Kannappa: పార్వతి దేవిని అలా చూపిస్తారా? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం

టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం కన్నప్ప. ఇప్పటికే ఈ మూవీని తన డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకున్న విష్ణు అందుకు తగ్గట్టుగానే భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కన్నప్ప సినిమాను రూపొందిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాపై హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Kannappa: పార్వతి దేవిని అలా చూపిస్తారా? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
Kannappa Movie
Follow us
Basha Shek

|

Updated on: Jan 08, 2025 | 8:44 AM

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు ఈ మూవీకి సంబంధించి వరుసగా అప్డేట్స్ వస్తున్నాయి. మంచు విష్ణు, మోహన్ బాబుతో పాటు మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, శరత్ కుమార్, మధుబాల, ముఖేష్ రిషి, కరుణాస్, యోగి బాబు, బ్రహ్మనందం, సప్తగిరి రఘు బాబు, ఐశ్వర్య రాజేష్, దేవరాజ్, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా (విష్ణు కూతుళ్లు) ఇలా భారీ తారగణంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ పోస్టర్లతో పాటు పాత్రల పేర్లను రివీల్ చేశారు మేకర్స్. వీటికి అభిమానుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి పార్వతి దేవిగా కాజల్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘ముల్లోకాలు ఏలే తల్లి! భక్తుల్ని ఆదుకునే త్రి శక్తి! శ్రీకాళహస్తిలో వెలసిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక’ అంటూ కాజల్ పాత్రను రివీల్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో తెల్లటి చీరలో, హిమాలయ పర్వతాల అడుగున.. ఒక బండరాయి మీద కాజల్ అగర్వాల్ కూర్చున్నట్లు కనిపిస్తోంది. ఆమె వెనుక మహా కాళి అవతారం పొగమంచుతో డిజైన్ చేశారు. ఈ పోస్టర్ బాగానే ఉన్నప్పటికీ హిందు ధర్మాలను తప్పుగా చూపిస్తున్నారని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ పోస్టర్ లో కాజల్ మోడ్రన్ లుక్ లో కనిపించడమే.

కన్నప్ప సినిమా పోస్టర్ లో కాజల్‌ అసలు దేవతామూర్తిగానే లేదంటూ కొందరు విమర్శిస్తున్నారు. నుదుటిన బొట్టు, చేతికి పారాణి ఎక్కడంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. ఈ పోస్టర్‌లో కాజల్ పార్వతి దేవిలా లేదని.. ఏదో జ్యూయలరీ యాడ్‌లాగా అనిపించిందంటున్నారు. మరికొందరు ఇది ఏఐ జనరేటేడ్‌ పోస్టర్‌లా ఉందని, హిందు ధర్మాన్ని తప్పుగా చూపిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఆ పోస్టర్ ను వెంటనే డిలీట్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విమర్శలపై కన్నప్ప టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

కన్నప్ప సినిమాలో కాజల్ లుక్..

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.