నాణ్యతపై ప్రభావం తక్కువ.

ఇథియోపియాలో అగ్నిపర్వతం బద్దలయింది. ఇది 12 వేల సంవత్సరాల తర్వాత విస్పోటనం చెందడంతో పెద్ద ఎత్తున లావా, బూడిద ఎగసిపడింది. ఈ బూడిద మేఘాలు ఉత్తర భారతదేశం వైపు విస్తరించాయి. దీంతో భారత్‌లో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు అప్రమత్తంగా ఉండాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఇథియోపియాలోని హేలీ గుబ్బి అగ్నిపర్వతం దాదాపు 12,000 ఏళ్ల తర్వాత ఆదివారం బద్దలైంది. దీని నుంచి వెలువడిన దట్టమైన బూడిద మేఘాలు ఎర్ర సముద్రం మీదుగా యెమెన్, ఒమన్ వైపు ప్రయాణించి, ప్రస్తుతం ఉత్తర అరేబియా సముద్రం మీదుగా భారత్‌లోకి ప్రవేశించాయి. ఈ బూడిద మేఘాలు గుజరాత్‌, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉన్నాయి. అయితే, ఈ మేఘాలు వాతావరణంలో చాలా ఎత్తులో ఉండటంతో ఢిల్లీ గాలి నాణ్యతపై ప్రభావం చూపే అవకాశాలు తక్కువని నిపుణులు అంచనా వేస్తున్నారు. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినప్పుడు అందులోని కొన్ని పదార్థాలు వాతావరణంలో కలుస్తాయి. దీంతో ఈ బూడిద మేఘం ఏర్పడుతుంది. ఇందులో అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిదతో పాటు సల్ఫర్‌ డైఆక్సైడ్‌, చిన్న చిన్న రాతి, గాజు ముక్కలు వంటివి ఉంటాయి. తాజాగా ఇథియోపియాలోని హేలీ గుబ్బి అగ్నిపర్వతం పేలడంతో వేల మీటర్ల ఎత్తులో బూడిద మేఘం ఏర్పడింది. హేలీ గుబ్బి అగ్నిపర్వతం విస్ఫోటనంతో ఏర్పడిన ఈ బూడిద మేఘం 15వేల నుంచి 25వేల అడుగుల ఎత్తులోకి చేరింది. ఒక్కోసారి 45 వేల అడుగుల పైకి చేరొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద మేఘాల కారణంగా విమాన సర్వీసులపై ప్రభావం పడింది. బూడిద మేఘాలతో విమానాలకు విజిబిలిటీ తగ్గుతుంది. దీంతో విమానాలు ఆలస్యంగా నడవడం, దారి మళ్లించడం జరుగుతుంది. ఒకవేళ ఇలాంటి మేఘాల్లో నుంచి విమానాలు ప్రయాణిస్తే వాటి ఇంజిన్లు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. మనుషుల ఆరోగ్యం పైనా ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ముందుజాగ్రత్త చర్యగా ఆకాశ‌ ఎయిర్, ఇండిగో, కేఎల్‌ఎం వంటి విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేశాయి. నవంబరు 24 సోమవారం, నవంబరు 25, మంగళవారం జెడ్డా, కువైట్, అబుదాబికి వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసినట్లు ఆకాశ‌ ఎయిర్ ప్రకటించింది. కేఎల్‌ఎం రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్ కూడా ఆమ్‌స్టర్‌డామ్-ఢిల్లీ రాకపోకల సర్వీసులను నిలిపివేసింది. ప్రయాణికుల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని ఇండిగో… ఎక్స్ వేదికగా తెలిపింది. ప్రస్తుత బూడిద మేఘం నేపథ్యంలో అప్రమత్తమైన భారత డీజీసీఏ ఇప్పటికే విమానయాన సంస్థలకు అత్యవసర అడ్వైజరీని జారీ చేసింది. బూడిద ప్రభావిత ప్రాంతాలకు దూరంగా ప్రయాణించాలని, తాజా సమాచారం ఆధారంగా రూటింగ్, ఇంధన ప్రణాళికలను మార్చుకోవాలని డీజీసీఏ విమానయాన సంస్థలను ఆదేశించింది. బూడిద మేఘాల కారణంగా ఇంజిన్ పనితీరులో తేడాలు, క్యాబిన్‌లో పొగ లేదా వాసన వంటివి గమనిస్తే తక్షణమే రిపోర్ట్ చేయాలని సూచించింది. విమానాశ్రయాలపై బూడిద ప్రభావం పడితే రన్‌వేలు, ట్యాక్సీవేలను వెంటనే తనిఖీ చేయాలని ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లకు సూచించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే

24 గంటల్లో తుఫాన్ వణుకుతున్న తీర ప్రాంతం

Mahavatar Narasimha: ఆస్కార్ బరిలో మహావతార్‌ నరసింహ

Keerthy Suresh: తన వీక్‌నెస్ ఏంటో బయటపెట్టిన కీర్తీ సురేష్‌

TOP 9 ET News: యూట్యూబ్‌పై అఖండ సర్జికల్ స్ట్రైక్.. బాలయ్యా.. మజాకా !!