Kotha Bangaru Lokam: కొత్త బంగారు లోకం సినిమాకు ఆ స్టార్ హీరో ఫస్ట్ ఛాయిస్.. బ్లాక్ బస్టర్ హిట్ మిస్ అయిన హీరో ఎవరంటే..

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ కెరీర్ మార్చిన సినిమా కొత్త బంగారు లోకం. హ్యాపీడేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరో.. ఆ వెంటనే కొత్త బంగారు లోకం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత అతడు నటించిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ కావడంతో నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి.

Kotha Bangaru Lokam: కొత్త బంగారు లోకం సినిమాకు ఆ స్టార్ హీరో ఫస్ట్ ఛాయిస్.. బ్లాక్ బస్టర్ హిట్ మిస్ అయిన హీరో ఎవరంటే..
Kota Bangaru Lokam
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 08, 2025 | 8:14 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బ్యూటీఫుల్ లవ్ స్టోరీ కొత్త బంగారు లోకం. 2008లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యంగ్ హీరో వరుణ్ సందేశ్, శ్వేత బసు ప్రసాద్ జంటగా నటించారు. అప్పట్లో ఈ సినిమా యూత్ ను తెగ ఆకట్టుకుంది. కాలేజీ, హాస్టల్ నేపథ్యంలో వచ్చిన సీన్స్ అప్పట్లో యూత్ ను తెగ ఆకట్టుకున్నాయి. ఇక ఈసినిమాలోని డైలాగ్స్, సాంగ్స్ కూడా మెప్పించాయి. అంతేకాకుండా వరుణ్ సందేశ్ మేనరిజం అప్పట్లో యూత్ తెగ ఫాలో అయ్యారు. ఇక మొదటి సినిమాతోనే కుర్రకారు హృదయాలను దొచేసింది హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. ఇప్పటికీ ఈ సినిమా వస్తే టీవీలకు అతుక్కుపోతుంటారు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సెన్సెషన్ అయ్యింది. అయితే ఈ సినిమాతో వరుణ్ సందేశ్, శ్వేత బసు ప్రసాద్ ఇద్దరికి తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది.

ఇదిలా ఉంటే.. ఈసినిమాకు ఫస్ట్ ఛాయిస్ వరుణ్ సందేశ్ కాదట. అవును.. ఈ చిత్రాన్ని ఇద్దరు హీరోలు వదిలేయడంతో ఆ ఛాన్స్ వరుణ్ వద్దకు వచ్చింది. కొత్త బంగారు లోకం సినిమాకు ఫస్ట్ ఛాయిస్ అక్కినేని నాగచైతన్య. ఆర్య, బొమ్మరిల్లు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన శ్రీకాంత్ అడ్డాల.. కొత్త బంగారు లోకం సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయం కావాలనుకున్నారు. అందులోని పాత్రకు స్టార్ హీరో కాకుండా కొత్త నటుడిని తీసుకోవాలనుకున్నారు. అప్పుడే హీరో నాగార్జున తనయుడు అక్కినేని నాగచైతన్య తెరంగేట్రం చేయడానికి రెడీగా ఉన్నాడని తెలుసుకుని.. ఈ సినిమా కోసం నాగార్జునను సంప్రదించారట. అయితే కథ విన్న నాగ్.. యాక్షన్ నేపథ్యం ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారట.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత అదే స్టోరీని రామ్ పోతినేనికి వినిపించగా.. హీరోది కాలేజ్ స్టూడెంట్ రోల్ కావడంతో తనకు సెట్ కాదని వదిలేశారట. ఈ సినిమాకు హీరోను వెతుకుతుండగా.. హ్యాపీడేస్ సినిమా చాలా ఫ్రెష్ గా ఉందని… అందులోని ఓ కుర్రాడు బాగున్నాడని.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేశ్ సలహా ఇవ్వడంతో శ్రీకాంత్ అడ్డాల హ్యాపీడేస్ సినిమా చూసి వరుణ్ సందేశ్ ను హీరోగా సెలక్ట్ చేశారట.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.