నల్లమలలో జంగిల్ సఫారీ.. ఎదురుగా పెద్దపులి.. కట్ చేస్తే
శ్రీశైలం జంగిల్ సఫారీలో పర్యాటకులకు అరుదైన అనుభవం ఎదురైంది. నల్లమల అటవీ ప్రాంతంలోని తుమ్మలబైలు వద్ద పెద్దపులి ప్రత్యక్షమైంది. వాహనంలో వెళ్తున్న నర్సీపట్నం, బెంగళూరు పర్యాటకులు తమ సెల్ ఫోన్లలో దానిని చిత్రీకరించారు. ఈ ఎకో-టూరిజం సఫారీ నాగార్జున సాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో 8 కి.మీ. మేర ఉంటుంది. టికెట్, వేళల వివరాలు అందుబాటులో ఉన్నాయి.
ఎదురుగా పెద్దపులి… వెంటనే షూట్ చేశారు… పెద్దపులిని షూట్ చేశారంటే తుపాకులతో కాదండోయ్…సెల్ కెమెరాలతో. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం శ్రీశైలం ఘాట్ రోడ్డు లో తుమ్మలబైలు వద్ద అటవీ శాఖ ఏర్పాటు చేసిన జంగిల్ సఫారి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. వాహనంలో జంగిల్ సఫారి రైడ్ కు వెళ్ళిన నర్సీపట్నం, బెంగుళూరు కు చెందిన పర్యాటకులకు పెద్ద పులి తారస పడింది.. దట్టమైన అడవిలో ఓ చెట్టు కింద సేద తీరుతున్న పెద్ద పులిని కనులారా చూసిన పర్యాటకులు సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. దీంతో సెల్ ఫోన్‌లలో చిత్రీకరిస్తూ సంతోష పడ్డారు. ఆ పెద్ద పులి తన వైపే చూస్తుందంటూ ఓ బాలుడు మురిసి పోయాడు. వీరు గట్టిగా మాట్లాడుకుంటూ ఉండగా ఆ పులి పక్కకు వెళ్ళి పోయింది. అమెజాన్, ఆఫ్రికా అడవుల్లో వన్యమృగాలను వీక్షించేందుకు టూరిజం శాఖలు జంగిల్ సఫారీ నిర్వహిస్తుంటాయి. మన నల్లమల అటవీప్రాంతంలో కూడా ఎకో టూరిజం పేరుతో జంగిల్ సఫారీ నిర్వహిస్తున్నారు. నాగార్జున సాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో పచ్చని నల్లమల అటవీప్రాంతంలో 8 కిలో మీటర్ల మేర ఈ సఫారీ రైడింగ్ ఉంటుంది. ఈ క్రమంలో ఆదివారం తుమ్మలబైలు నుంచి దట్టమైన అడవిలోకి వెళ్ళగానే సఫారీ వాహనానికి దగ్గరగా ఓ పెద్దపులి సేదతీరుతున్న దృశ్యాలు పర్యాటకుల కంట పడ్డాయి. దీంతో అంతులేని ఆనందానికి గురయ్యారు. సాధారణంగా పెద్దపులులు సఫారీ వాహనాల రహదారికి దూరంగా ఉంటాయి. అయితే ఈసారి ఓ పెద్దపులి మాత్రం దారికి దగ్గరలో ఉండటంతో తెగ సంతోషపడిపోయిన టూరిస్టులు వెంటనే సెల్‌ఫోన్‌లో పెద్దపులి దృశ్యాలను చిత్రీకరించారు. ఆ ఆనందంలో పిల్లలు కేకలు వేయడంతో పెద్దపులి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఈ సంఘటన తమ జీవితంలో మర్చిపోలేని అనుభవాన్ని మిగుల్చుతుందని తెగ సంతోషపడిపోయారు. నల్లమలలో జంగిల్ సఫారీకి వెళ్ళాలంటే ప్రకాశంజిల్లా దోర్నాల, కర్నూలుజిల్లా శ్రీశైలం మధ్యలో ఉన్న తుమ్మలబైలు చెంచు గూడెం నుండి 1.5 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి… రోడ్డు మార్గంలో శ్రీశైలం నుంచి 30 కిలోమీటర్లు, మార్కాపురం నుంచి 55 కిలో మీటర్లు, హైదరాబాద్ నుంచి 247 కిలో మీటర్లు ఉంటుంది. రైలు మార్గంలో రావాలంటే మార్కాపురం రోడ్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి 55 కిలో మీటర్లు రోడ్డు మార్గంలో వెళ్ళాల్సి ఉంటుంది.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జంగిల్ సఫారీ తెరిచి ఉంటుంది. ఒక ట్రిప్పుకు 6 గురికి 2,400 రూపాయలు వసూలు చేస్తారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. లక్ష కొలువుల భర్తీకి రంగం సిద్ధం
మానవ బంధాలన్నీ.. ఆర్ధిక సంబంధాలే.. సోదరి కుటుంబాన్ని ట్రాక్టర్‌తో తొక్కించి మరీ..
వీళ్లు అమ్మాయిలా.. ఆటం బాంబులా.. రీల్స్ కోసం మరి ఇంతకి తెగించారా.. బాబోయ్
కొంపముంచిన హీటర్.. డ్రైవర్ సజీవదహనం!
స్నేహమంటే ఇదేరా.. నీటిలో పడ్డ ఏనుగు పిల్ల.. దాని ఫ్రెండ్స్ ఏం చేసేయంటే !
రూ.500 కూడా రూ.50 లాగే అనిపిస్తుంది.. ఖర్చులపై యువతి ఆవేదన
ముందుకు కదలకుండా ఆగిన అతిపెద్ద శివలింగం
ఇరవైల్లోనే రూ. 9 కోట్ల ఇంటిని సొంతం చేసుకుంది
లండన్ రైల్లో సమోసాలు అమ్మిన బీహారీ.. పరువు తీశావంటూ ట్రోలింగ్
అమ్మబాబోయ్ ఈ చేప ఒక్క కిలో ధర రూ.11 లక్షలు పైనే
ఇద్దరు స్నేహితులకు ఊహించని సహాయం చేసిన డెలివరీ బాయ్
నాకు మరో భార్య కావాలి.. వాటర్ ట్యాంక్ ఎక్కి వ్యక్తి హంగామా

