Tollywood: ఒకప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. ఇప్పుడేమో ముషీరాబాద్ చర్చిలో..
సినిమాల్లో సక్సెస్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. ఎంతో కష్టపడితే కానీ ఇక్కడ మంచి గుర్తింపు రాదు. అలాంటిది కేవలం 10 ఏళ్లలోనే 30 కు పైగా సినిమాలు చేశాడీ హీరో. టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ కెరీర్ పీక్స్ లో ఉండగానే..

సాధారణంగా ఏ ఉద్యోగానికైనా రిటైర్మెంట్ ఉంటుంది. కానీ నటునికి అదేమీ ఉండదు. ఆసక్తి ఉంటే 80, 90 ఏళ్లలోనూ సినిమాలు చేయవచ్చు. హీరోగా కాకపోయినా సహాయక నటునిగా ఆడియెన్స్ ను మెప్పించవచ్చు. ది గ్రేట్ అమితాబ్ బచ్చన్ ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. అయితే ఈ టాలీవుడ్ హీరో చాలా చిన్నవయసులోనే సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అది కూడా హీరోగా కెరీర్ ఫుల్ స్పీడ్ ఉంటున్న సమయంలో సినిమాలను వదిలేశాడు. ఇతను 14 ఏళ్ల వయసులోనే తండ్రిని పోగోట్టుకున్నాడు. అంతుకు ముందే తల్లి క్యాన్సర్ తో కన్నుమూసింది. దీంతో ఒంటరి తనంతో డిప్రెషన్ బారిన పడ్డాడు. ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. అయితే స్నేహితులు ధైర్యం చెప్పడంతో బాగా చదువుకుని అమెరికాలో మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఇదే క్రమంలో నటనపై ఆసక్తి మళ్లడంతో థియేటర్ యాక్టింగ్ కోర్సు చేశాడు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియాకు తిరిగొచ్చాడు.
మొదట మోడలింగ్ లో రాణించాడు. ఆ తర్వాత వీడియో ఆల్బమ్స్ లోనూ, నాటకాల్లోనూ నటించాడు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా వరుసగా అవకాశాలు అందుకున్నాడు.తన సహజమైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. సూపర్ హిట్ సినిమాల్లో నటించి ట్యాలెంటెడ్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ లో కూడా మంచి హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కేవలం 10 ఏళ్ల కెరీర్ లోనే 30కు పైగా సినిమాల్లో నటించాడీ హీరో. అయితే సినిమా కెరీర్ ఫుల్ స్పీడ్ లో ఉండగానే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేశాడు.
ముషీరాబాద్ చర్చిలో పాస్టర్ గా..
View this post on Instagram
కట్ చేస్తే.. ఈ హీరో ఇప్పుడు చర్చిలో పాస్టర్ గా పని చేస్తున్నాడు. . ప్రస్తుతం ముషిరాబాద్ లోని ద న్యూ కెవినెన్ట్ చర్చ్ లో భక్తులకు దైవ ప్రవచనాలు చెబుతున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా? ఆనంద్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన రాజా. దీని తర్వాత అప్పుడప్పుడు, మొగుడు పెళ్ళాం ఓ దొంగోడు, మిస్టర్ మేధావి, ఆ నలుగురు, కోకిల.. ఇలా దాదాపు 30 సినిమాల్లో నటించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. అయితే 2014 తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు రాజా. అదే సమయంలో పాస్టర్ అవతారమెత్తి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోన్న రాజా తన ప్రవచనాలకు సంబంధించిన వీడియోలను అందులో షేర్ చేస్తున్నాడు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




