మానవ బంధాలన్నీ.. ఆర్ధిక సంబంధాలే.. సోదరి కుటుంబాన్ని ట్రాక్టర్‌తో తొక్కించి మరీ..
సూర్యాపేట జిల్లా మునగాలలో భూవివాదం, డబ్బుల గొడవలు కారణంగా మానవ సంబంధాలు ఎలా దెబ్బతిన్నాయో ఈ ఘటన వెల్లడిస్తుంది. సొంత అన్న ఉపేందర్ రెడ్డి, సోదరి జ్యోతిపై ట్రాక్టర్‌తో దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఆర్థిక సంబంధాల కోసం రక్త సంబంధాలు విచ్ఛిన్నమవుతున్న తీరుకు ఇది నిదర్శనం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మానవ సంబంధాలన్నీ.. ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయనడానికి ఈ ఘటనే నిదర్శనం.. భూవివాదంతో సొంత కుటుంబ సభ్యులే.. ఒకరినొకరు చంపుకునేందుకు ప్రయత్నించారు.. సంచలనంగా మారిన ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాఖత్ గూడెంలో జరిగింది.. బరాఖత్ గూడెంలో కళావతి, రాంరెడ్డి దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. వీరిని ఉన్నంతలో చదివించి పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేశారు. కొడుకు ఉపేందర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ లో బిఎస్ఎన్ఎల్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కళావతి.. కుమార్తె జ్యోతికి కొంత అప్పుగా ఇచ్చింది. ఒకవైపు ఉపేందర్ రెడ్డికి తన సోదరి జ్యోతితో కొంతకాలంగా భూ వివాదం కొనసాగుతోంది. మరోవైపు కళావతికి జ్యోతి ఇవ్వాల్సిన డబ్బుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కూతురు జ్యోతి తన పొలంలో వరి కోత మిషన్ తో పని చేస్తున్నారు. డబ్బులు విషయంలో ఆగ్రహంగా ఉన్న తల్లి కళావతి, సోదరుడు ఉపేందర్ రెడ్డి. ట్రాక్టర్ పై వచ్చి వరి కోత మిషన్ కు అడ్డుగా పెట్టారు. వరి కోత మిషన్ డ్రైవర్ ను ఉపేందర్ రెడ్డి బెదిరించడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఉపేందర్ రెడ్డి.. అక్కడితో ఆగకుండా సోదరి జ్యోతితో పాటు, ఇద్దరు మేనకోడళ్లపై ట్రాక్టర్ తో ఢీ కొట్టాడు. దీంతో వారు గాయాలతో బయటపడ్డారు. కట్టలు తెంచుకున్న ఆవేశంతో ప్రాణాలను కబళించేలా దాడులు చేశారు. చుట్టుపక్కల ఉన్న స్థానికులు, రైతులు వచ్చి అడ్డుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన సోదరుడి నుంచి ప్రాణహాని తమకు ఉందని జిల్లా ఎస్పీ నరసింహకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన మునగాల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీళ్లు అమ్మాయిలా.. ఆటం బాంబులా.. రీల్స్ కోసం మరి ఇంతకి తెగించారా.. బాబోయ్
కొంపముంచిన హీటర్.. డ్రైవర్ సజీవదహనం!
స్నేహమంటే ఇదేరా.. నీటిలో పడ్డ ఏనుగు పిల్ల.. దాని ఫ్రెండ్స్ ఏం చేసేయంటే !
రూ.500 కూడా రూ.50 లాగే అనిపిస్తుంది.. ఖర్చులపై యువతి ఆవేదన
ముందుకు కదలకుండా ఆగిన అతిపెద్ద శివలింగం
ఇరవైల్లోనే రూ. 9 కోట్ల ఇంటిని సొంతం చేసుకుంది
లండన్ రైల్లో సమోసాలు అమ్మిన బీహారీ.. పరువు తీశావంటూ ట్రోలింగ్
అమ్మబాబోయ్ ఈ చేప ఒక్క కిలో ధర రూ.11 లక్షలు పైనే
ఇద్దరు స్నేహితులకు ఊహించని సహాయం చేసిన డెలివరీ బాయ్
నాకు మరో భార్య కావాలి.. వాటర్ ట్యాంక్ ఎక్కి వ్యక్తి హంగామా

