AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కార్తికేయతో ప్రియాంక చోప్రా, సితార ఫొటో వైరల్‌

కార్తికేయతో ప్రియాంక చోప్రా, సితార ఫొటో వైరల్‌

Phani CH
|

Updated on: Nov 26, 2025 | 1:40 PM

Share

దర్శధీరుడు రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ 34వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, సితార వంటి ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 'వారణాసి' ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, 'RRR' సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన కార్తికేయ పనితీరును మహేష్ బాబు కొనియాడారు. ఆయన సృజనాత్మక పనితీరుతో భవిష్యత్తులోనూ గొప్ప విజయాలు సాధిస్తారని ప్రశంసించారు.

దర్శకధీరుడు రాజమౌళి త‌న‌యుడు, యువ నిర్మాత కార్తికేయ ఇటీవల తన 34వ పుట్టిన‌రోజును జరుపుకున్నారు. వారణాసి మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కావడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు X వేదికగా బర్త్ డే విషెష్ తెలిపారు. వారణాసి సెట్లో కార్తికేయతో కలిసి ఉన్న ఫోటోను పంచుకుంటూ.. మహేష్ ఆకాశానికెత్తేశారు. మేం నిర్మించే ప్రతి అద్భుతం వెనుకుండే నిశ్శబ్ద శక్తివి నువ్వే. ఎంతో కష్టమైన పనులను కూడా ఎంత కూల్గా చక్కబెడతావో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. మున్ముందు గొప్ప సక్సెస్ అందుకుంటావు” అని మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇపుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ప్రియాంక చోప్రా కార్తికేయకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. వారణాసి సినిమా ప్రయాణంలో నీతో కలిసి డాన్స్‌ చేయగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ ప్రియాంక చోప్రా రాసుకొచ్చింది. వీడియోలో కార్తికేయతో క‌లిసి సరదాగా స్టెప్పులేసింది. మహేష్‌బాబు తనయ సితార కూడా తన సోషల్‌మీడియా హాండిల్‌లో కార్తికేయకి బర్త్‌డే విషెస్ తెలిపింది. ప్రియాంక చోప్రా, ఆమె తల్లి మధు చోప్రా, నమ్రత, కార్తికేయతో తీసుకున్న ఫొటోను షేర్‌ చేసింది. ఆ పిక్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఇటీవల RFC లో జరిగిన గ్లోబ్‌ట్రాటర్‌ ఈవెంట్‌ను గ్రాండ్ సక్సెస్ చేయడంలోనూ కార్తికేయ తనదైన పాత్ర పోషించారు. తండ్రి రాజమౌళి ఆలోచనలకు తగ్గట్టుగా, తన పనితీరును క్రియేటివ్గా ముందుకు తీసుకెళ్లడంలో కార్తికేయ సమర్ధుడు. ఈ విషయాన్నీ RRR మూవీతోను నిరూపించాడు. ఇపుడు ‘వారణాసి’కి కూడా మరోసారి వర్క్‌ చేస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న వారణాసి 2027 సమ్మర్‌లో రిలీజ్‌ రానుంది. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తుండగా.. కీరవాణి మ్యూజిక్ సమకూరుస్తున్నారు. దేవాకట్టా డైలాగ్స్ అందిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పుట్టినరోజు పేరుతో నడిరోడ్డుపై రెచ్చిపోయారు.. చివరికి !!

ఉద్యోగి 40 ఏళ్ళ సేవలను మెచ్చుకొని సన్మానం

రన్నింగ్‌ ట్రైన్‌లో వంటలు చేసిన మహిళ.. ఇండియన్‌ రైల్వే ఏం చేసిందంటే

ఎస్బీఐ పేరుతో వాట్సాప్‌లో కొత్త మోసం.. వేలాది ఎకౌంట్లు ఖాళీ

పంది చిన్నగానే ఉందిగా అని తీసి పడేయకండి.. చిరుతకే సుస్సు పోయించింది

Follow Us