Bigg Boss 9 Telugu : ఓడిపోయిన తనూజ.. వెక్కి వెక్కి లేడీ ఫ్యాన్.. వీడియో వైరల్..
ముద్ద మందారం సీరియల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫాలోయింగ్ సంపాదించుకుంది తనూజ. అదే క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్ 9లోకి అడుగుపెట్టింది. మొదటి నుంచి ఎక్కువ ఓటింగ్ తో విన్నర్ రేసులో దూసుకుపోయింది. చివరి వరకు ఈ సీజన్ విజేత తనూజ అనేంతగా పోటా పోటీ ఓటింగ్ వచ్చింది. చివరకు కళ్యాణ్ పడాల విజేతగా నిలిచాడు.

బిగ్ బాస్ సీజన్ 9 ముగిసింది. 105 రోజులపాటు ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన ఈ సీజన్ చివరకు ఊహించని ఫలితంతో ముగింపు పలికింది. వేలాది మందిని దాటుకుని ఫస్ట్ కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన కళ్యాణ్ పడాల.. చివరకు చరిత్ర సృష్టించాడు. కామనర్ కప్పు గెలిచి బిగ్ బాస్ హిస్టరీలోనే తనదైన ముద్ర వేశాడు. కానీ సీజన్ మొదటి నుంచి టైటిల్ ఫేవరేజ్ గా ప్రచారం పొందిన సీరియల్ నటి తనూజ రన్నరప్ గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే నాలుగో వారం నుంచి కళ్యాణ్ తన ఆట తీరు మార్చడంతో తనూజకు గట్టి పోటీ ఎదురైంది. ముఖ్యంగా ఫ్యామిలీ వీక్ తర్వాత కళ్యాణ్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా అతడి మాట తీరు, టాస్కులో అదరగొట్టడంతో రోజు రోజుకీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఊహించని విధంగా టైటిల్ రేసులో దూసుకొచ్చిన కళ్యాణ్.. చివరకు కప్పు గెలిచి సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు.
ఇవి కూడా చదవండి : Jabardasth Emmanuel : చాలా వదులుకుని బిగ్బాస్ వరకు.. విన్నర్ కావాల్సినోడు.. ఇమ్మాన్యుయేల్ రెమ్యునరేషన్ ఎంతంటే..
ఇదంతా పక్కన పెడితే .. మొదటి నుంచి టైటిల్ ఫేవరేట్ గా ఉన్న తనూజ ఓడిపోవడంతో ఆమె ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. తనూజకు అన్యాయం జరిగిందని.. విన్నర్ కావాల్సిన తనూజను రన్నరప్ చేశారంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే లేడీ ఫ్యాన్ మాత్రం తనూజ ఓడిపోవడంతో వెక్కి వెక్కి ఏడ్చేసింది. తనూజ రన్నర్ కావడం అస్సలు ఊహించలేదంటూ ఆ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : ఆ ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన కళ్యాణ్.. తనూజ గురించి ఆసక్తికర కామెంట్స్..
తనూజ విన్నర్ కానందుకు చాలా బాధగా ఉందని.. ఆడవాళ్లకు ఒక్కసారి కూడా గుర్తింపు రాదా.. ఎప్పుడూ గుర్తింపు రాదని.. వంటింట్లోనే ఉండిపోవాలా.. ?.. అంత సపోర్ట్ చేశారు కదా.. చివరి క్షణంలో ఏమైందీ.. తనూజ విన్నర్ కాలేదు. కళ్యాణ్ విన్నర్ అయినందుకు సంతోషంగానే ఉంది.. కానీ లేడీ విన్నర్ అయితే చూడాలని అనుకున్నా.. తనూజ విన్నర్ కానుందుకు చాలా బాధగా ఉంది అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : బిగ్బాస్ విజేతగా కళ్యాణ్ పడాల.. ప్రైజ్ మనీతోపాటు ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా.. ?
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Actress : ఎక్కువగా కనిపించాలని ఆ డైరెక్టర్ ప్యాడింగ్ చేసుకోమన్నాడు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..




