AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raja Movie: ‘రాజా’ సినిమాకు సౌందర్య ఫస్ట్ ఛాయిస్ కాదా? ఆ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేయడంతోనే..

సినిమా ఇండస్ట్రీలో కథలు చేతులు మారడమనేది చాలా కామన్. ఒక హీరో/హీరోయిన్ చేయాల్సిన సినిమా వేరే వారి దగ్గరకు వెళ్లడం ఇక్కడ తరచూ జరుగుతుంటుంది. అలా చేతులు మారిన సినిమాలు ఒక్కోసారి సూపర్ హిట్ అవుతుంటాయి.. మరోసారి బొక్కా బోర్లా పడుతుంటాయి.

Raja Movie: 'రాజా' సినిమాకు సౌందర్య ఫస్ట్ ఛాయిస్ కాదా? ఆ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేయడంతోనే..
Raja Movie
Basha Shek
|

Updated on: Nov 27, 2025 | 2:45 PM

Share

విక్టరీ వెంకటేష్.. ఈ టాలీవుడ్ సీనియర్ హీరో క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రామానాయుడు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలతో పోల్చుకుంటే విక్టరీ వెంకటేశ్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వారే ఫ్యామిలీ ఆడియెన్స్. మొన్నటికి మొన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన వెంకటేష్ కు ఫ్యామిలీ హీరోగా ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఉంది. అందుకు ఆయన నటించిన ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలే కారణం. అలా వెంకటేష్ ను ఫ్యామిలీ ఆడియెన్స్ కు మరింత చేరువ చేసిన సినిమా రాజా. ముప్పలనేని శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దివంగత నటి సౌందర్య హీరోయిన్ గా నటించింది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి నిర్మించిన ఈ సినిమా 1999 మార్చి 18న విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. విడుదలైన అన్ని చోట్లు 50రోజులు ఆడిన సినిమాగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. అలాగే 71 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 4 సెంటర్‌లలో రజతోత్సవం జరుపుకున్న చిత్రంగా వెంకటేశ్‌ కెరీర్ లోనే మరుపురాని సినిమాగా రాజా నిలిచిపోయింది. ఇక ఈ సినిమాలో వెంకీ, సౌందర్య కెమిస్ట్రీకి అద్దిరిపోయింది. వీరి నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. రాజా సినిమా వెంకీ కెరీర్ లో మరుపురాని చిత్రంగా నిలిచిపోతే, ఇదే సినిమాలో తన అద్బుత నటనకు ఏకంగా నంది అవార్డు గెల్చుకుంది సౌందర్య.

అయితే రాజా సినిమాలో హీరోయిన్ గా సౌందర్య ఫస్ట్ ఛాయిస్ కాదు. ఇది ‘ఉన్నిడతిల్ ఎన్నై కొడుతేన్’ అనే ఓ తమిళ సినిమాకు రీమేక్. ఒరిజనల్ వెర్షన్ లో కార్తీక్, రోజా హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నటిగా రోజాకు ఎనలేని క్రేజ్ తీసుకొచ్చింది. ఉత్తమ నటిగా తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు అందుకున్న రోజా తెలుగు రీమేక్‌లో కూడా నటించాలనుకుంది. దర్శక నిర్మాతలు కూడా సరేనన్నారు. అయితే అప్పటికే రోజా చేతిలో పలు ప్రాజెక్టులు న్నాయి. అవసరమైన డేట్స్‌ సర్దుబాటు చేయలేపకోయింది. దీంతో దర్శక నిర్మాతలు సౌందర్యను సంప్రదించి రాజా సినిమాను పట్టాలెక్కించారు. అలా మొత్తానికి రాజా సినిమాను మిస్ అయ్యింది రోజా. ప్రస్తుతం ఈ అందాల తార రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

రోజా సెల్వమణి లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us