AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: ఈ ఒక్క చిన్న పొరపాటుతో మీ పిల్లలకు మూడేళ్లు వచ్చే సరికే పెద్ద ప్రమాదంలో.. ఎయిమ్స్ వైద్యుల హెచ్చరిక!

Lifestyle: న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్ పీడియాట్రిక్స్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ షెఫాలీ గులాటి నేతృత్వంలో జరిగిన అధ్యయనంలో దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి. ఏడాది వయసు నుండే మొబైల్ చూసే అలవాటు ఉన్న పిల్లల్లో 3 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆటిజం లక్షణాలు..

Lifestyle: ఈ ఒక్క చిన్న పొరపాటుతో మీ పిల్లలకు మూడేళ్లు వచ్చే సరికే పెద్ద ప్రమాదంలో.. ఎయిమ్స్ వైద్యుల హెచ్చరిక!
Childrens Lifestyle
Subhash Goud
|

Updated on: May 03, 2026 | 8:57 PM

Share

నేటి కాలంలో చిన్న పిల్లలు అన్నం తినాలన్నా, ఏడవకుండా ఉండాలన్నా వారి చేతికి మొబైల్ లేదా టాబ్లెట్ ఇవ్వడం తల్లిదండ్రులకు అలవాటుగా మారింది. అయితే, ఈ అలవాటు మీ బిడ్డ భవిష్యత్తును చీకట్లోకి నెట్టేస్తుందని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (AIIMS) నిపుణులు షాకింగ్ హెచ్చరిక జారీ చేశారు. చిన్న వయసులో ఎక్కువ సేపు స్క్రీన్ (మొబైల్, టీవీ) చూడటం వల్ల పిల్లల్లో ఆటిజం (Autism) వచ్చే ప్రమాదం ఉందని వారు స్పష్టం చేస్తున్నారు.

ఎయిమ్స్ అధ్యయనంలో తేలిందేమిటి?

న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్ పీడియాట్రిక్స్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ షెఫాలీ గులాటి నేతృత్వంలో జరిగిన అధ్యయనంలో దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి. ఏడాది వయసు నుండే మొబైల్ చూసే అలవాటు ఉన్న పిల్లల్లో 3 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆటిజం లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆటిజం బారిన పడిన పిల్లల చరిత్రను పరిశీలించగా.. వారు చాలా చిన్న వయసు నుండే గంటల తరబడి స్క్రీన్‌లకు అతుక్కుపోయారని తేలింది.

వర్చువల్ ఆటిజం (Virtual Autism) అంటే ఏమిటి?

  • అతిగా స్క్రీన్ చూడటం వల్ల వచ్చే ఆటిజం వంటి లక్షణాలను ‘వర్చువల్ ఆటిజం’ అని పిలుస్తున్నారు. దీనివల్ల పిల్లల్లో ఈ కింది సమస్యలు తలెత్తుతాయి.
  • మాటలు రాకపోవడం: భాష నేర్చుకోవడంలో, మాట్లాడటంలో జాప్యం జరుగుతుంది.
  • కళ్లలోకి చూడకపోవడం: ఎదుటివారితో ‘ఐ కాంటాక్ట్’ (Eye Contact) సరిగ్గా చేయలేరు.
  • సామాజిక దూరం: తోటి పిల్లలతో ఆడుకోవడానికి ఇష్టపడరు.
  • నిద్రలేమి: సరిగ్గా నిద్రపోకపోవడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు కనిపిస్తాయి.
  • అధ్యయనాల ప్రకారం.. రోజుకు 4 గంటల కంటే ఎక్కువ సేపు స్క్రీన్ చూసే చిన్నారుల్లో 53% మంది ఆటిజం బారిన పడే అవకాశం ఉంది.

నిపుణుల మార్గదర్శకాలు:

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (IAP) స్క్రీన్ టైమ్ గురించి కఠినమైన సూచనలు చేశాయి:

  • 0-18 నెలలు: పిల్లలకు అసలు మొబైల్ లేదా టీవీ చూపించకూడదు (వీడియో కాల్స్ మినహా).
  • 18 నెలల నుండి 2 ఏళ్లు: స్క్రీన్ టైమ్ జీరో లేదా చాలా పరిమితంగా ఉండాలి.
  • 2-5 ఏళ్లు: రోజుకు గరిష్టంగా 1 గంట మాత్రమే. అది కూడా నాణ్యమైన విద్యా విషయాలై ఉండాలి. తల్లిదండ్రులు పక్కనే ఉండాలి.

తల్లిదండ్రులు ఏం చేయాలి?

  • మీరే రోల్ మోడల్: పిల్లల ముందు మీరు మొబైల్ వాడటం తగ్గించండి.
  • నో టెక్ జోన్: భోజనం చేసేటప్పుడు పడుకునేటప్పుడు ఇళ్లలో మొబైల్ లేదా టీవీలు వాడొద్దు.
  • ఆటపాటలు: స్క్రీన్ బదులుగా పిల్లలతో మాట్లాడండి, కథలు చెప్పండి, బొమ్మలు వేయించడం లేదా అవుట్‌డోర్ ఆటల్లో వారిని భాగస్వామ్యం చేయండి.

(ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, ఇంట్నెట్‌లో లభించిన వివరాల ఆధారంగా అందిస్తున్నాము. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us