AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neha Sharma: వామ్మో.. ఏడడుగుల కటౌట్.. చిరుత హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు నేహా శర్మ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పరిచయమైన చిరుత సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మాత్రం సరైన ఆఫర్స్ అందుకోలేదు.

Neha Sharma: వామ్మో.. ఏడడుగుల కటౌట్.. చిరుత హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..
Neha Sharma
Rajitha Chanti
|

Updated on: Jan 08, 2025 | 8:47 AM

Share

బాలీవుడ్ హీరోయిన్ నేహా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హిందీలో పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. ఆ తర్వాత తెలుగు తెరకు పరిచయమైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తొలి చిత్రం చిరుత. ఈ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నేహా శర్మ. ఫస్ట్ మూవీతోనే అందం, అభినయంతో కుర్రకారు ఫేవరేట్ కథానాయికగా మారిన నేహాకు తెలుగులో అంతగా ఆఫర్స్ రాలేదు. చిరుత తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా బ్రేక్ అందుకోలేదు. దీంతో తిరిగి బాలీవుడ్ షిప్ట్ అయ్యింది. అక్కడ సైతం ఈ బ్యూటీకి అంతగా ఆఫర్స్ రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం గ్లామర్ ఫోటోలతో నెట్టింట అగ్గి రాజేస్తుంది నేహా శర్మ.

ఇదిలా ఉంటే.. తాజాగా నేహా శర్మ ప్రేమాయణం గురించి నెట్టింట చర్చ జరుగుతుంది. ఆమె క్రొయేషియన్ ఫుట్ బాల్ ప్లేయర్ పీటర్ స్లిస్కోవిచ్‌తో ప్రేమలో ఉందనే ప్రచారం నడుస్తుంది. వీరిద్దరు కలిసి ముంబై వీధుల్లో షికారు చేస్తూ చాలాసార్లు కెమెరాకు చిక్కారు. దీంతో ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ఫిల్మ్ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. గత కొన్ని వారాలుగా వీరిద్దరు కలిసి కనిపిస్తుండడంతో నేహా శర్మ ప్రేమ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి నేహా శర్మ, పీటర్ స్లిస్కోవిచ్‌ కలిసి కనిపించారు. వీరిద్దరు కలిసి డిన్నర్ డేట్ కోసం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో పీటర్ నేహా భుజం చుట్టూ చేసి ఎంతో సన్నిహితంగా కనిపించడం.. నేహా శర్మ ఎంతో సంతోషంగా కనిపించడంతో మరోసారి వీరిద్దరి ప్రేమకథ తెరపైకి వచ్చింది.

అయితే నేహా బాయ్ ఫ్రెండ్ పీటర్ ఏకంగా 7 అడుగులు ఉండడం చూసి షాకవుతున్నారు నెటిజన్స్. అతడి చెంత నేహా చాలా షార్ట్ గా కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు తమ ప్రేమ విషయాన్ని ఇద్దరూ అధికారికంగా వెల్లడించలేదు. కానీ కొద్ది రోజుల క్రితం నేహా శర్మ, పీటర్ చేతులు పట్టుకుని నడిచిన వీడియో వైరలయ్యింది.

పీటర్ స్లిస్కోవిచ్‌ ఎవరు..?

పీటర్ స్లిస్కోవిచ్‌ వయసు 33 సంవత్సరాలు. అతడు క్రొయేషియన్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. 2011లో జర్మనీలో మెయిన్జ్ 05తో ఫుట్ బాల్ ప్లేయర్ గా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత సెయింట్ పౌలి, డైనమో డ్రెస్డెన్ వంటి ఫుట్‌బాల్ క్లబ్‌ల కోసం ఆడాడు. ఒక సంవత్సరం ఒప్పందంపై జూలై 2022లో ఇండియన్ సూపర్ లీగ్ (ISL) క్లబ్ చెన్నైయిన్ FCకి మారాడు. తర్వాత జంషెడ్‌పూర్‌ ఎఫ్‌సీకి మారాడు. పీటర్ స్లిస్కోవిక్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 8 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'ధురంధర్'కు మించి కలెక్షన్లు.. ఇప్పుడు OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
'ధురంధర్'కు మించి కలెక్షన్లు.. ఇప్పుడు OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
బీసీసీఐ అయితే ఎవరికి గొప్ప..బంగా మంత్రి తలబిరుసు మాటలు
బీసీసీఐ అయితే ఎవరికి గొప్ప..బంగా మంత్రి తలబిరుసు మాటలు
రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పొలిటిక్స్ నడుస్తోందిః హరీష్ రావు
రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పొలిటిక్స్ నడుస్తోందిః హరీష్ రావు
గురు వక్రంతో ఆ రాశుల వారి ఆదాయానికి రెక్కలు..!
గురు వక్రంతో ఆ రాశుల వారి ఆదాయానికి రెక్కలు..!
ఈ ఫోన్ 9000mAh బ్యాటరీ.. 200MP కెమెరాతో.. అప్‌గ్రేడ్‌ ఫీచర్స్‌!
ఈ ఫోన్ 9000mAh బ్యాటరీ.. 200MP కెమెరాతో.. అప్‌గ్రేడ్‌ ఫీచర్స్‌!
డిజాస్టర్ హీరో.. అట్టర్ ఫ్లాప్ హీరోయిన్.. ఎందుకు దొరకడో చూద్దాం
డిజాస్టర్ హీరో.. అట్టర్ ఫ్లాప్ హీరోయిన్.. ఎందుకు దొరకడో చూద్దాం
తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
బనానా పాన్‌కేక్స్.. పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ ఆప్షన్ ఇదే!
బనానా పాన్‌కేక్స్.. పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ ఆప్షన్ ఇదే!
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్‌!
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్‌!
ఇద్దరికీ పెళ్లైంది.. అయినా గుట్టుగా ఆ యవ్వారం.. కట్ చేస్తే..
ఇద్దరికీ పెళ్లైంది.. అయినా గుట్టుగా ఆ యవ్వారం.. కట్ చేస్తే..