Actor : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. బిగ్బాస్ ఆఫర్ రెండుసార్లు రిజెక్ట్ చేశాడు.. ఎంట్రీ ఇస్తే కప్పు కొట్టేవాడే..
సీరియల్ హీరో.. అయినా అమ్మాయిల హృదయాలు గెలిచిన డ్రీమ్ బాయ్. బుల్లితెరపై సూపర్ స్టార్ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు హీరోగా వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇదెలా ఉంటే.. ప్రతి యాక్టర్ ఎదురుచూసే బిగ్ బాస్ ఆఫర్స్ రెండుసార్లు రిజెక్ట్ చేశాడు ఈ నటుడు. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినప్పటికీ సున్నితంగా తిరస్కరించాడట.

బుల్లితెరపై అతిపెద్ది రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటివరకు తెలుగులో 8 సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఆదివారం 9వ సీజన్ సైతం విజయవంతంగా పూర్తి చేసుకుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలోనూ ఈ షోకు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. జీవితంలో ఒక్కసారైనా ఈ షోకు వెళ్లాలని కలలు కంటారు చాలా మంది. కానీ ఎక్కువ శాతం సెలబ్రెటీలకు ఈ అవకాశం లభిస్తుంది. అలాగే నటీనటులు సైతం ఈ షోలోకి అడుగుపెట్టాలని ఎదురుచూస్తుంటారు. కానీ ఓ సీరియల్ నటుడు మాత్రం భారీగా పారితోషికం ఇస్తామని చెప్పినా రెండుసార్లు బిగ్ బాస్ షోను రిజెక్ట్ చేశారట. సీరియల్ హీరో అయినప్పటికీ అమ్మాయిలలో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరో అతడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటుడు మరెవరో కాదండి.. ముఖేష్ గౌడ.
ఇవి కూడా చదవండి : Actress : ఎక్కువగా కనిపించాలని ఆ డైరెక్టర్ ప్యాడింగ్ చేసుకోమన్నాడు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..
ముఖేష్ గౌడ.. ఈ పేరు చెబితే అసలు గుర్తుపట్టలేరు.. కానీ రిషి సార్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. గుప్పెడంత మనసు సీరియల్లో రిషి సార్ పాత్రలో నటించి మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు.. అమ్మాయిల డ్రీమ్ బాయ్ కూడా. ప్రస్తుతం అతడు తెలుగులో హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నటుడుకి తెలుగుతోపాటు కన్నడలోనూ బిగ్ బాస్ ఛాన్స్ వచ్చిందట. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ముఖేష్. ఇవి కూడా చదవండి : Jabardasth Emmanuel : చాలా వదులుకుని బిగ్బాస్ వరకు.. విన్నర్ కావాల్సినోడు.. ఇమ్మాన్యుయేల్ రెమ్యునరేషన్ ఎంతంటే..
ముఖేష్ గౌడకు ఇన్‌స్టాగ్రామ్‌లో మూడు లక్షలకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్నాడు. అయితే తెలుగులో అతడికి భారీ రెమ్యునరేషన్ తో బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందట. ఆ తర్వాత కన్నడ బిగ్ బాస్ సీజన్ 12లోనూ ఛాన్స్ వచ్చిందట. కానీ తనకు బిగ్ బాస్ షో అర్థం కాదని.. దాని కాన్సెప్ట్ కూడా తెలియదని.. అందుకే ఆ షో ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు తెలిపారు. ఈ షోలో గెలవడం అంత సులభం కాదని.. ఎలా ఉంటే గెలుస్తారు అనేది ఊహించడం కష్టమని చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : ఆ ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన కళ్యాణ్.. తనూజ గురించి ఆసక్తికర కామెంట్స్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : బిగ్బాస్ విజేతగా కళ్యాణ్ పడాల.. ప్రైజ్ మనీతోపాటు ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా.. ?




