ఉద్యోగి 40 ఏళ్ళ సేవలను మెచ్చుకొని సన్మానం
భారత సంతతికి చెందిన బల్బీర్ సింగ్ మెక్‌డొనాల్డ్స్‌లో 40 ఏళ్లుగా అంకితభావంతో పనిచేసి మేనేజ్‌మెంట్ స్థాయికి ఎదిగారు. ఆయన సేవలను గుర్తించి యాజమాన్యం లిమోజైన్ స్వాగతం, రెడ్ కార్పెట్, $40,000 చెక్కుతో ఘనంగా సత్కరించింది. కిచెన్ సిబ్బందిగా మొదలై, అంకితభావంతో మేనేజర్‌గా ఎదిగిన ఆయన ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం.
40 ఏళ్లుగా ఒకే సంస్థలో పనిచేస్తూ విశేష సేవలందించిన ఉద్యోగి అంకితభావానికి మెచ్చి ఘనంగా సత్కరించింది యాజమాన్యం. అదికూడా పరాయి దేశంనుంచి వచ్చి తమ సంస్థలో చిరు ఉద్యోగిగా చేరి మేనేజ్‌మెంట్ స్థాయికి ఎదిగిన అతని కృషికి తోటి ఉద్యోగులు సైతం హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను అభినందించారు. ఈ ఘటన అమెరికాలో జరిగింది. అమెరికాలో భారత సంతతికి చెందిన బల్బీర్ సింగ్ ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ సంస్థ మెక్‌డొనాల్డ్స్‌లో 40 ఏళ్లుగా పనిచేస్తున్నన్నారు. ఈ క్రమంలో బల్బీర్ సింగ్‌ను యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ఆయన సేవలకు గుర్తుగా లిమోజైన్ కారులో రెడ్ కార్పెట్ స్వాగతం పలకడమే కాకుండా 40,000 డాలర్ల చెక్‌ను బహూకరించింది. 1980ల ప్రారంభంలో భారతదేశం నుంచి అమెరికాకు వలస వెళ్లిన బల్బీర్ సింగ్, 1985లో మసాచుసెట్స్ రాష్ట్రంలోని సాగస్ పట్టణంలో ఉన్న మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌లో కిచెన్ సిబ్బందిగా చేరారు. అప్పటి నుంచి అదే సంస్థలో అంకితభావంతో పనిచేస్తున్నారు. ఆయన 40 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం ఫ్రాంచైజీ యజమాని లిండ్సే వాలిన్ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బల్బీర్ సింగ్‌ను ఒక లిమోజైన్ కారులో రెస్టారెంట్‌కు తీసుకొచ్చారు. ఆయన కారు దిగగానే, సహోద్యోగులు పక్కన నిలబడి చప్పట్లతో, కేరింతలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు 40,000 డాలర్ల చెక్కుతో పాటు ప్రత్యేకంగా తయారు చేయించిన ‘వన్ ఇన్ ఎయిట్’ జాకెట్‌ను బహూకరించారు. కిచెన్ సిబ్బందిగా, క్లీనింగ్ విభాగంలో పనిచేసిన బల్బీర్, తన కష్టంతో మేనేజ్‌మెంట్ స్థాయికి ఎదిగి ప్రస్తుతం నాలుగు అవుట్‌లెట్లను పర్యవేక్షిస్తున్నారు. సహోద్యోగులు ఆయన్ను ఆప్యాయంగా ‘పాపా బేర్’ అని పిలుచుకుంటారు. ఆయన తమ సంస్థకు ఒక మార్గదర్శి అని, ఆయన పనితనం ఎంతో స్ఫూర్తిదాయకమని ఫ్రాంచైజీ యజమాని కొనియాడారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రన్నింగ్ ట్రైన్‌లో వంటలు చేసిన మహిళ.. ఇండియన్ రైల్వే ఏం చేసిందంటే
ఎస్బీఐ పేరుతో వాట్సాప్‌లో కొత్త మోసం.. వేలాది ఎకౌంట్లు ఖాళీ
పంది చిన్నగానే ఉందిగా అని తీసి పడేయకండి.. చిరుతకే సుస్సు పోయించింది
అమావాస్య వేళ రంగు మారిన నీరు.. కారణం అదేనట
లైంగిక సామర్థ్యం పెంచుతానని లక్షలు ఖర్చు చేయించి.. చివరికి అనుకున్నది చేసాడు
ఆటోడ్రైవర్ మంచి మనసుకు నెటిజన్లు ఫిదా వీడియో
మెస్సి పేరుతో టీ స్టాల్.. ఫుట్‌బాల్ స్టార్ ను కలిసే అవకాశం వీడియో
ఇదేం విచిత్రం.. మండు వేసవి ముందే వచ్చిందా వీడియో
మీరు గ్రేట్ సార్ ఓటు కోసం విమానంలో వచ్చి వీడియో
పాక్‌లో సంస్కృతం కోర్సు వీడియో
రైల్వే సంచలన నిర్ణయం వీడియో
మెస్సీ కోసం హనీమూన్ వాయిదా.. కొత్త పెళ్లికూతురి క్రేజీ ప్లకార్డ్

