Tollywood: స్టార్ హీరోలతో సినిమాలు.. యాక్టింగ్ మానేసి లాయర్‌గా పనిచేస్తున్న హీరోయిన్.. ఎవరంటే..
దక్షిణాదిలో ఆమె టాప్ హీరోయిన్. అతి తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటూ.. అందం, అభినయంతో అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. తమిళ్ సినీరంగంలోకి టాప్ హీరోలతో కలిసి నటించి మెప్పించింది. ప్రస్తుతం సినిమాలు మానేసి న్యాయవాదిగా మారింది.

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. తెలుగు, మలయాళం, బెంగాలీ చిత్రాలలో నటించి నతకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటనతోపాటు, ఆమె అందమైన కళ్లను సైతం జనాలు ఆరాధించారు. ప్రముఖ చిత్రనిర్మాత సత్యజిత్ రే ఆమె వేదికపై డ్యాన్స్ చేయడం చూసి ఆమెకు సినిమాలో అవకాశం ఇచ్చారు. 1994 నుండి 2003 వరకు మాత్రమే సినిమాల్లో ఉన్నప్పటికీ, ‘గ్లామర్ రోల్స్ చేయడానికి నో’ చెప్పిన ఆమె ఎవరో మీకు తెలుసా ? ఆమె మరెవరో కాదు.. సువలక్ష్మి. కోల్‌కతాకు చెందిన సువలక్ష్మి.. కళాశాలలో చదువుతున్నప్పుడు ఆమెకు దర్శకుడు సత్యజిత్ రే అవకాశం ఇచ్చారు.
ఆ సమయంలో ఆమె సోదరుడు ఒక ప్రమాదంలో మరణించారు. దీంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. అదే సమయంలో ఆమెకు అజిత్ చిత్రం ఆసై చిత్రంలో ఛాన్స్ వచ్చింది. ఇందులో యమున పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఒకవైపు నటిగా సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు తన సోదరుడి కలను నెరవేర్చడానికి న్యాయ విద్యను పూర్తి చేసింది. ఆసై సినిమా తర్వాత ఆమెకు తమిళంలో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. కార్తీక్‌తో కలిసి ‘గోకులతిల్ సీతై’లో నటించడంతో ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది.
తమిళంతోపాటు తెలుగులోనూ అనేక చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ కావడం విశేషం. కెరీర్ ప్రారంభం నుండి చివరి వరకు ఎప్పుడూ గ్లామర్ పాత్రలు పోషించలేదు. చీరకట్టులో ఎంతో సంప్రదాయంగా.. అందంగా కనిపించింది. ప్రముఖ నటులతో పనిచేసినప్పటికీ ఆమె గ్లామర్ షోకు దూరంగా ఉండిపోయింది. 2001 నుంచి సినిమా పరిశ్రమను విడిచిపెట్టి న్యాయవాద వృత్తిని కొనసాగించాలని నిర్ణయించుకుంది. 2002లో తన చిరకాల స్నేహితుడైన స్వాగతో బెనర్జీని వివాహం చేసుకుంది. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడింది. సువలక్ష్మి తన భర్త వ్యాపారాన్ని చూసుకుంటూ న్యాయవాదిగా పనిచేస్తుంది.

Suvalakshmi News
ఇవి కూడా చదవండి :
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..